Pekamedalu Trailer: ఇప్పటివరకు చాలామంది విలన్స్ హీరోలుగా మారి.. ఇప్పుడు స్టార్స్ గా కొనసాగుతున్నారు. ఇక తాజాగా మరో విలన్.. హీరోగా మారుతున్నాడు. కార్తీ హీరోగా నటించిన నా పేరు శివ సినిమా గుర్తుందా..? అందులో విలన్ గా నటించి మెప్పించిన వినోద్ కిషన్ హీరోగా మారాడు. మేము ఆ సినిమా చూడలేదు అంటారా.. ఈ మధ్య విశ్వక్ సేన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రంలో చిన్న దొరగా నటించాడు కదా.. అతనే వినోద్ కిషన్.
ప్రస్తుతం అతను హీరోగా నటిస్తున్న చిత్రం పేకమేడలు. నీలగిరి మామిళ్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నటుడు, నిర్మాత అయినా రాకేష్ వర్రే నిర్మిస్తున్నాడు. అతను హీరోగా నటించిన ఎవరికి చెప్పొద్దూ సినిమాను నిర్మించిన క్రేజీ యాంట్ ప్రొడక్షన్సే పేకమేడలను నిర్మిస్తోంది. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. లక్ష్మణ్.. ఎప్పుడు పేకమేడలు కడుతూ ఉంటాడు. అతనికి బాగా డబ్బు సంపాదించి.. లగ్జరీగా బతకాలని ఆశ. కానీ, అతడు ఏ పని చేసినా ఏది కలిసిరాదు. ఎప్పుడు పేక ఆడుతూ ఉంటాడు. అతనికి భార్య, పిల్లాడు ఉంటాడు. ఏ పని చేయకుండా డబ్బులు సంపాదించాలని, దానికి బిజినెస్ చేయాలనీ, డబ్బులు పెట్టుబడి పెట్టేవారి కోసం ఎదురుచూస్తుండగా.. మొగుడును వదిలేసి.. విదేశాల నుంచి పారిపోయి వచ్చిన ఒక మహిళ పరిచయమవుతుంది.
ఇక వీరిద్దరూ కలిసి బిజినెస్ చేద్దామని అనుకుంటారు. ఆమె తన దగ్గర ఉన్న డబ్బు మొత్తం లక్ష్మణ్ చేతిలో పెడుతుంది. ఆ డబ్బును లక్ష్మణ్ ఏం చేశాడు.. ? బిజినెస్ పెట్టిన ఆమె మోసపోయాను అని ఎందుకు అంటుంది.. ? ఈ గొడవల వలన లక్ష్మణ్ జీవితం ఎలా మారింది .. ? అనేది కథగా తెలుస్తోంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా అనూష కృష్ణ కనిపిస్తోంది. ట్రైలర్ తోనే మేకర్స్ చాలా హైప్ ఇచ్చారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో ఈ విలన్.. హీరోగా హిట్ అందుకుంటాడేమో చూడాలి.