BigTV English

Game Changer Movie Review : గేమ్ ఛేంజర్ మూవీ రివ్యూ

Game Changer Movie Review : గేమ్ ఛేంజర్ మూవీ రివ్యూ

Game Changer Movie Review : మెగా vs అల్లు అనే సోషల్ మీడియా వార్ సాగుతున్న టైంలో వచ్చాయి పుష్ప 2, గేమ్ ఛేంజర్ సినిమాలు. పుష్ప 2 ఇప్పటికే 1800+ కోట్ల కలెక్షన్లు తెచ్చుకుంది. దీంతో గేమ్ ఛేంజర్ పై చాలా వరకు ప్రెజర్ ఉంది అనేది వాస్తవం. రామ్ చరణ్ కు గేమ్ ఛేంజ్ అయ్యేలా మూవీ ఉండాలని అనుకున్నారు ఫ్యాన్స్. అలాగే 500 కోట్ల బడ్జెట్, శంకర్ డైరెక్షన్ వల్ల కూడా సినిమాపై అంచనాలు పెరిగాయి. అలాంటి హోప్స్‌తో వచ్చిన గేమ్ ఛేంజర్ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్ధాం…


కథ :

రామ్ నందన్ (రామ్ చరణ్) లవర్ దీపిక (కియారా అద్వానీ) కోసం ఐపీఎస్ నుంచి ఐఏఎస్ అవుతాడు. తన సొంత జిల్లాకే కలెక్టర్‌గా వచ్చిన రామ్ నందన్… సమాజాన్ని మార్చాలని, పేద ప్రజలకు సాయం చేయాలని, తన జిల్లాలో అక్రమాలు జరగొద్దు అని కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటాడు. అదే జిల్లాలో మంత్రి మోపిదేవి (ఎస్‌జే సూర్య) అనేక అక్రమాలు చేస్తూ ఉంటాడు. అలాగే తన తండ్రి సీఎం సత్య నారాయణ (శ్రీకాంత్) చనిపోతే… ఆ సీటులో కూర్చోవాలని చూస్తుంటాడు. ఈ టైంలో మోపిదేవి అక్రమాలకు రామ్ నందన్ అడ్డుపడుతాడు. రామ్ నందన్‌ సస్పెండ్ అయ్యేలా కేసు పెడుతాడు. అలా వారి మధ్య వార్ నడుస్తున్న టైంలో సీఎం సత్య నారాయణ చనిపోతాడు. దీంతో మోపిదేవి ముఖ్యమంత్రి అవుతాడు. ఈ క్రమంలో రామ్ నందన్ – దీపిక పెళ్లిపై అటాక్ చేస్తాడు. అలా ఇంటర్వెల్‌లో ఓ బ్లాస్టింగ్ ట్విస్ట్…


ఆ మోపిదేవి అటాక్ తర్వాత ఏం జరిగింది.? శ్రీకాంత్ ఎలా చనిపోయాడు..? శ్రీకాంత్ చివరి కోరిక ఏంటి ? పార్వతమ్మ (అంజలి)ను చూసి సీఎం ఎందుకు భయపడ్డాడు..? రామ్ నందన్ తండ్రి అప్పన్న ఎవరు ? అప్పన్నను చంపింది ఎవరు..? అలాగే సీఎం అవ్వాలి అనే కోరిక మోపిదేవికి తీరిందా.? చివరికి ముఖ్యమంత్రి ఎవరు అయ్యారు అనేదే సినిమా.

విశ్లేషణ :

అన్ ప్రిడిక్టబుల్… మూవీకి ముందు ట్రైలర్‌ ద్వారా ఈ డైలాగ్ చాలా ఫేమస్ అయింది. సినిమా కూడా అన్ ప్రిడిక్టబుల్‌గా ఉంటుంది అంటూ ప్రమోషన్స్ చేసుకున్నారు. నిజంగా ఈ మూవీ అన్ ప్రిడిక్టబులా..?

