Upasana Konidela: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న మెల్ బోర్న్ ఫిల్మ్ ఫెస్టివల్ లో సందడి చేస్తున్న విషయం తెల్సిందే. ఆగస్టు 15 నుంచి 25 వరకు జరుగుతున్న ఈ వేడుకలకు చరణ్ దంపతులు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఐఎఫ్ఎఫ్ఎమ్ వేదికపై చరణ్ కు.. ఒక అరుదైన గౌరవాన్ని అందించారు.
భారతీయ చలనచిత్ర రంగానికి చరణ్ చేసిన సేవలకు గాను.. ఆర్ట్ అండ్ కల్చర్ బ్రాండ్ అంబాసిడర్ గా అవార్డును అందుకున్నాడు. ఇక ఈ వేడుకలో చరణ్.. తన చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకున్నాడు. అప్పట్లో ఆరెంజ్ సినిమా కోసం ఆస్ట్రేలియాకు వచ్చిన రోజులను గుర్తుచేసుకున్నాడు.
” 14 ఏళ్ల క్రితం నేను ఆస్ట్రేలియా వచ్చాను. ఆరెంజ్ సినిమా షూటింగ్ మెల్ బోర్న్ లో 30 రోజులు జరిగింది. షూటింగ్ పూర్తయ్యి.. ఇండియా వెళ్ళేటప్పుడు ఎంతో భావోద్వాగానికి గురయ్యాను. అప్పటి రోజులను.. ఆరోజుల్లో ప్రజలు చూపించిన ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేను. అప్పటికంటే ఇప్పుడు.. మెల్ బోర్న్ లో తెలుగు ప్రేక్షకులు ఎక్కువ అయ్యారు. మళ్లీ ఇన్నేళ్లకు ఇక్కడకు రావడం ఎంతో ఆనందంగా ఉంది. నా హోమ్ టౌన్ కు వచ్చినట్లు ఉంది. ఇండియన్ సినిమా అంచలంచెలుగా ఎదగడం ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. మీ అందరి వలనే ఇది సాధ్యమైంది. ఈ వేదికను, వేడుకను ఎప్పటికీ మర్చిపోలేను” అని చెప్పుకొచ్చాడు.
ఇక ఆ ఈవెంట్ లో ఫోటోలను ఉపాసన తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. బ్లాక్ అండ్ బ్లాక్ లో ఇద్దరు చూడముచ్చటగా కనిపించారు. ముఖ్యంగా ఉపాసన వెనుక చరణ్ ఎంతో ఠీవిగా నిలబడ్డ ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ ఫోటో చూసిన ఫ్యాన్స్.. అత్తారింటికి దారేది సినిమాలో నదియా వెనుక పవన్ కళ్యాణ్ నిలబడినప్పుడు పోసాని చెప్పే డైలాగ్ ను గుర్తు చేస్తుకుంటున్నారు. మీ వెనుక ఏదో పవర్ ఉందమ్మా.. అని కొందరు. మీ ఇద్దరు కలిసి ఎందుకు ఒక సినిమా తీయకూడదు అని ఇంకొందరు కామెంట్స్ పెడుతున్నారు.
ఇక చరణ్ కెరీర్ విషయానికొస్తే.. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ లో నటిస్తున్నాడు. ఇది కాకుండా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. మరి ఈ సినిమాలతో గ్లోబల్ స్టార్ ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తాడో చూడాలి.
— Upasana Konidela (@upasanakonidela) August 17, 2024