BigTV English
Advertisement

Pushpa 2 Song: తోక ముడిచిన పుష్ప రాజ్.. ‘దమ్ముంటే పట్టుకోరా షెకావత్’ సాంగ్ డిలీట్

Pushpa 2 Song: తోక ముడిచిన పుష్ప రాజ్.. ‘దమ్ముంటే పట్టుకోరా షెకావత్’ సాంగ్ డిలీట్

Pushpa 2 Song: ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ (Allu Arjun) చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఇదంతా తను ‘పుష్ప 2’ పెయిడ్ ప్రీమియర్స్ కోసం ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోనే సంధ్య థియేటర్‌కు వెళ్లినప్పటి నుండే మొదలయ్యింది. పెయిడ్ ప్రీమియర్స్‌కు అల్లు అర్జున్ థియేటర్‌కు వెళ్లడంతో తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ మృతిచెందిందనే విషయం తెలిసిందే. ఈ విషయంలో అల్లు అర్జున్‌పై పోలీసులు ఆగ్రహంతో ఉన్నారు. పైగా ఆయన ఓపెన్‌గా చెప్తు్న్నవన్నీ అబద్ధాలు అని ఆరోపణలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్న సమయంలో ‘పుష్ప 2’ మేకర్స్ ఒక డేరింగ్ స్టెప్ తీసుకున్నారు. కానీ వెంటనే తప్పు తెలుసుకొని వెనక్కి తగ్గారు.


వైరల్ పాట

‘పుష్ప 2’ సినిమాలో అల్లు అర్జున్.. పుష్పరాజ్ అనే గంధపు చెక్కల స్మగ్లర్‌గా కనిపించాడు. తనను నిరంతరం పట్టుకోవాలని కష్టపడే పోలీస్ ఆఫీసర్ షెకావత్ పాత్రలో ఫాహద్ ఫాజిల్ నటించాడు. ఈ సినిమాలో ఒక సందర్భంలో షెకావత్‌కు పుష్పరాజ్ వార్నింగ్ ఇస్తాడు. అదే సమయంలో ‘దమ్ముంటే పట్టుకోరా షెకావత్.. పట్టుకుంటే వదిలేస్తా సిండికేటు’ అని అంటాడు. ఆ సీన్‌లో అల్లు అర్జున్ యాక్షన్, ఆ డైలాగ్.. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. పైగా ఆ సీన్‌లో వచ్చే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో కలిపి ఇదొక సాంగ్‌లాగా ఉందని ప్రేక్షకులు తెగ వైరల్ చేశారు. అదే విషయాన్ని మూవీ టీమ్ క్యాచ్ చేసింది.


Also Read: ఎంక్వైరీలో అల్లు అర్జున్ మౌనం.. ఆయన సమాధానాలు ఇవ్వని ప్రశ్నలు ఏంటంటే.?

ఇన్‌డైరెక్ట్ వార్నింగ్

‘దమ్ముంటే పట్టుకోరా షెకావత్’ అంటూ ఒక ర్యాప్ సాంగ్‌ను విడుదల చేశారు మేకర్స్. టీ సిరీస్ యూట్యూబ్ ఛానెల్‌లో ఈ పాట అందుబాటులోకి వచ్చింది. ఈ పాటను ‘పుష్ప 2’ విడుదలకు ముందు రిలీజ్ చేసుంటే పెద్దగా హైలెట్ అయ్యేది కాదేమో.. కానీ సినిమా విడుదలయ్యి, దాని ప్రీమియర్స్ వల్ల ఒక మహిళ చనిపోయి.. పెద్ద రచ్చ జరిగిన తర్వాత విడుదల చేశారు కాబట్టి ఈ విషయం ప్రేక్షకుల్లో హాట్ టాపిక్‌గా మారింది. దమ్ముంటే పట్టుకోరా అంటూ అల్లు అర్జునే ఇన్‌డైరెక్ట్‌గా పోలీసులకు వార్నింగ్ ఇస్తున్నట్టుగా ఉందని చాలామంది ఫీలవుతున్నారు. దీంతో టీ సిరీస్‌తో పాటు ‘పుష్ప 2’ మేకర్స్ వెనక్కి తగ్గారు.

24 గంటల లోపే

‘దమ్ముంటే పట్టుకోరా షెకావత్’ (Dammunte Pattukora Shekhawat) అంటూ ‘పుష్ప 2’ (Pushpa 2) నుండి విడుదల చేసిన ర్యాప్ సాంగ్‌ను వెంటనే యూట్యూబ్ నుండి తొలగించారు మేకర్స్. ఈ పాట విడుదలయ్యి 24 గంటలు కూడా అవ్వలేదు. ఇంతలోనే దీనిని యూట్యూబ్ నుండి తొలగించారు. దీంతో పుష్పరాజ్ తోక ముడిచాడని, పోలీసులతో పెట్టుకుంటే తప్పించుకోవడం అంత ఈజీ కాదని ప్రేక్షకులు అనుకుంటున్నారు. అల్లు అర్జున్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తను చేసింది ఒక విధంగా తప్పే అని, రేవతి మృతికి ప్రధాన కారణం తనే అని చాలామంది ఫీలవుతున్నారు. కానీ పలువురు ఫ్యాన్స్ మాత్రం ఇప్పటికీ అల్లు అర్జున్‌కు సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేస్తున్నారు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×