అంటే… అవును ఇది అన్ ప్రిడిక్టబుల్ మూవీ…
మెగా ఫ్యాన్స్‌కు అన్ ప్రిడిక్టబుల్ మూవీ.
ఇలాంటి అవుట్ పుట్‌ను అసలు ఊహించి ఉండరు.
500 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా ఇలా ఉంటుంది అనేది అస్సలు ఊహించి ఉండరు.

అంటే సినిమా మరి అంత బాలేదా… అంటే… బాగానే ఉందని చెప్పొచ్చు. కానీ, 500 కోట్ల భారీ బడ్జెట్‌తో రావాల్సిన సినిమా కానే కాదు. నిజానికి శంకర్ గురించి అందరికీ తెలిసిందే. ఆయన డైరెక్షన్‌లో వచ్చిన ఒకే ఒక్కడు, భారతీయుడు, జెంటిల్మన్, శివాజీ లాంటి అన్ని సినిమాలు కూడా సందేశాత్మకంగా ఉంటాయి. ఇప్పుడు గేమ్ ఛేంజర్ కూడా సందేశాన్ని ఇచ్చే సినిమానే. అలాగే ఆ సినిమాలు అన్నింటిలో కమర్షియల్ యాంగిల్ ఉంటుంది. ఇప్పుడు గేమ్ ఛేంజర్‌లో కూడా కమర్షియల్ యాంగిల్ ఉంది.

కానీ, వాటికి వచ్చిన ఫీల్ ఎందుకో గేమ్ ఛేంజర్‌కి రాలేదు. దీనికి కారణం ఫ్యాన్స్ కి మూవీ టీం క్రియేట్ చేసిన ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అయి ఉండొచ్చు. సినిమా కోసం బడ్జెట్ ఓవర్ అయి ఉండొచ్చు. ఇంకా చాలా….

అలాగే కొన్ని మిస్ అయ్యాయి కూడా… శంకర్ సినిమా అంటే మరో వ్యక్తి గుర్తు వస్తారు. ఆయనే ఏఆర్ రెహమాన్. శంకర్ సినిమాలో సాంగ్స్ అండ్ మ్యూజిక్ క్లాసిక్‌గా ఉంటాయి. కనెక్ట్ అవుతాయి. కానీ, అది ఇప్పుడు గేమ్ ఛేంజర్‌లో కనిపించలేదు. దీన్ని కవర్ చేయడానికి సాంగ్స్‌కు భారీ బడ్జెట్ పెట్టారు. అయినా పెద్దగా వర్క్ అవుట్ అవ్వలేదు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అయితే ఎక్కడా కూడా కనెక్ట్ అవ్వలేదు.

సినిమా చూస్తే.. స్టార్టింగ్ అవ్వడమే… ఈలలు వేయించాడు. తర్వాత… రామ్ చరణ్ ఫెర్ఫామెన్స్, డ్యాన్స్, కొంత వరకు మంచి స్టోరీ… రెండు సాంగ్స్. అలా మైండ్ బ్లాక్ ట్విస్ట్‌తో ఇంటర్వెల్ బ్లాక్. ఇలా చక చక అయిపోయింది.

సెకండాఫ్ వరకు వచ్చే సరికి.. అక్కడ కూడా స్టార్టింగ్‌లో కొన్ని ట్విస్ట్‌లు ప్లాన్ చేశాడు. అప్పన్న ఫ్లాష్ బ్యాక్ బాగానే ఉన్నా… ఎందుకో… అసంతృప్తి. అప్పన్నకు పెద్దగా ఎలివేషన్ లేకపోవడమే కావచ్చు దానికి కారణం.

ఇక క్లైమాక్స్.. నిజానికి శంకర్ క్లైమాక్స్ భారీ స్థాయిలో ఉంటాయి. ఇప్పుడు గేమ్ ఛేంజర్ క్లైమాక్స్ కూడా భారీ స్థాయిలోనే ఉంది. అయితే.. సెకండాఫ్ లో కనిపించిన ల్యాగ్ అనేది.. క్లైమాక్స్ లో కూడా కనిపించింది. ఓ టైంలో హీరో – విలన్ ఇంకా ఎంత సేపు కొట్టుకుంటార్రా… బాబు అని అనిపించేలా ఉంది. ఫస్టాఫ్ వరకు ఒకే కానీ, సెకండాఫ్‌లో కథనానికి శంకర్ మరింత పని చెప్పాల్సింది.

