Rajendra Prasad: సినీ సెలబ్రిటీలు స్టేజ్‌పైకి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి లేకపోతే సోషల్ మీడియాలో ట్రోల్ అవ్వడం ఖాయం. ఏ తప్పుడు ఉద్దేశ్యం లేకుండా మాట్లాడిన మాటలనే బూతులుగా భావించి ట్రోల్ చేయడానికి సిద్ధంగా ఉంటారు కొందరు ప్రేక్షకులు. అలాంటిది నిజంగానే బూతులు మాట్లాడితే.. వారిపై ట్రోల్స్ మామూలుగా ఉండవు. తాజాగా రాజేంద్ర ప్రసాద్ విషయంలో కూడా అదే జరిగింది. ‘రాబిన్‌హుడ్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో డేవిడ్ వార్నర్‌పై రాజేంద్ర ప్రసాద్ చేసిన కామెంట్స్ చాలామంది నచ్చలేదు. దీంతో రెండు రోజలుగా చాలా ట్రోలింగ్ జరుగుతోంది. అందుకే ఈ విషయంపై స్పందిస్తూ ఆయన ఒక వీడియో విడుదల చేశారు.
నీ సంగతి చెప్తా
‘‘నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షకులందరికీ నా నమస్కారం. మొన్న రాబిన్‌హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అనుకోకుండా డేవిడ్ వార్నర్ మీద నా నోటిలో నుండి ఒక మాట దొర్లింది. అది ఉద్దేశ్యపూర్వకంగా చేసింది కాదు. నా ఉద్దేశ్యం అది కాదు. నా గురించి మీకు తెలియనిది ఏముంది.. ఆ ఫంక్షన్‌కు వచ్చే ముందు మేమంతా కలిసే ఉన్నాం. అక్కడ ఎంత అల్లరి చేశామంటే నితిన్‌తో పాటు అతడిని కూడా మీరంతా నా పిల్లలు లాంటి వారు అన్నాను. అనగానే వార్నర్ నన్ను గట్టిగా వాటేసుకున్నాడు. నేను ఊరికే ఉండకుండా నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు కదా.. నువ్వు యాక్టింగ్‌లోకి రా నీ సంగతి చెప్తాను అన్నాను. అతను కూడా మీరు క్రికెట్‌లోకి రండి మీ సంగతి చెప్తాను అన్నాడు’’ అంటూ వారి మధ్య సరదాగా జరిగిన సంభాషణ గురించి గుర్తుచేసుకున్నారు రాజేంద్ర ప్రసాద్.
మేము బాగా క్లోజ్
‘‘అలా ఫంక్షన్‌కు ముందు మేమంతా కలిసి అల్లరి చేశాం. ఆ తర్వాతే ఫంక్షన్‌కు వచ్చాం. ఏది ఏమైనా ఐ లవ్ డేవిడ్ వార్నర్. నాకు తన క్రికెట్ అంటే చాలా ఇష్టం. డేవిడ్ వార్నర్ (David Warner)కు మన సినిమాలంటే చాలా ఇష్టం. మన యాక్టింగ్ అంటే ఇష్టం. నాకు తెలిసి మేము ఇద్దరం ఒకరికి ఒకరం బాగా క్లోజ్ అయిపోయాం. ఏది ఏమైనా ఈ జరిగిన సంఘటన ఎవరి మనసును అయినా బాధపెట్టుంటే ఇది నేను ఉద్దేశ్యపూర్వకంగా అన్నది కాదు కాబట్టి అయినా కూడా నేను మీ అందరికీ సారీ చెప్తున్నాను. అలాంటిది ఇంకెప్పుడూ జరగదు, జరగకుండా చూసుకుందాం’’ అంటూ డేవిడ్ వార్నర్‌పై తనకు ఉన్న ప్రేమను బయటపెట్టారు రాజేంద్ర ప్రసాద్.
Also Read: పబ్లిసిటీ కోసం చేయలేదు.. అసలు నిజం చెప్పిన హీరోయిన్
ప్రమోషన్స్‌లో వార్నర్
వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించిన సినిమానే ‘రాబిన్‌హుడ్’ (Robinhood). ఇందులో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad), వెన్నెల కిషోర్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో తన పాత్ర చూస్తుంటే తనకు హీరోగా నటించిన రోజులు గుర్తొస్తున్నాయని పలుమార్లు స్టేట్‌మెంట్ ఇచ్చారు రాజేంద్ర ప్రసాద్. ఇక ఈ మూవీకి మరింత హైప్ క్రియేట్ చేయడం కోసం ఆస్ట్రేలియన్ క్రికెటర్ అయిన డేవిడ్ వార్నర్‌ను రంగంలోకి దించారు మేకర్స్.