HBD Ram Charan : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ (Megastar ) గా గుర్తింపు తెచ్చుకున్న చిరంజీవి(Chiranjeevi ) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. స్వయంకృషితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన.. నేడు ఉన్నత స్థాయికి చేరుకోవడమే కాకుండా మరి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు కూడా.. ముఖ్యంగా శ్రీకాంత్ (Srikanth), రవితేజ(Raviteja ) వంటి హీరోలను మొదలుకొని.. నాని (Nani ), విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఇలా ఎంతో మంది హీరోలు చిరంజీవిని ఆదర్శంగా తీసుకొని ఇండస్ట్రీలోకి వచ్చి నేడు స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈయన వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు రామ్ చరణ్.. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటూ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. అంతేకాదు అత్యంత అరుదైన గౌరవాలు కూడా అందుకుంటూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు
జడ్జ్ మెంట్ విషయంలో బెస్ట్..
ఇకపోతే రామ్ చరణ్ తన సినిమా కథల ఎంపిక విషయంలో చాలా ఆచితూచి అడుగులు వేస్తారన్న విషయం తెలిసిందే. కానీ ఒక్కొక్కసారి ఆ అడుగులే బెడిసి కొడితే.. మరొకసారి ఊహించని విజయాలను తెచ్చి పెట్టాయి. ఇకపోతే రామ్ చరణ్ తన సినిమా కెరియర్లో ఎన్నో సినిమాలను రిజెక్ట్ చేశారు .ముఖ్యంగా వేరే హీరోలు చేయాల్సిన సినిమాలను కూడా తాను చేశారు. ఇకపోతే ఈయన రిజెక్ట్ చేసిన సినిమాలలో చాలా వరకు పెద్దగా ఆడని చిత్రాలే ఉండడం గమనార్హం . దీన్ని బట్టి చూస్తే ఆయన జడ్జిమెంట్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే ఈ జడ్జిమెంట్ విషయంలో ఆయన తండ్రి చిరంజీవి ప్రమేయం కూడా ఉండవచ్చు. కానీ ఆయన మాత్రం మంచి నిర్ణయాలు తీసుకొని 15 చిత్రాలకే గ్లోబల్ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. ఇప్పటివరకు చేసింది 15 చిత్రాలే. కానీ తక్కువ సమయంలోనే ఆ రేంజ్ లో పాపులారిటీ అంటే కేవలం రామ్ చరణ్ కు మాత్రమే లభించింది.. ఇకపోతే రామ్ చరణ్ ఇతర హీరోలు రిజెక్ట్ చేసిన సినిమాలు చేసి మంచి విజయాలను అందుకున్నాడు ఇప్పుడు బుచ్చిబాబు సనా (Bucchibabu Sana) తో చేస్తున్న సినిమాని కూడా మొదట ఎన్టీఆర్ (NTR) రిజెక్ట్ చేశారు. కానీ ఇప్పుడు ఈ సినిమాతో సక్సెస్ కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు రామ్ చరణ్.
తండ్రి మాట కాదని సూపర్ హిట్ అందుకున్న రామ్ చరణ్..
ఇకపోతే సినిమా కథల విషయంలో తండ్రి చిరంజీవి (Chiranjeevi) మాట జవదాటని రామ్ చరణ్.. ఒక సినిమా విషయంలో మాత్రం తండ్రి గీసిన గీతను కూడా ధాటి ఆ సందర్భంలో తానే బెస్ట్ అని నిరూపించుకున్నారు. అది ఏదో కాదు రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన మగధీర. కాజల్ అగర్వాల్ (Kajal Agarwal) హీరోయిన్గా 2009లో రొమాంటిక్, ఫాంటసీ, యాక్షన్ డ్రామగా వచ్చిన ఈ సినిమా సుమారుగా అప్పట్లోనే రూ. 150 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి రికార్డు సృష్టించింది. అంతేకాదు అప్పట్లో టాలీవుడ్ లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. అంతేకాదు మొదటి రూ.100కోట్ల మూవీ కూడా ఇదే కావడం గమనార్హం . వాస్తవానికి ఈ సినిమా బడ్జెట్ కేవలం రూ.40 కోట్లు మాత్రమే. కానీ ఈ సినిమా తెచ్చి పెట్టిన లాభాలతో అల్లు అరవింద్ (Allu Aravindh)అదృష్టం భారీగా పండిందని చెప్పవచ్చు.
Shahrukh Khan : ఐశ్వర్య ఛాన్స్ ఇవ్వలేదు… రొమాన్స్ పై బాద్ షా ఓపెన్ కామెంట్..!