Big Stories

Jaragandi Song from Game Changer: చర్చగా మారిన ‘జరగండి’ సాంగ్ బడ్జెట్.. ఖర్చు కనిపిస్తుందంటరా గురువు గారూ!

game changer
game changer

Jaragandi Song Budget in Ram Charan’s Game Changer: సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘గేమ్ ఛేంజర్’. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఎప్పుడో గత మూడేళ్ల క్రితం పట్టాలెక్కిన ఈ చిత్రం ఇప్పటికీ షూటింగ్ జరుపుకుంటూనే ఉంది.

- Advertisement -

దీనిబట్టి చూస్తే దర్శకుడు ఈ చిత్రాన్ని ఏ లెవెల్లో రూపొందిస్తున్నాడో అర్థం అవుతోంది. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో రామ్ చరణ్ రెండు విభిన్నమైన పాత్రల్లో నటించబోతున్నాడు. ఒకటి సామాన్య రాజకీయ వ్యక్తిగా, మరొకటి ప్రభుత్వ అధికారిగా చరణ్ నటిస్తున్నారు.

- Advertisement -

ఇదిలా ఉంటే.. ఈ మూవీ ఫస్ట్ సాంగ్‌ని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇదివరకే తెలిపారు. ఈ ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు ఆ మధ్య వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ ఈ సినిమా నుంచి సాంగ్‌ కాదు కదా.. ఎలాంటి అప్డేట్లు రాలేదు. దీంతో సినీ ప్రియులు, అభిమానులు ఎంతో నిరాశ చెందారు.

అయితే తాజాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్‌ ఇస్తూ మేకర్స్ అందరిలోనూ ఫుల్ జోష్ నింపారు. ఈ రోజు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే. ఈ సందర్భంగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్‌ ‘జరగండి.. జరగండి’ అంటూ సాగే సాంగ్‌ను రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ రోజు ఉదయం 9 గంటలకు విడుదల చేస్తున్నట్లు ఓ పోస్టర్‌ని వదిలారు.

Also Read: రామాయణం పనులు మొదలుపెట్టిన రణ్‌బీర్.. ఫొటోలు చూసి ఖుష్ అవుతున్న ఫ్యాన్స్

ఈ అప్డేట్‌తో అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. సాంగ్‌ కోసం తెగ ఎదురుచూస్తున్నారు. అయితే మరో విషయం ఏంటంటే.. సినిమాలో ఈ ఒక్క సాంగ్ కోసం కొన్ని కోట్లు ఖర్చు పెట్టినట్లు ఆ మధ్య వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ సాంగ్‌ కోసం దాదాపు రూ.16 కోట్ల వరకు ఖర్చు చేశారని సినీ వర్గాల నుంచి టాక్ వినిపించింది.

ఈ విషయం తెలిసి అంతా షాకయ్యారు. ఒక్క సాంగ్ కోసం ఇంత ఖర్చు పెట్టారా అంటూ నోరెళ్లబెడుతున్నారు. అయితే ఈ సాంగ్ కోసం ఇంత మొత్తంలో ఖర్చుచేశారు కదా.. అదంతా సాంగ్‌లో కనిపిస్తుందా అని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే ఈ సాంగ్ పోస్టర్ చూస్తేనే సాంగ్ కలర్ ఫుల్‌గా ఏ రేంజ్‌లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

పోస్టర్‌లో రంగురంగుల భవనాలు కనిపిస్తున్నాయి. అయితే ఆ భవనాలన్నీ రియల్‌వి కాదు.. అది ఒక సెట్. కానీ సాంగ్‌లో మాత్రం అవి నిజమైన ఇల్లులా.. రియల్ లొకేషన్స్‌లో తీసినట్లు కనిపిస్తుందట. అందువల్లనే ఈ సాంగ్ కోసం ఇంత ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది.

Also Read: బాంచత్.. ధరణి గాడు మళ్లొస్తున్నాడు..!

ఇక ఈ సాంగ్ మరో గంటలో రిలీజ్ కాబోతుండటంతో ఈ సాంగ్ బడ్జెట్ మరోసారి వార్తల్లో నిలిచింది. మరి ఈ బడ్జెట్‌కి తగ్గట్టుగా సాంగ్‌ ఉంటుందో లేదో మరికొద్ది నిమిషాల్లో తేలిపోతుంది. ఇకపోతే ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా.. ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవ డాన్స్ కొరియోగ్రఫీ అందించాడు.

ఇదిలా ఉంటే నేడు రామ్ చరణ్ బర్త్ డే కావడంతో అభిమానులు, శ్రేయోభిలాసులు ఘనంగా వేడుకలు చేసుకుంటున్నారు. అయితే తాజాగా చరణ్, ఉపాసన దంపతులు తిరుమల వెళ్లారు. అక్కడ ఆలయంలో ప్రత్యేకపూజలు జరిపించి దేవుని ఆశీస్సులు అందుకున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News