IPS Officer: విధిరాతను ఎవరూ తప్పించలేరు. మనం ఒకటి తలుచుకుంటే.. దైవం మరొకటి తలుస్తుందని పెద్దల నోట వింటూ ఉంటాం. ఏ విషయంలో అయినా విధి ఎలా నిర్ణయిస్తే.. అలా జరుగుతుంది. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని.. ఎంతో కష్టపడి చదువుకుని.. తన కలలను నెరవేర్చుకున్నారు ఓ ఐపీఎస్ అధికారి.. మొదటి రోజు విధులు నిర్వహించేందుకు వెళుంతుండగా మార్గమధ్యలో యాక్సిండెంట్ జరిగి ప్రాణాలు కోల్పోయారు. తన ఆశలు కల్లల్లయ్యాయి. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది.
ఇటీవలె శిక్షణ పూర్తిచేసుకున్న కర్ణాటక కేడర్‌కు చెందిన 2023-బ్యాచ్ IPS అధికారి హర్షబర్దన్(26).. ఆదివారం హాసన్ జిల్లాలో తొలి రోజు విధులు నిర్వహించేందుకు బయల్దేరాడు. ఆయన ప్రయాణిస్తున్న వాహనం టైరు పగిలిపోవడంతో.. డ్రైవర్ నియంత్రణ కోల్పోయి పక్కనే ఉన్న చెట్టును డీకొన్నాడు. దీంతో హర్ష బర్దన్ తలకు బలమైన గాయలు అయ్యాయి. వెంటనే స్థానికులు గమిచించి ఆస్పత్రికి తరలించగా ఉపయోగంలేకుండా పోయింది. చికిత్స పొందుతూ హర్షబర్ధన్ మృతి చెందారు. డ్రైవర్‌కు స్వల్పగాయాలు అయ్యాయి. సంఘటన స్థలం నుండి వచ్చిన పుటేజ్‌లలో కారు నుజ్జు నుజ్జు అయింది.
ఈ ప్రమాదంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య స్పందించారు. హర్ష బర్దన్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. “సంవత్సరాల పాటు కష్టపడి ప్రతిఫలం లభిస్తున్నప్పుడు ఇలా జరిగి ఉండకూడదు” అని ఆయన అన్నారు. ఐపీఎస్ అధికారిగా బాధ్యతలు స్వీకరించేందుకు వెళుంతుడగా ఈ ప్రమాదం జరిగడం చాలా భాధాకరం అని తన ఎక్స్ వేదికగా తెలిపారు. హర్ష బర్ధన్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తున్నానని తెలిపారు.
Also Read: జస్టిస్ చంద్రచూడ్ వల్లే మసీదు, దేవాలయం గొడవలు.. ఒవైసీ మండిపాటు
ఇక ఇదే ఘటనపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సదానంద గౌడ స్పందించారు. భారతదేశం అంకిత భావంతో కూడిన యువ ఐపీఎస్ అధికారని కోల్పోయిందని ఎక్స్ వేదికగా తెలిపారు. బర్ధన్ హోలెనరసిపూర్‌లో ప్రొబేషనరీ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా డ్యూటీలో రిపోర్ట్ చేయడానికి హాసన్‌కు వెళుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
తాజా నివేధిక ప్రకారం హర్ష బర్ధన్ నాలుగు వారాల క్రితం మైసూర్ కర్ణాటక పోలీసు అకాడమీలో శిక్షణ పూర్తిచేసుకున్నట్లు తెలుస్తోంది.
Tragic loss of 2023 batch IPS probationer Harsha Vardhan in a road accident near Hassan. He was on his way for district training after completing KPA training.
India has lost a dedicated young officer in the making. pic.twitter.com/toX1l2Nc25
— Sadananda Gowda (@DVSadanandGowda) December 1, 2024