Dharavi Gas Cylinders Explosions:ముంబై నగరంలోని ధారావి పేలుళ్లతో దద్దరిల్లింది. సియోన్- ధారావి లింక్ రోడ్ లో గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న ట్రక్కులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటలు కాస్త వ్యాపించడంతో ట్రక్కులోని సిలిండర్లు ఒక్కొక్కటిగా పేలడం మొదలు పెట్టాయి. ట్రక్కు నుంచి ఒక్కో సిలిండర్ శరవేగంగా దూసుకురావడంతో స్థానికంగా పెను విధ్వంసం జరిగింది. పలు దుకాణాలు ధ్వంసం అయ్యాయి. పరిసరాలు గ్యాస్ సిలిండర్ పేలుళ్లకు కాలి బూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది
ధారావిలో పేలుళ్లకు సంబంధించిన సమాచారం అందడంతో వెంటనే అగ్నమాపక సిబ్బంది స్పాట్ కు చేరుకున్నారు. ఈ సంఘటనను లెవల్ 2గా నిర్ణయించారు. అగ్నిమాపక సిబ్బంది, అత్యవసర బృందాలు ఎగసిపడుతున్న మంటలను అదుపు చేస్తూ, పేలుళ్లు జరగకుండా తగిన చర్యలు చేపట్టాయి. ఈ దారిలో రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం ఈ ఘటన రాత్రి 9.50 గంటలకు జరిగింది.”మేము ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది. ఆ తర్వాత పెద్ద పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. వెంటనే స్థానికులు అక్కడి నుంచి పరుగులు తీశారు. అదృష్టవశాత్తూ, ఎవరికీ గాయాలు కాలేదు. ప్రాణాలు పోలేదు. కానీ, సమీపంలో పార్క్ చేసిన వాహనాలు సిలిండర్ల పేలుడు ధాటికి ధ్వంసం అయ్యాయి” అని ప్రత్యక్ష సాక్షలు వెల్లడించారు.
ముందు సాధారణ అగ్ని ప్రమాదంగా భావించినా..
వాస్తవానికి అగ్ని మాపక కేంద్రానికి రాత్రి 10.07 గంటల సమయంలో సమాచారం అందింది. అయితే, మొదట్లో సాధారణ అగ్ని ప్రమాదంగానే అందరూ భావించారు. కానీ, ఆ తర్వాత లెవల్ 2 అగ్నిప్రమాదంగా డిక్లేర్ చేశారు. వెంటనే 19 అగ్నిమాపక యంత్రాలు రంగంలోకి దిగాయి. మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఈ ఘటనలో కొన్ని ఫైరింజన్లు కూడా ధ్వంసం అయినట్లు తెలుస్తోంది. “మేము కాల్ రాగానే వెంటనే స్పందించాం. ఆ మంటలను ఆర్పడానికి ప్రత్యేక టీమ్ ను పంపించాం. సమీప నివాస ప్రాంతాలకు మంటలు వ్యాపించకుండా అడ్డుకునే ప్రయత్నం చేశాం. పాదచారులు, వాహనదారులు అటువైపు రాకుండా రోడ్డును బ్లాక్ చేశాం” అని అగ్నిమాపక అధికారులు తెలిపారు. ఈ ప్రమాధానికి గల కారణాలను అన్వేషిస్తున్నట్లు వెల్లడించారు.
Dharavi, Maharashtra: A truck carrying gas cylinders caught fire on Sion-Dharavi Link Road, Dharavi, causing multiple explosions. The Mumbai Fire Brigade declared it a Level-II fire, and emergency teams responded pic.twitter.com/0RKwYzl7cZ
— IANS (@ians_india) March 24, 2025
Read Also: 9 ఏళ్ల బాలుడు.. 2 ఏళ్లుగా ఇంట్లో ఒంటరి జీవితం, అతడి తల్లిదండ్రులు ఏమయ్యారు?
ప్రత్యేక బృందంతో విచారణ
అటు మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత అధికారులు దర్యాప్తు మొదలు పెట్టారు. అగ్ని ప్రమాదానికి గల ప్రాథమిక కారణాలను తెలుసుకునే పనిలో పడ్డారు. సిలిండర్లతో వెళ్తున్న ట్రక్కు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. త్వరలోనే ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి అయ్యే అవకాశం ఉంది. విచారణ తర్వాత మీడియాకు అసలు విషయాలను వివరిస్తామని పోలీసులు తెలిపారు.
Read Also: 12,478 కోట్లు విలువచేసే కంపెనీని రూ.74కే అమ్మేసిన ఈ బిజినెస్ మ్యాన్ గురించి మీకు తెలుసా?