BigTV English

Mega Heroes : OGలో చిరంజీవి.. రామ్ చరణ్…? టాలీవుడ్ షేక్ అయ్యే న్యూస్ ఇది

Mega Heroes : OGలో చిరంజీవి.. రామ్ చరణ్…? టాలీవుడ్ షేక్ అయ్యే న్యూస్ ఇది

Mega Heroes : సినిమాటిక్ యూనివర్స్… డైరెక్టర్లు అందరూ దీన్నే గోల్ గా పెట్టుకున్నట్టు ఉన్నారు. ఒక సినిమా చేసి దాన్నిపైనే యూనివర్స్ క్రియేట్ చేస్తూ పార్ట్ 2, పార్ట్ 3 అంటూ చేసుకుంటూ వెళ్తున్నారు. తెలుగులో కూడా చాలా మంది డైరెక్టర్లు సినిమాటిక్ యూనివర్స్ బాటలోనే నడుస్తున్నారు. దీనికి నాగ వంశీ లాంటి కొంత మంది ప్రొడ్యూసర్లు కూడా సపొర్ట్ చేస్తున్నారు.


ఈ సినిమాటిక్ యూనివర్స్ బాటలోకి ఓ యంగ్ డైరెక్టర్ వస్తున్నాడట. అది కూడా మెగా ఫ్యామిలీతో ఈ యూనివర్స్ ప్లాన్ చేస్తున్నాడట. ఆ డైరెక్టర్ ఎవరు..? ఆ యూనివర్స్ కాన్సెప్ట్ ఏంటి..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం…

మెగా హీరోలు అందరూ ఓ యూనివర్స్ చేస్తే ఎలా ఉంటుంది.. అందులోనూ హీరోలు గన్స్ పట్టుకుని గ్యాంగ్ స్టార్స్ పాత్రలో చేస్తే ఎలా ఉంటుంది. ఊహించుకుంటేనే మైండ్ పోతుంది కదా…


సుజిత్ ప్లాన్..

దీన్ని నిజం చేయడానికి ఓ యంగ్ డైరెక్టర్ ట్రై చేస్తున్నాడట. ఆయన ఎవరో కాదు సుజిత్. ఈయన ఇప్పటి వరకు చేసింది రెండు సినిమాలే. అయినా… సుజిత్ అందరికీ తెలుసు. బాహుబలి లాంటి సినిమా చేసిన తర్వాత ప్రభాస్ చేసిన సాహో మూవీకి ఈయనే డైరెక్టర్. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌తో ఓజీ అనే ఓ భారీ మూవీ చేస్తున్నాడు. గ్యాంగ్ స్టార్స్ నేపథ్యంలో సాగే ఈ మూవీలో పవన్ ను కొత్తగా చూపించబోతున్నాడు.

మెగా హీరోలతో యూనివర్స్..?

అయితే.. ఇప్పుడు ఈ ఓజీ సినిమాపై ఓ సంచలన వార్త ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. ఈ ఓజీ కాన్సెప్ట్ తో ఓ యూనివర్స్ క్రియేట్ చేయాలని డైరెక్టర్ సుజిత్ ప్లాన్ చేస్తున్నాడట. ఓజీ పార్ట్ 2, పార్ట్ 3 ఇలా… ఓ యూనివర్స్ క్రియేట్ చేయాలనే థాట్ తో ఉన్నాడట. ఇప్పుడు ఓజీలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. తర్వాత వచ్చే పార్ట్ లో పవన్ కాకుండా… మెగా ఫ్యామిలీలోనే హీరోలుగా వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తుంది.

మెగాస్టార్ చిరంజీవి కూడా..?

ఈ ఓజీ యూనివర్స్ లో రామ్ చరణ్ తో పాటు మెగా కంపౌండ్‌లో ఉండే హీరోలు కూడా యాడ్ అవ్వొచ్చు అని సమాచారం. అంతే కాదు… మెగాస్టార్ చిరంజీవితో సెపరేట్ గా ఓ మూవీనే ప్లాన్ చేయాలని డైరెక్టర్ సుజిత్ ప్లాన్ చేస్తున్నట్టు, దీనికి సంబంధించి మెగా హీరోలతో చర్చలు జరుపుతున్నట్టు ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది.

ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలీదు కానీ… ఒక వేళ ఈ మెగా యూనివర్స్ నిజమే అయితే… అది కూడా ఈ గ్యాంగ్ స్టార్స్ నేపథ్యంలో.. సుజిత్ డైరెక్షన్ లో యూనివర్స్ ఉంటే… ఇండస్ట్రీలో ఉన్న రికార్డులు అన్నీ గల్లంతు అవ్వడం పక్కా అని మెగా ఫ్యాన్స్ అంటున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×