BigTV English

Rakhi Sawant: మూడో పెళ్లికి సిద్ధమయిన బాలీవుడ్ నటి.. ఈసారి ఏకంగా పాకిస్థాన్ వ్యక్తితో..

Rakhi Sawant: మూడో పెళ్లికి సిద్ధమయిన బాలీవుడ్ నటి.. ఈసారి ఏకంగా పాకిస్థాన్ వ్యక్తితో..

Rakhi Sawant: పెళ్లి చేసుకున్న వ్యక్తితో మనస్పర్థలు వచ్చినా, వారితో జీవితం సాఫీగా సాగదని తెలిసినా చాలామంది అడ్జస్ట్ అయ్యి బ్రతికేస్తూ ఉంటారు. కానీ చాలావరకు సినీ సెలబ్రిటీలు మాత్రం అలా కాదు.. మ్యారేజ్ లైఫ్ బాలేదు అనిపిస్తే విడాకులు తీసుకుంటారు. కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. అలా కొత్త జీవితాన్ని ప్రారంభించి సంతోషంగా ఉంటున్న నటీనటులు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు ఒక బాలీవుడ్ నటి కూడా ఈ లిస్ట్‌లో యాడ్ కానుంది. ఇప్పటికే ఇద్దరు వ్యక్తులను ప్రేమించి పెళ్లి చేసుకొని వారితో సెట్ అవ్వక విడాకులు తీసుకున్న ఈ నటి.. ఇప్పుడు ఏకంగా ఒక పాకిస్థాన్ వ్యక్తితో పెళ్లికి సిద్ధమయ్యింది. ఆ నటి మరెవరో కాదు.. రాఖీ సావంత్.


పాకిస్థాన్ నటుడితో

2019లో రాఖీ సావంత్ మొదటి పెళ్లి చేసుకుంది. సినీ పరిశ్రమతో అస్సలు సంబంధం లేని రితేష్ అనే ప్రేమించి పెళ్లి చేసుకుంది సావంత్. ఏమైందో తెలియదు కానీ 2022లో వీరిద్దరూ విడాకులు ప్రకటించారు. విడాకులు ప్రకటించిన కొన్నిరోజుల తర్వాత అదే ఏడాది ఆదిల్ ఖాన్ దురానీ అనే నటుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరిద్దరి వైవిక జీవితం కూడా అంత గొప్పగా సాగలేదు. ఎప్పుడూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ పబ్లిక్‌గానే గొడవపడుతూ ఉండేవారు. ఆదిల్ వల్ల తనకు ప్రాణహాని కూడా ఉందని పలుమార్లు మీడియా ముందుకొచ్చింది రాఖీ సావంత్. అలా తనతో కూడా బంధాన్ని ముగించుకుంది. ఇప్పుడు పాకిస్థాన్ నటుడు అయిన డోడి ఖాన్‌తో ప్రేమలో పడి తనను వివాహం చేసుకోవడానికి సిద్ధపడింది.


ప్రపోజల్స్ వచ్చాయి

రాఖీ సావంత్ (Rakhi Sawant).. డోడి ఖాన్‌ను పెళ్లి చేసుకొని దుబాయ్‌లో సెటిల్ అవ్వాలనే ప్లాన్‌లో ఉందని సమాచారం. పాకిస్థానీ సినిమాల్లో నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు డోడి. కొన్నాళ్ల క్రితం పెళ్లి గురించి మాట్లాడుతూ.. ‘‘నాకు చాలా ప్రపోజల్స్ వస్తున్నాయి. నేను పాకిస్థాన్‌కు వెళ్లినప్పుడు నేను నా వైవాహిక జీవితంలో ఎన్ని ఇబ్బందులు పడ్డానో వారు కూడా చూశారు. నేను కచ్చితంగా నాకు సరిపోయే వ్యక్తిని ఎంచుకుంటాను’’ అని తెలిపింది రాఖీ సావంత్. అప్పటినుండి తన పెళ్లికి సంబంధించిన రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఫైనల్‌గా తను పెళ్లి చేసుకోబోయేది ఎవరినో బయటపడింది.

Also Read: మాట్లాడడానికి ఏమీ లేదు.. బాలయ్యతో ఏజ్ గ్యాప్‌పై ప్రగ్యా ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ప్లానింగ్ పక్కా

డోడి ఖాన్ (Dodi Khan) కేవలం పాకిస్థానీ యాక్టర్ మాత్రమే కాదు.. రియల్ లైఫ్‌లో తను ఒక పోలీస్ ఆఫీసర్ కూడా. ఇస్లామిక్ సాంప్రదాయాలతో పాకిస్థాన్‌లోనే వీరి పెళ్లి జరగనుందని సమాచారం. ఇక ఇండియాలో ఉన్న వారికోసం ఇక్కడ ఒక రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. దుబాయ్‌కు పర్మనెంట్‌గా తిరిగి వెళ్లిపోయే ముందు స్విట్జర్ల్యాండ్ లేదా నెథర్‌ల్యాండ్స్‌లో తమ హనీమూన్‌ను ప్లాన్ చేసిందట ఈ జంట. డోడి ఖాన్‌తో ప్రేమలో పడినప్పటి నుండి తనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ తనకు సరైనవాడు దొరికాడంటూ సంతోషం వ్యక్తం చేస్తోంది రాఖీ.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×