Radhika Apte: ఒకప్పుడు పెళ్లయితే హీరోయిన్ల సినీ కెరీర్‌కు బ్రేక్ పడినట్టే అనుకునేవారు ప్రేక్షకులు. అది నిజం చేసేలా చాలామంది స్టార్ హీరోయిన్లు సైతం పెళ్లయిన తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ ఫ్యామిలీ లైఫ్‌లో బిజీ అయిపోయారు. కానీ గత కొన్నేళ్లలో పరిస్థితులు చాలా మారిపోయాయి. పెళ్లి అవ్వడమే కాదు.. పిల్లల్ని కన్న తర్వాత కూడా సినిమాలు చేయడానికి ముందుకొస్తున్నారు హీరోయిన్లు. అలాంటి వారిలో రాధిక ఆప్తే ఒకరు. ఓటీటీ క్వీన్‌గా పేరు తెచ్చుకున్న రాధిక.. రెండు నెలల క్రితం ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా తన బిడ్డను వదిలి ఒక అవార్డ్ ఫంక్షన్‌కు అటెండ్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ. కానీ అక్కడ తను చేసిన పని వల్ల ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వస్తోంది.
అవార్డ్ ఫంక్షన్‌లో సందడి
థియేటర్లలో విడుదలయిన సినిమాలకంటే ఓటీటీలో విడుదలయిన సినిమాలు, వెబ్ సిరీస్‌లతోనే ఎక్కువగా పాపులారిటీ దక్కించుకుంది రాధిక ఆప్తే (Radhika Apte). ఓటీటీలో హిందీ మూవీ, సిరీస్ విడుదల అవుతుందంటే చాలు.. అందులో రాధిక కచ్చితంగా ఉంటుందని ఆడియన్స్ సైతం ఫిక్స్ అయిపోయారు. అలా తను తాజాగా నటించిన ‘సిస్టర్ మిడ్‌నైట్’ అనే మూవీ ఏకంగా బాఫ్తా అవార్డులకు నామినేట్ అయ్యింది. అందులో హీరోయిన్‌గా నటించింది కాబట్టి రాధిక కూడా ఈ అవార్డ్ ఫంక్షన్‌కు వెళ్లాల్సి వచ్చింది. అందుకే తనకు బిడ్డ పుట్టిన రెండు నెలల తర్వాత పాపను వదిలేసి మొదటిసారి అంత దూరం వెళ్లింది. అక్కడ తన ఎక్స్‌పీరియన్స్‌ను సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంది.
ఇండస్ట్రీలో ఇలా లేరు
బాఫ్తా అవార్డ్ ఫంక్షన్‌కు వెళ్లే ముందు తాను ఏం చేస్తున్నానో చెప్తూ ఒక ఫోటోను షేర్ చేసింది రాధిక ఆప్తే. అందులో తను ఒక చేతిలో షాంపేన్. మరొక చేతిలో చనుబాలు పంప్ చేసే మెషీన్‌తో కనిపించింది. ‘ఇదే బాఫ్తా రియాలిటీ. నేను ఈ అవార్డ్ ఫంక్షన్‌ను వచ్చేలా చేసినందుకు నటాషాకు చాలా థాంక్యూ. తను నా చనుబాలు పంప్ చేసే టైమింగ్స్‌తోనే అన్నీ సెట్ అయ్యేలా చేసింది. తను నా చనుబాలు పంప్ చేయడంలో సాయం చేయడంతో పాటు నాకు బాత్రూమ్‌లోకే షాంపేన్ తెచ్చిపెట్టింది. కొత్తగా తల్లి అయ్యిండి పని చేయడం అనేది చాలా కష్టం. ముఖ్యంగా సినీ పరిశ్రమలో ఇలా సాయం చేసేవారు చాలా తక్కువ’ అంటూ చెప్పుకొచ్చింది.
Also Read: వాళ్లు పెద్ద స్టార్లు కాదు.. ఆ హీరో, హీరోయిన్‌ను అవమానించిన కరణ్ జోహార్
నెటిజన్ల కామెంట్స్
రాధిక ఆప్తే చనుబాలు పంప్ చేసి తన కూతురికి ఇవ్వడం మంచి విషయమే కానీ.. అలా ఒక చేతిలో మద్యాన్ని పట్టుకొని మరొక చేతితో చనుబాలు పంప్ చేయడం కరెక్ట్ కాదని నెటిజన్లు ఫీలవుతున్నారు. దీంతో ఈ బ్యూటీపై నెగిటివిటీ మొదలయ్యింది. అసలు పిల్లలకు తల్లి పాలు ఇస్తున్నప్పుడు మద్యం లాంటిది సేవించడమే కరెక్ట్ కాదని తనను తిట్టిపోస్తున్నారు. ఆ కామెంట్స్ అన్నీ పట్టించుకోకుండా రాధిక.. తన బాఫ్తా ఎక్స్‌పీరియన్స్ గురించి షేర్ చేసుకుంది. ‘డెలివరీ అయ్యి రెండు నెలలే అయ్యింది. రెండు గంటలు మాత్రమే నిద్ర ఉంది’ అంటూ కష్టాల గురించి చెప్పుకొచ్చింది రాధిక ఆప్తే.