Rajendra Prasad: నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాత్ర ఏదైనా ఆయన దిగనంతవరకే .. ఒక్కసారి పాత్రలోకి ఆయన పరకాయ ప్రవేశం చేశాడు అంటే.. అవార్డులు, రివార్డులు అన్ని ఆయన దగ్గరకే వస్తాయి. కామెడీ హీరోగా ఒకప్పుడు స్టార్ గా కొనసాగిన రాజేంద్ర ప్రసాద్.. ఇప్పుడు కీలక పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నాడు. ఇక ఆయన సినిమాల విషయం పక్కన పెడితే.. ఈ మధ్య రాజేంద్ర ప్రసాద్ వివాదంలో చిక్కుకున్న విషయం విదితమే.
ఇటీవల ఒక ఈవెంట్ లో రాజేంద్ర ప్రసాద్ పుష్ప 2 సినిమా గురించి మాట్లాడాడు. “ఇప్పుడు సినిమాల కథలు పూర్తిగా మారిపోయాయి.. వాడెవడో చందనం దొంగ.. వాడు హీరో” అంటూ కామెంట్స్ చేశాడు. అది రాజేంద్ర ప్రసాద్ కావాలని అన్న వ్యాఖ్యలు కాదు. కథలు మారిపోయాయి అని చెప్పే విధానంలో ఉదాహరణగా సినిమాలోని పాత్రల గురించి చెప్పుకొచ్చాడు. పుష్ప గురించి మాత్రమే కాదు.. తన సినిమాల గురించి సెల్ఫ్ ట్రోల్ చేసుకున్నాడు.
Jabardasth Prasad: కన్నీళ్లతో భార్య కాళ్లు కడిగి నెత్తిన చల్లుకున్న జబర్దస్త్ నటుడు..
కానీ, ఆ సమయంలో పుష్ప 2 సినిమా, అల్లు అర్జున్ సోషల్ మీడియాను షేక్ చేస్తుండడంతో రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలు వేరే విధంగా మారిపోయాయి. అల్లు అర్జున్ ను అవమానించిన రాజేంద్ర ప్రసాద్ అని ఆయనను ఏకిపారేశారు. ఇక ఆ ఘటన అనంతరం నేడు మరోసారి రాజేంద్ర ప్రసాద్ తాను అన్న వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చాడు. రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన షష్ఠిపూర్తి సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ లో ఆయనకు ఈ ప్రశ్న ఎదురైంది.
ఇటీవల మీరు పుష్ప గురించి మాట్లాడినప్పుడు అది ఎందుకు రాంగ్ గా పోయింది అన్న ప్రశ్నకు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ” మొన్న అల్లు అర్జున్, నేను కూర్చున్నప్పుడు ఇదే విషయం గురించి మాట్లాడాడు. అంకుల్.. మీరు ఆ మాట అనలేదని నాకు తెలుసు అని అన్నాడు. పిచ్చోడా నేనే అన్నాను అని చెప్పాను. అయినా మీరు అన్నది ఆ ఉద్దేశ్యంతో అయ్యి ఉండదు అన్నాడు. ఆ.. నేను ఆ ఉద్దేశ్యంతో అనలేదు అని చెప్పాను. కానీ, అది ఎవరికో నెగెటివ్ గా అర్ధమయ్యింది.
Game Changer : ‘గేమ్ ఛేంజర్’కు మరో సమస్య… టికెట్ ధరల పెంపుపై సంక్రాంతి సినిమాలకు షాక్ ఇచ్చిన కోర్టు
సోషల్ మీడియా ఇప్పుడు ఎలా తయారయ్యింది అంటే.. మనం ఒకటి చెప్తాం.. వాళ్లు ఇంకొకటి రాస్తున్నారు. ప్రతి దాన్ని నెగెటివ్ యాంగిల్ లోనే చూస్తున్నారు. ఇలానే నాకు తెలిసిన వ్యక్తిని గట్టిగా పట్టుకొని నిలదీశాను. నేను చెప్పింది ఏంటి.. ఏం రాసావ్ అంటే..అన్నయ్య అలా టైటిల్ పెట్టకపోతే ఎవరు చూడడం లేదు అన్నాడు. వేరేవాళ్లు చూడడం కోసం టైటిల్ నెగెటివ్ గా పెడుతున్నారు. ఏముండదు అందులో.
నేనెప్పుడూ కూడా ఎవరి గురించి నెగెటివ్ గా మాట్లాడాలనుకొనే మనిషిని కాదు. ఆరోజు కూడా హీరో, హీరోయిజం గురించి మాట్లాడినప్పుడు లేడీస్ టైలర్ సినిమాలో వాడు హీరోనా.. వెధవ అన్నాను. నన్ను నేనే అనుకున్నాను. నేను కేవలం పాత్రల గురించి మాత్రమే చెప్పాను” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.