అలాగే రిలీజ్ అయిన అన్ని సాంగ్స్ లో నానా హైరనా… అనే సాంగ్ అనేది సినిమాకు ప్లస్ అవుతుందని అందరూ అనుకున్నారు. ఆ సాంగ్స్ కోసం థియేటర్స్‌లో ఆడియన్స్ ఎప్పుడెప్పుడు వస్తుంది అని ఎదురుచూశారు. కానీ, అంత ఇంపార్టెన్స్ ఉన్న ఆ నానా హైరనా… సాంగ్ ను సినిమాలోనే లేకుండా చేయడం పెద్ద మైనస్ అయిపోయింది. కాగా, అన్ని సాంగ్స్‌లో ఈ సాంగ్‌కే అత్యధిక బడ్జెట్ పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఆ సాంగ్‌నను 14 నుంచి థియేటర్‌లోకి రాబోతున్నట్టు తెలుస్తుంది.

అలాగే 500 కోట్ల ఖర్చులో కొన్ని వృథా స్క్రీన్ పైనే కనిపించాయి. నరేష్ ఓన్లీ వన్ డే యాక్టింగ్. ఎక్కడా కనిపించడు. వెన్నల కిషోర్, బ్రహ్మానందం, ప్రియదర్శి ఉన్నారు… కానీ, ఎక్కడా ఎందుకు ఎలా వచ్చారు అనేది ఎవరికీ తెలిదు. రాజీవ్ కనకాల ఎప్పటిలాగే… అలా వచ్చి ఇలా చనిపోయాడు.

రామ్ చరణ్ విషయానికి గేమ్ ఛేంజర్ మూవీ గేమ్ ఛేంజ్ చేసేది ఆయననే. యాక్టింగ్, డ్యాన్స్, ఫర్ఫామెన్స్ అన్నింటిలో వందకు వంద శాతం మార్కులు. ఎక్కడా వంక పెట్టలేం. సినిమాకు, రామ్ నందన్, అప్పన్న పాత్రకు ఎంత కావాలో.. అంతే చాలా చక్కగా ఫర్ఫామెన్స్ ఇచ్చాడు.

హీరోయిన్.. ఓ అందమైన అమ్మాయి. అంతకు మంచి పెద్దగా చెప్పడానికి ఏం లేదు. అంజలి క్యారెక్టర్ పర్లేదు. ఎస్ జే సూర్య ఎప్పటిలాగే మెప్పించాడు. సముద్రఖనికి మాట్లాడటానికి, నటించడానికి పెద్దగా స్కోప్ లేదు.

నిర్మాణ విలువలు… 500 కోట్లు ఎక్కడ పెట్టారు..? ఈ క్వశ్చన్ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి వస్తుంది. ఎడిటింగ్ విషయానికి వస్తే సెకండాఫ్‌, క్లైమాక్స్‌లో పని చెప్పాల్సింది.

ప్లస్ పాయింట్స్ :

రామ్ చరణ్
ఫస్టాఫ్

మైనస్ పాయింట్స్ :

సెకండాఫ్
ల్యాగ్ క్లైమాక్స్
రెహమాన్ లేకపోవడం

మొత్తంగా… చెప్పిన అన్ ప్రిడిక్టబుల్ మూవీ కాదు

Game Changer Movie Review and Rating : 2/5

Related News

Actress Raasi: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

Actress Raasi : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

Actress Raasi : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Actress Mohini: అలా చేయాలని బలవంతం చేశారు.. చాలా ఏడ్చాను, బాలయ్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

Shriya Saran: నేను హీరోయిన్ అని నా భర్తకు తెలీదు.. ఆ మూవీ చూసి భయపడ్డారు – శ్రియా

Barrelakka: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బర్రెలక్క.. బేబీ ఎంత క్యూట్ గా ఉందో?

Big Stories

×