Bigg Boss 8 Telugu Latest Episode Highlights: బిగ్ బాస్ 8లో ప్రస్తుతం ఏడుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. అందులో అవినాష్ ఇప్పటికే ఫైనలిస్ట్‌గా చోటు దక్కించుకున్నాడు. దీంతో మిగతా ఆరుగురు ఫైనల్స్‌లో తమ స్థానం కోసం కష్టపడాలి. ఇక ఇందులో నుండి ఎవరు ఫైనల్స్‌కు వెళ్తారు, ఎవరు ఎలిమినేట్ అయ్యి బయటికి వెళ్తారు అని తెలుసుకోవడం కోసం చివరి నామినేషన్స్ ప్రక్రియ ప్రారంభమయ్యింది. అందులో నిఖిల్, గౌతమ్, విష్ణుప్రియా, రోహిణి.. ఈ నలుగురు నామినేషన్స్‌లోకి ఎంటర్ అయిపోయారు. చివరికి ప్రేరణ, నబీల్ మాత్రమే మిగిలారు. దీంతో వీళ్లిద్దరిలో ఒకరు ఫైనల్స్‌కు వెళ్లడానికి గల అవకాశాన్ని వారి చేతిలోనే పెట్టారు బిగ్ బాస్. దీంతో వారితో పాటు కంటెస్టెంట్స్‌కు కూడా ట్విస్ట్ ఇచ్చారు.
ఎంత రాస్తారు?
నామినేషన్స్‌లో చివరికి నబీల్, ప్రేరణ మాత్రమే సేఫ్ జోన్‌లో ఉన్నారు. దీంతో ఇద్దరిలో ఒకరు ఫైనలిస్ట్ అయ్యే అవకాశాన్ని వారికే ఇచ్చారు బిగ్ బాస్. వారి ముందు ఒక బ్లాంక్ చెక్ పెట్టి అందులో రూ.15 లక్షల వరకు అమౌంట్ రాసుకోవచ్చని, ఎవరైతే ఎక్కువ అమౌంట్ రాస్తారో వారు ఫైనలిస్ట్ అవుతారని తెలిపాడు. కానీ ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఆ చెక్ మీద రాసే అమౌంట్.. ప్రైజ్ మనీ నుండి కట్ అవుతాయని అన్నాడు. దీంతో కంటెస్టెంట్స్ అంతా ఎవరు ఎక్కువ అమౌంట్ రాస్తారా అని డిస్కషన్ మొదలుపెట్టారు. ఒక కంటెస్టెంట్‌ను నామినేట్ చేయడం కోసం నబీల్ రూ.50 వేలు ఖర్చుపెట్టాడని, ఇప్పుడు ఫైనలిస్ట్ అవ్వడం కోసం ఎంతైనా ఖర్చుపెడతాడని విష్ణుప్రియా అంచనా వేసింది.
Also Read: కంటెస్టెంట్స్ కి బంపర్ ఆఫర్… ప్రైజ్ మనీ తోపాటు కారు కూడా..
కలిసి ఒప్పించండి
అవినాష్, నిఖిల్ మాత్రం నబీల్ అసలు ఒక్క రూపాయి కూడా రాయడు అని నమ్మకంగా చెప్పారు. మొత్తానికి ప్రేరణ, నబీల్ తమకు తోచిన అమౌంట్‌ను ఆ చెక్స్‌లో రాశారు. కానీ వారు ఎంత రాశారు అనే విషయం ఎవ్వరితోనూ డిస్కస్ చేయొద్దు అని బిగ్ బాస్ రూల్ పెట్టారు. దీంతో బయటికి వచ్చిన తర్వాత నబీల్, ప్రేరణలో ఎవరో ఒకరు నామినేషన్స్‌లో ఉండేలా వారిని కంటెస్టెంట్స్ అంతా కలిసి ఒప్పించాలన్నారు బిగ్ బాస్. దీంతో గౌతమ్ ముందుకొచ్చి ఓటింగ్‌లో తక్కువగా ఉంటే ఇప్పుడు సేవ్ అయినా కూడా వచ్చే వారం వారే ముందు ఎలిమినేట్ అయిపోతారని, అందుకే దానికోసం ప్రైజ్ మనీని వేస్ట్ చేయొద్దని అన్నాడు. ఆ మాటకు ప్రేరణ, నబీల్ ఇద్దరూ ఒప్పుకున్నారు.
మొత్తం అమౌంట్
నబీల్, ప్రేరణ.. ఇద్దరిలో ఒకరే నామినేట్ అవ్వమని బిగ్ బాస్ చెప్పినా.. వారు మాత్రం ఇద్దరం నామినేట్ అవుతామని ముందుకొచ్చారు. ఒకరు నామినేట్ అయినా కూడా మరొకరు రాసిన చెక్‌లో ఉండే అమౌంట్ ప్రైజ్ మనీ నుండి కట్ అవుతుంది కాబట్టి ఇద్దరం నామినేట్ అవుతామని అన్నారు. అదే సమయంలో అసలు వారు చెక్స్‌లో ఎంత అమౌంట్ రాశారో అందరికీ చూపించమన్నారు బిగ్ బాస్. ప్రేరణ అయితే రూ.4,60,000 రాయగా నబీల్ మాత్రం రూ.15 లక్షలు రాశాడు. దీంతో కంటెస్టెంట్స్ అంతా షాకయ్యారు. మొత్తానికి ఆ రెండు చెక్స్ చింపేసి ఇద్దరూ నామినేషన్స్‌లో నిలబడ్డారు. తన స్వార్థం కోసం తాను రూ.15 లక్షలు రాసుకున్నా కూడా కంటెస్టెంట్స్ అందరినీ చూడగానే తన మనసు మారిపోయిందని అన్నాడు నబీల్.