Ram Charan..గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan).. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్.. రాజమౌళి (Rajamouli ) దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ప్రపంచ స్థాయి గుర్తింపును సొంతం చేసుకొని, సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేశారు. ఈ సినిమా తర్వాత తమిళ దర్శకుడు శంకర్ (Shankar) తో గేమ్ ఛేంజర్ (Game Changer) సినిమా చేశారు. కానీ ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఇక ప్రస్తుతం బుచ్చిబాబు సనా (Bucchibabu) Sana) దర్శకత్వంలో ‘పెద్ది’ అనే టైటిల్ తో సినిమా చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న రాంచరణ్.. మరొకవైపు తన 40వ పుట్టినరోజు వేడుకలను కూడా చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. తాజాగా ఆయన ఆస్తుల వివరాలు కూడా అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి.
గోల్డెన్ స్పూన్ తో జన్మించిన రామ్ చరణ్..
పుట్టడమే గోల్డెన్ స్పూన్ తో జన్మించిన రామ్ చరణ్.. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. ఇక సినిమాలలో నటించడమే కాకుండా నిర్మిస్తున్నారు కూడా.. ‘కొణిదెల ప్రొడక్షన్స్’ అనే బ్యానర్ ను స్థాపించి, విజయవంతమైన చిత్రాలను అభిమానులకు అందజేస్తున్నారు కూడా.. అంతేకాదు పలు యాడ్స్ లలో వ్యవహరిస్తున్న ఈయన కొన్ని ఎండార్స్మెంట్స్ కి కూడా పనిచేస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే రామ్ చరణ్ నికర ఆస్తుల విలువ రూ.1370 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. ఇకపోతే ఈయనకు ఇంత ఆదాయం రావడానికి కారణం నటన మాత్రమే కాదు రియల్ ఎస్టేట్ తో పాటు పలు రంగాలలో పెట్టబడులు పెట్టడమే. ఇక రామ్ చరణ్ ఆస్తుల వివరాల విషయానికి వస్తే.. హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లో సుమారుగా రూ.38 కోట్లు ఖర్చుతో అత్యంత విలాసవంతమైన ఒక ఇల్లు నిర్మించుకున్నారు..
ALSO READ; Ram Charan: ఆ హీరోయిన్ తో ప్రేమలో పడ్డ రామ్ చరణ్.. కట్ చేస్తే..!
రామ్ చరణ్ కార్ కలెక్షన్..
రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టే ఈయన తనకు ఇష్టమైన కార్లను కూడా కొనుగోలు చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే రేంజ్ రోవర్ ఆస్టన్ మార్టిన్ , మెర్సిడెస్ మే బ్యాక్ జిఎల్ఎస్ 600, రోల్స్ రాయిస్ ఫాంటమ్, ఆస్టన్ మార్టిన్ వాంటెడ్ V8 , ఫెరారీ పోర్టోఫినో తో పాటు అనేక లగ్జరీ కార్లు ఈయన కారు గ్యారేజీలో మనకు దర్శనమిస్తాయి. ఇకపోతే రామ్ చరణ్ హైదరాబాద్ పోలో అండ్ రైడింగ్ క్లబ్ యజమాని కూడా.. అంతేకాదు ట్రూజెట్ అనే ప్రాంతీయ ఎయిర్లైన్స్ సర్వీస్ కూడా ఉంది. అలాగే ఈయనకు ఒక ప్రైవేట్ జెట్ కూడా ఉంది . ఇక ఈయన భార్య ఉపాసన (Upasana) కూడా భర్తకు మించిన ఆస్తులను పోగుచేసింది. ఆమె సుమారుగా రూ.1500 కోట్లకు అధిపతి అని సమాచారం. అపోలో చైర్ పర్సన్ గా వ్యవహరిస్తున్న ఈమె.. తన తాత అపోలో సంస్థల అధినేత ప్రతాపరెడ్డి తర్వాత ఆ పరంపరను అలాగే కొనసాగించడంలో తన వంతు కృషి చేస్తున్నారు ఉపాసన. అటు ఉపాసన ఒకవైపు అపోలో గ్రూప్ బాధ్యతలు చేపడుతూనే.. మరొకవైపు తన అత్తయ్య సురేఖ కొణిదెల (Surekha) తో కలిసి మొత్తం బిజినెస్ కూడా స్టార్ట్ చేశారు. ఇప్పుడు తమ వంటింటి రుచులను అందరికీ రుచి చూపిస్తున్నారు.