Virat Kohli: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( IPL 2025) నేపథ్యంలో… ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. రెండో క్వాలిఫైయర్ మ్యాచ్ లో భాగంగా పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య ఇవాళ సాయంత్రం ఉంది. రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానున్న ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో నిర్వహించనున్నారు. ఇందులో విజయం సాధించిన జట్టు నేరుగా ఫైనల్ కి వెళ్లి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తలపడుతుంది. ఇలాంటి నేపథ్యంలో ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ పై ఉత్కంఠత నెలకొంది.
Also Read: RCB Fan: RCB టైటిల్ గెలవకపోతే.. సూ**సైడ్ చేసుకుంటా.. లేడీ సంచలన వీడియో
క్షుద్ర పూజలు చేస్తున్న విరాట్ కోహ్లీ
ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో… రాయల్ చాలెంజెస్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు నేటిజన్స్. క్వాలిఫైయర్ రెండవ మ్యాచ్లో పంజాబ్ చేతిలో ముంబై ఇండియన్స్ ఓడిపోవాలని… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు అభిమానులు కోరుకుంటున్న సంగతి తెలిసిందే. దీనికి కారణం లేకపోలేదు. ఒకవేళ ఫైనల్ కు ముంబై ఇండియన్స్ వస్తే… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఓడిపోవడం పక్కా అని అంచనాలు వేస్తున్నారు. ఏది చేసినా ముంబై ఇండియన్స్ విజయం సాధిస్తుంది.
అంపైర్లను కొనుగోలు చేసి , లేదా తొండాట ఆడి.. ఏదైనా కుట్ర చేసైనా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును ముంబై ఇండియన్స్ చిత్త చేసి ఆరోసారి టైటిల్ గెలుచుకునే ప్రమాదం పొంచి ఉంది. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేస్తున్నారు జనాలు. ఇప్పటివరకు మూడుసార్లు ఫైనల్ కు వచ్చిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు.. ఈసారి గెలవకపోతే లైఫ్ లో ఛాంపియన్ కావడం కష్టమే. దీంతో ముంబై ఇండియన్స్ ఓడిపోవాలని బెంగళూరు అభిమానులు కోరుకుంటున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే విరాట్ కోహ్లీ క్షుద్ర పూజలు చేస్తున్నట్లు ఓ వీడియోను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఓ మంత్రగాడి వేషంలో విరాట్ కోహ్లీ వచ్చి… ముంబై ఇండియన్స్ ఓడిపోవాలని పూజలు చేస్తున్న వీడియోను.. సోషల్ మీడియాలో పెట్టి రచ్చ చేస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారి…. అందరినీ ఆకట్టుకుంటుంది.
కోహ్లీ పై సెటైర్లు పేల్చుతున్న ఫ్యాన్స్
ముంబై ఇండియన్స్ క్వాలిఫైయర్ రెండవ మ్యాచ్ లో ఓడిపోవాలని విరాట్ కోహ్లీ క్షుద్ర పూజలు చేస్తున్న నేపథ్యంలో… కోహ్లీ ని ఒక ఆట ఆడుకుంటున్నారు ముంబై అభిమానులు. దమ్ముంటే తమ పైన గెలవాలని సవాల్ విసురుతున్నారు. పోటా పోటీ పడితేనే.. విజయమని, ఇలా క్షుద్ర పూజలు చేయడం ఏంట్రా అంటూ కోహ్లీని, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానుల పరువు తీస్తున్నారు.
Also Read: PBKS vs MI, Qualifier 2: ముంబై VS పంజాబ్ మ్యాచ్ కు వర్షం పడితే.. విజేత ఎవరు