BigTV English

Ram Charan – RC17: రాంచరణ్ కొత్త సినిమాలో హీరోయిన్‌గా నేషనల్ క్రష్..!

Ram Charan – RC17: రాంచరణ్ కొత్త సినిమాలో హీరోయిన్‌గా నేషనల్ క్రష్..!

Ram Charan – RC17 Movie Update: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం క్రియేటివ్ దర్శకుడు శంకర్‌ డైరెక్షన్‌లో భారీ బడ్జెట్‌తో ‘గేమ్ ఛేంజర్’ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ పట్టాలెక్కి రెండేళ్లు గడిచినా.. ఇంకా షూటింగ్ జరుగుతూనే ఉంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే ఇది పూర్తి కానుంది. ఇందులో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ హారోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, సాంగ్ సినిమాపై ఫుల్ హైప్ క్రియేట్ చేసింది. ఈ చిత్రానికి థమన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా చేస్తున్నారు. ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది స్టార్టింగ్‌లో రిలీజ్ కానుంది.


ఇక దీని తర్వాత చరణ్ లైనప్‌లో మరో సినిమా ఉంది. అదే ‘ఆర్‌సి 17’. ‘ఉప్పెన’ ఫేం బుచ్చిబాబు దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కబోతుంది. కాగా ఎప్పుడో అఫీషియల్‌గా లాంచ్ అయిన ఈ సినిమా త్వరలో షూటింగ్ స్టార్ట్ చేయనుంది. ‘గేమ్ ఛేంజర్’ పూర్తి కాగానే చరణ్ ‘ఆర్‌సి 17’లో షూటింగ్‌లో పాల్గొననున్నాడు. ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటించబోతుంది.

Also Read: చరణ్ కోసం మెగాస్టార్.. బుచ్చి ప్లాన్ మాములుగా లేదుగా.. ?


ప్రముఖ టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ‘ఆర్‌సి 17’ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో నిర్మించనుంది. అలాగే ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. దీంతో ఈ మూవీ పట్టాలెక్కక ముందే భారీ అంచనాలను క్రియేట్ చేసుకుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో రామ్ చరణ్ సరసన మరో హీరోయిన్ నటించబోతున్నట్లు తెలుస్తోంది.

టాలీవుడ్ టాప్ స్టార్ హీరోలతో నటించిన నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఇప్పుడు రామ్ చరణ్‌తో ‘ఆర్ సి 17’ మూవీలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో జాన్వీ కపూర్ ఫస్ట్ హీరోయిన్ కాగా.. రష్మిక మందన్నా సెకండ్ హీరోయిన్‌గా సెలెక్ట్ అయినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ మూవీలో రష్మిక పాత్ర చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందని.. ఆమె పాత్రే సినిమాకి కీలకంగా మారుతుందని అంటున్నారు. ఈ వార్తతో మెగా అభిమానులు, రష్మిక ఫ్యాన్స్‌లో ఫుల్ జోష్ మొదలైంది. త్వరలో దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.

 

Tags

Related News

YouTuber Armaan Malik: ఇద్దరు భార్యలు.. నలుగురు పిల్లలు.. ఆ యూట్యూబర్‌కు కోర్టు నోటీసులు

Kissik talks show : యాంకర్ సౌమ్య జీవితంలో అన్నీ కష్టాలే.. ఆ హీరో టార్చర్ తో కన్నీళ్లు..

Big TV Kissik Talks : ఇండస్ట్రీలో హార్డ్ వర్క్ పనికిరాదు, చాలామంది ఆ పని చేసి వచ్చారు

Big TV Kissik Talks : ఆ హీరోయిన్ కారుతో గుద్దింది, నేను చాలా పోగొట్టుకున్నాను 

Big TV Kissik Talks: తిండి లేకుండా బస్టాండ్ లో పడుకున్నాం – జబర్దస్త్ సౌమ్య రావు

Alekhya Chitti pickles: పిక్‌నిక్‌కి వెళ్లి పికిల్స్ తినడం ఏంట్రా… మీ ప్రమోషన్స్ పాడుగాను!

Big Stories

×