BigTV English
Advertisement

R Madhavan: ఆ వ్యక్తి వల్లే సినిమాలు మానేశాను.. ఇన్నేళ్లకు నోరువిప్పిన హీరో

R Madhavan: ఆ వ్యక్తి వల్లే సినిమాలు మానేశాను.. ఇన్నేళ్లకు నోరువిప్పిన హీరో

R Madhavan: ఎంత పెద్ద స్టార్ హీరోలు అయినా, ఎన్ని హిట్లు కొట్టినా ఏదో ఒక సమయంలో సినిమాలు మానేయాలనే ఆలోచన వచ్చే ఉంటుంది. పలువురు హీరోలు ఇప్పటికే తమకు అలాంటి ఆలోచన వచ్చిందని బయటపెట్టారు. అలాంటి వారిలో తాజాగా మాధవన్ కూడా యాడ్ అయ్యాడు. కెరీర్ మొదటినుండే లవ్ స్టోరీల్లో నటించి ప్రేక్షకుల దృష్టిలో చాక్లెట్ బాయ్‌గా మిగిలిపోయాడు మాధవన్. తను ఎక్కువగా తమిళ సినిమాల్లోనే నటించినా తనకు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలాంటి మాధవన్‌కు ఒకసారి సినిమాలు మానేసి అన్నింటికి దూరంగా వెళ్లిపోవాలనే ఆలోచన వచ్చిందని బయటపెట్టాడు. ఆ తర్వాత తనేం చేశాడో చెప్పుకొచ్చాడు.


చూసి నవ్వాడు

‘‘నేను సినిమాల నుండి బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే నేను చేస్తున్న పనిలో నేను పూర్తిగా లీనమయిపోయాను. నాకు వేరే ప్రపంచం తెలియకుండా పోయింది. ఒకసారి స్విట్జర్ల్యాండ్‌లో ఒక తమిళ సాంగ్ షూటింగ్ జరుగుతోంది. నాకు బాగా గుర్తుంది అప్పుడు నేను ఆరెంజ్ ప్యాంట్, గ్రీన్ షర్ట్ వేసుకొని మ్యూజిక్‌ను ఎంజాయ్ చేస్తున్నాను. రోడ్డుకు మధ్యలో నిలబడి ఉన్నాను. అప్పుడే అక్కడికి ఒక రైతు వచ్చాడు. మమ్మల్ని అందరినీ చూసి ఏంటో వీళ్లు చేస్తున్న పని అన్నట్టుగా తల ఊపాడు. అప్పుడే తనతో నువ్వు చెన్నైకు రా నేనేంటో చూపిస్తా అన్నాను. అతడు చూసిన చూపు నాకు నచ్చలేదు కానీ నిజానికి నేను వేరే వారి మ్యూజిక్‌కు ఆడుతున్నాను అని వెంటనే గ్రహించాను’’ అని చెప్పుకొచ్చాడు మాధవన్.


చదువుకోని వాడిని కాదు

‘‘నేను చాలా చేయగలను కానీ అవేవి నా సినిమాల్లో నేను చూపించడం లేదు. బీ, సీ సెంటర్ల ఆడియన్స్‌ను ఇంప్రెస్ చేయడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నాను. నా తప్పు నేను తెలుసుకున్నాను. ఏ కోణంలో కూడా నేను చదువుకోని వాడిలాగా లేను అని గ్రహించాను’’ అని చెప్తూ ఆ తర్వాత తను ట్రావెలింగ్‌నే పనిగా పెట్టుకున్నానని బయటపెట్టాడు మాధవన్ (Madhavan). ఒకరోజు లేచి తను సడెన్‌గా సినిమాల నుండి, అన్నింటి నుండి బ్రేక్ తీసుకోవాలని డిసైడ్ అయినట్టుగా తెలిపాడు. ఆ విషయాన్ని తన భార్యకు ట్రావెలింగ్ మొదలుపెట్టానని గుర్తుచేసుకున్నాడు. అలా మాధవన్ కెరీర్‌లో మధ్యలో చాలానే గ్యాప్ వచ్చింది. ఆ సమయంలో తను అసలు ఏం చేశాడో కూడా చెప్పుకొచ్చాడు.

Also Read: ధనుష్ మోసం చేశాడు, రాజకీయ జోక్యం వల్లే ఇదంతా జరుగుతుంది.. నిర్మాత ఆరోపణలు

అన్నీ తెలుసుకున్నాను

‘‘అసలు ప్రపంచం ఎటు పోతుందో అర్థం చేసుకోవాలని అనుకున్నాను. ఎలాంటి పనులు చేస్తే ప్రజలు ప్రశంసిస్తారో తెలుసుకోవాలని అనుకున్నాను. యాక్టింగ్ మానేశాను. యాడ్స్ కూడా చేయలేదు. గడ్డం పెంచుకున్నాను. ఇండియా మొత్తం ట్రావెల్ చేసి అసలు విలువైనది ఏంటో అర్థం చేసుకున్నాను. రిక్షావాళ్లు ఎలా మాట్లాడుతున్నారో విన్నాను. అలా నేను నాలుగేళ్లు నేర్చుకున్న విషయాలపైనే నేను ఇప్పుడు జీవిస్తున్నాను’’ అని చెప్పుకొచ్చాడు మాధవన్. కమ్ బ్యాక్ ఇచ్చిన తర్వాత మాధవన్ చాలా బిజీ అయిపోయాడు. ప్రస్తుతం తను లీడ్ చేస్తున్న ‘టెస్ట్’ అనే మూవీ నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలకు సిద్ధమయ్యింది.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×