Benz Movie Update: కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న నటుడు, దర్శకుడు, డాన్స్ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్(Raghava Lawrence) ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈయన ప్రస్తుతం కాంచన 4 సినిమాతో పాటు మరొక డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj)రూపొందించిన తన లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (Lokesh Cinematic Universe)లో కూడా భాగమైన విషయం మనకు తెలిసిందే. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కోలీవుడ్ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలోనే స్టార్ డైరెక్టర్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఈయన తన సినిమాలను ఒకదానితో మరొకటి ముడి పెడుతూ సరికొత్త సినిమాటిక్ యూనివర్స్ ను సృష్టించారు.
LCU లో బెంజ్…
లోకేష్ డైరెక్షన్లో ప్రేక్షకులముందుకు వచ్చిన ఖైదీ, విక్రమ్, లియో వంటి సినిమాలను తన సినిమాకి యూనివర్స్ లో భాగం చేశారు. ఇక ప్రస్తుతం రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్న బెంజ్ (Benz) సినిమా కూడా ఈ సినిమాటిక్ యూనివర్స్ లో భాగమైందని తెలుస్తుంది. ఈ సినిమాకు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కథ అందించినప్పటికీ, భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇక ఇటీవల ఈ సినిమాలో విలన్ పాత్ర గురించి కూడా మేకర్స్ అధికారకంగా ప్రకటించారు.
ముగ్గురు హీరోయిన్లు…
ఈ సినిమాలో విలన్ పాత్రలో ప్రముఖ నటుడు నివిన్ నటించబోతున్నట్లు చిత్ర బృందం తెలియచేశారు. ఇకపోతే హీరోయిన్ గా నటి సంయుక్త మీనన్(Samyuktha Menon) ఈ సినిమాలో ఎంపికైనట్టు వార్తలు వచ్చాయి. అయితే కేవలం సంయుక్త మీనన్ మాత్రమే కాకుండా మరో ఇద్దరు హీరోయిన్లు కూడా ఈ సినిమాలో భాగమవుతున్నారని తెలుస్తోంది. సంయుక్త మీనన్ తో పాటు ప్రియాంక అరుల్ మోహన్(Priyanka Arul Mohan), మడోన్నా సెబాస్టియన్(Madonna Sebastian) కూడా ఈ సినిమాలో నటించబోతున్నట్లు వార్తలు బయటకు వచ్చాయి. ఇక ఈ సినిమాలో నటించబోతున్న నటి మడోన్నా సెబాస్టియన్ ఇదివరకు లోకేష్ డైరెక్షన్లో విజయ్ తలపతి హీరోగా నటించిన లియో(Leo) సినిమాలో కూడా నటించారు. ప్రస్తుతం ఈమె బెంజ్ సినిమాలో భాగమవుతున్న నేపథ్యంలో బెంజ్ సినిమా లియో సినిమాకు ఫ్రీక్వెల్ సినిమానా అంటూ అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
లియో సినిమాలో మడోన్నా పాత్ర చనిపోయినట్టు చూపిస్తారు. ఈ సినిమా తర్వాత బెంజ్ చిత్రం వస్తున్న నేపథ్యంలో ఈ సినిమా లియోకి ఫ్రీక్వల్ అని స్పష్టం అవుతుంది. అదేవిధంగా డైరెక్టర్ లోకేష్ లియో సినిమాకు బెంజ్ చిత్రాన్ని ఈ విధంగా లింక్ పెట్టారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగమైందనే విషయం తెలియడంతో అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాటిక్ యూనివర్స్ లో కార్తీ, సూర్య, కమల్ హాసన్, విజయ్ వంటి హీరోలు భాగం కాగా ఇప్పుడు లారెన్స్ కూడా ఇందులో భాగమయ్యారు.