Pushpa 3 ..అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా , రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్గా ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘పుష్ప’. ఇందులో ఫహద్ ఫాజిల్ (Fahad fazil), అనసూయ (Anasuya), సునీల్ (Sunil) తదితరులు కీలకపాత్రలు పోషించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది. ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. అంతేకాదు అల్లు అర్జున్ కు నేషనల్ అవార్డు అందించి, తెలుగు నాట మొట్టమొదటి నేషనల్ అవార్డు అందుకున్న హీరోగా అల్లు అర్జున్ ను నిలబెట్టింది ఈ సినిమా. ఈ సినిమాతో ఒక్క సౌత్ కే పరిమితమైన అల్లు అర్జున్ నార్త్ లో కూడా ఊహించని క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఇకపోతే పుష్ప సినిమాను ఒక ప్రాజెక్టుగానే ఫినిష్ చేద్దామనుకున్న సుకుమార్ కి రాజమౌళి (Rajamouli ) రెండు భాగాలుగా తీయమని సలహా ఇచ్చారట. అయితే ఇప్పుడు అది మూడవ భాగానికి దారి తీసింది. పుష్ప తర్వాత గత ఏడాది డిసెంబర్ 5వ తేదీన పుష్ప 2 కూడా రిలీజ్ చేసి, మిగిలి ఉన్న రికార్డులను కూడా ఈ సినిమాతో బ్రేక్ చేశారు.
పుష్ప 3.. ఇప్పట్లో వర్కౌట్ అయ్యేనా..?
అంతేకాదు పుష్ప 2 సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.1800 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి, ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన రెండవ చిత్రంగా ఈ సినిమా నిలిచింది.. ఒక తెలుగు సినిమా కేవలం బాలీవుడ్ లో రూ. 800 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి అక్కడ కూడా ఒక రికార్డు క్రియేట్ చేసింది ఈ సినిమా. ఇకపోతే ఈ రెండు సినిమాలతో పుష్ప మేనియా అయిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా పుష్ప 3 ది ర్యాంపేజ్ అంటూ మళ్ళీ మరో భాగాన్ని ప్రకటించారు మేకర్స్. అయితే ఇది ఎప్పుడు ప్రారంభమవుతుంది అన్నది డాలర్ల ప్రశ్నగా మారిపోయింది. ఈ మధ్యనే మైత్రి మూవీ నిర్మాత 2028లో పుష్ప3 ఉంటుందని అన్నారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూస్తూ ఉంటే ఇది వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు. ఎందుకంటే అల్లు అర్జున్ ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ (Atlee)దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా హంగామా చూస్తే కనక హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోవడం లేదు అన్నట్టుగా ఉంది. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ భారీ బడ్జెట్లో ఈ సినిమా ప్లాన్ చేస్తున్నారు. దీనికి తోడు 250 కోట్ల రూపాయలను విఎఫ్ఎక్స్ కోసమే కేటాయించారు అంటే ఈ సినిమా ఏ రేంజ్ లో ప్రేక్షకులకు ముందు రాబోతుందో అర్థం చేసుకోవచ్చు. ఇక దాని కెపాసిటీని బట్టి సమయం కూడా పడుతుంది. అంటే మరో మూడేళ్లు ఈ సినిమా కోసం అల్లు అర్జున్ పని చేయాల్సిందే.
ALSO READ ; Balakrishna: 20 రోజులకు మరీ ఇన్ని కోట్లా..? జైలర్ 2కు బాలయ్య కెరీర్ లోనే హైయెస్ట్ రెమ్యునరేషన్
వరుస లైనప్ తో బిజీగా మారిన బన్నీ..
ఇటు త్రివిక్రమ్ (Trivikram) కూడా అల్లు అర్జున్తో సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. ఇతిహాసాల నేపథ్యంలో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమా వస్తుందని ముందే ప్రకటించారు. అయితే ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉండగా.. అట్లీ సినిమాను కన్ఫర్మ్ చేశారు అల్లు అర్జున్. ఈ సినిమా కూడా చాలా సమయం తీసుకునేలా కనిపిస్తోంది . కాబట్టి ఈ రెండు సినిమాలు పూర్తి చేసి కానీ అల్లు అర్జున్ పుష్ప 3 చేసే పరిస్థితి లేదు.ఇక అట్లీ సినిమా పూర్తి అయిన వెంటనే త్రివిక్రమ్ సినిమా చేశాక పుష్ప3ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. ఇక్కడ అల్లు అర్జున్ మాత్రమే కాదు సుకుమార్ కూడా ఖాళీగా లేరని తెలుస్తోంది. ప్రస్తుతం సుకుమార్ రామ్ చరణ్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. అటు రామ్ చరణ్ కూడా బుచ్చిబాబుతో సినిమా అయిన తర్వాత సుకుమార్ కి అవకాశం ఇస్తారు.ఈ సినిమాకి కూడా సమయం పట్టేలా ఉంది. ఇలా మొత్తానికి అయితే పుష్ప3 ఇప్పట్లో వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు. మరి మేకర్స్ ఎలాంటి ప్లానింగ్ చేస్తారో చూడాలి.