HBD R.Madhavan: ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకున్న ఆర్. మాధవన్ (R.Madhavan) ఎంతోమంది అమ్మాయిల కలల రాకుమారుడు. ఈయన అసలు పేరు రంగనాథన్ మాధవన్. 1970 జూన్ 1న జంషెడ్ పూర్ బీహార్లో తమిళ కుటుంబంలో జన్మించారు. ఈయన తండ్రి రంగనాథన్ (Ranganathan) .. టాటా స్టీల్ లో మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ గా పని చేయగా.. తల్లి సరోజా(Saroja )బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్ గా పనిచేసేవారు. ఈయనకు చెల్లెలు దేవిక (Devika)ఉంది. ఆమె యూకే లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. బీహార్ లో పుట్టిన ఈయన తమిళ్ కుటుంబంలో పుట్టడం వల్ల తమిళ్ మాట్లాడుతూ పెరిగారు.
ఆర్.మాధవన్ కెరియర్..
వయసు వచ్చాక ఇండస్ట్రీలోకి రావాలనుకున్న ఈయనకు టీవీ పరిశ్రమ మొదట ఆహ్వానం పలికింది.అలా 1993లో ‘యూల్ లవ్ స్టోరీ’ తో ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఆ తర్వాత హిందీ, ఇంగ్లీష్ భాషలలో టెలివిజన్ రంగంలో పనిచేసిన ఈయన.. మొదటిసారి 1996 లో ‘ఇజ్ రాత్ కీ సుభా నహి’ అనే హిందీ చిత్రంలో ఒక పాటలో గాయకుడిగా కనిపించి ఆకట్టుకున్నారు. ఇక తర్వాత ఇంగ్లీష్, కన్నడ సినిమాలలో నటించిన మాధవన్ 2000 సంవత్సరంలో వచ్చిన ‘అలైపాయుతే’ అనే సినిమా ద్వారా తమిళ రంగ ప్రవేశం చేశారు. తమిళంలో విడుదలైన ‘మిన్నలే’ అనే సినిమాను తెలుగులో ‘సఖి’గా విడుదల చేయడంతో అలా తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమయ్యారు. ప్రస్తుతం దక్షిణాదిలోనే కాదు నార్త్ లో కూడా భారీ పాపులారిటీ అందుకున్న మాధవన్ పుట్టినరోజు ఈరోజు కావడంతో ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన ఆస్తుల వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. మరి ఆర్.మాధవన్ ఆస్తుల వివరాలు ఎంత అనే విషయం ఇప్పుడు చూద్దాం.
ఆర్ మాధవన్ ఆస్తుల వివరాలు..
ప్రస్తుతం మాధవన్ హీరో గానే కాకుండా పలు చిత్రాలలో కీలక పాత్రలు కూడా పోషిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అంతేకాదు పలు ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. ఇక తన స్టేటస్ కి తగ్గట్టుగా హుందాగా వ్యవహరించే ఆర్.మాధవన్ గత ఏడాది ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతంగా పేరు సొంతం చేసుకున్న బాంద్రాలో కుర్లా కాంప్లెక్స్ లో ఒక అందమైన ఫ్లాట్ ని కొనుగోలు చేశారు. దాని ఖరీదు సుమారుగా రూ.17.5 కోట్లు అని సమాచారం. ఇక ఆ కొత్త అపార్ట్మెంట్ చూడడానికి విశాలంగా ఉంటుంది. దాని విస్తీర్ణం 389 చదరపు మీటర్లు, రెండు పార్కింగ్ స్థలాలతో పాటు హై ఎండ్ సిగ్నియా పెర్ల్ భవనం లాగా అనిపిస్తుంది. ఈ ఫ్లాట్ కొనుగోలు చేసేటప్పుడు రూ.1.05 కోట్ల స్టాంపు డ్యూటీ తో పాటు రూ.30 వేల రిజిస్ట్రేషన్ ఫీజు కూడా చెల్లించారు మాధవన్. ఇకపోతే ఇప్పటివరకు ఈయన నికర ఆదాయం విలువ సుమారుగా రూ.130 కోట్లు ఉంటుందని సమాచారం.
ఆర్.మాధవన్ లగ్జరీ కార్లు..
మాధవన్ దగ్గర అత్యంత ఖరీదైన ఆస్తులు గా చెప్పుకునే వాటిలో ప్రధమంగా.. మాధవన్ దగ్గర ఖరీదైన ఇల్లే కాదు అత్యంత ఖరీదైన షిప్ కూడా ఉంది. ఇటీవల బాంద్రాలో మరో ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశారు. ఇక ఈయన కారు ప్రేమికుడు అన్న విషయం అందరికీ తెలిసిందే. అందులో భాగంగానే బిఎండబ్ల్యూ, ఆడి, రేంజ్ రోవర్ వంటి లగ్జరీ కార్లను కొనుగోలు చేశారు. ఇకపోతే సూపర్ బైకులను ఇష్టపడే ఈయన బీఎండబ్ల్యూ K1600 GTL కూడా ఈయన వద్ద ఉంది. ఇక రూ.46 లక్షల విలువైన ఇండియన్ రోడ్ మాస్టర్ క్రూయిజర్ ని కూడా కలిగి ఉన్నాడు. ఇలా మొత్తానికైతే తన సినిమాలతోనే కాదు ఆస్తుల వివరాలతో కూడా అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు మాధవన్.
ALSO READ:Big TV Kissik Talks: వారి వల్లే హోస్టింగ్ మానేశా.. నిజాలు బయటపెట్టిన మానస్!