BigTV English

Raashi Khanna: ఐఏఎస్ టార్గెట్.. మరి ఇండస్ట్రీలోకి రావడానికి కారణం..?

Raashi Khanna: ఐఏఎస్ టార్గెట్.. మరి ఇండస్ట్రీలోకి రావడానికి కారణం..?

Raashi Khanna..సాధారణంగా పిల్లల్ని ఎవరైనా ఏమైనా భవిష్యత్తులో ఏమవుతావని అడిగితే .. కచ్చితంగా ఐఏఎస్, ఐపీఎస్, ఇంజనీర్, లాయర్, డాక్టర్ ఇలా ఉన్నత పదవులే చెప్పుకొస్తారు. అయితే భవిష్యత్తు కాలంలో వారు ఏమవుతారు అనేది కాలమే నిర్ణయిస్తుంది. సరిగ్గా ఈ విషయం సెలబ్రిటీలకు కూడా వర్తిస్తుంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా సెలబ్రిటీలు ఇండస్ట్రీ లోకి రాకముందు ఉద్యోగం చేయాలి.. బాగా సంపాదించాలి అని కలలు కంటారు.అయితే యుక్త వయసుకు వచ్చిన తర్వాత సినిమాల పైన ఆసక్తి పెరగడం లేదా ఎవరో ఒకరు సినిమాల వైపు ప్రోత్సహించడం వల్ల ఇండస్ట్రీలోకి వచ్చి ఇప్పుడు స్టార్ సెలబ్రిటీగా మారుతూ ఉంటారు. అలాంటి వారిలో రాశీ ఖన్నా కూడా ఒకరు. ఐఏఎస్ అవ్వాల్సిన ఈమె ఇలా హీరోయిన్ గా మారడం వెనుక ఉన్న అసలు కథ ఏంటో ఇప్పుడు చూద్దాం.


మొదటి సినిమాతోనే భారీ పాపులారిటీ..

ఊహలు గుసగుసలాడే అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రాశీ ఖన్నా గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో నటించి మంచి పేరు దక్కించుకుంది. ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ్లో కూడా కొన్ని సినిమాలు చేసి ఆకట్టుకున్న ఈమె.. ఈ మధ్య టాలీవుడ్, కోలీవుడ్లో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ కి వెళ్లిపోయింది. అక్కడైనా సక్సెస్ అందుకుందా అంటే అదీ లేదు. సరైన సక్సెస్ లభించక అక్కడ కూడా సక్సెస్ కోసం ఆరాటపడుతోంది ఈ ముద్దుగుమ్మ.


ఐఏఎస్ అవ్వాలనుకున్నాను..

అయితే ఇదిలా ఉండగా ఇటీవల ఒక సమ్మిట్ లో పాల్గొన్న ఈమె.. తాను తన కెరియర్ లో ఏం అవ్వాలనుకున్నాను అనే విషయాన్ని చెప్పుకొచ్చింది. నా జీవితంలో నేను అనుకున్నది ఏదీ కూడా జరగలేదు. అందుకే నేను విధిని నమ్ముతాను. నేను కోరుకున్నది ఇప్పటివరకు నాకు ఏది దక్కలేదు. వాస్తవానికి నేను ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకున్నాను. అది జరగలేదు. సాధారణంగా మధ్యతరగతి కుటుంబాలలో పెరిగే వారు ఒక మంచి సేఫ్టీ ఉద్యోగం కావాలని ఆశపడతారు. నేను కూడా ఐఏఎస్ అయితే రక్షణగా ఉంటుంది అని ఖచ్చితంగా చేయాలి అనుకున్నాను. ప్రతి సబ్జెక్టులో కూడా నేను టాపర్ కూడా.. అయితే నేను ఒకటి అనుకుంటే దేవుడు ఇంకొకటి అనుకున్నాడు.అందుకే దేవుడు అనుకున్న దాని ప్రకారము ఇప్పుడు నా కెరియర్ ముందుకు సాగుతోంది అంటూ చెప్పుకొచ్చింది రాశీ ఖన్నా.

ప్రపంచంలో భద్రత లేని జాబ్ హీరోయిన్..

ఇక హీరోయిన్ అవ్వడం గురించి మాట్లాడుతూ.. హీరోయిన్ అయ్యే అవకాశం వచ్చింది. ఇంతకంటే అదృష్టం ఇంకేముంటుంది. అయితే అందరికీ అలా ఉండదు. నటీనటులు అవ్వడం అనేది ఎంతో కష్టంతో కూడుకున్న పని. రంగుల ప్రపంచంలో ఒక నటిగా సెటిల్ అవ్వాలి అంటే దానికి ఎంతో కష్టంతో పాటు అదృష్టం కూడా ఉండాలి. ఆ అదృష్టం ఇప్పుడు నాకు లభించింది. ఒక రకంగా చెప్పాలి అంటే ప్రపంచం మొత్తంలో భద్రత లేని జాబ్ ఏదైనా ఉంది అంటే అది సినిమా మాత్రమే అంటూ  కామెంట్లు చేయగా.. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.

Tags

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×