BigTV English

Ram Charan – MS Dhoni : క్రికెట్ కింగ్ ధోనీతో గ్లోబల్ స్టార్… ‘పెద్ది’ కోసం మాత్రం కాదండోయ్

Ram Charan – MS Dhoni : క్రికెట్ కింగ్ ధోనీతో గ్లోబల్ స్టార్… ‘పెద్ది’ కోసం మాత్రం కాదండోయ్

Ram Charan – MS Dhoni : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని కలిసి ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. గత కొన్ని రోజుల నుంచి వీరిద్దరూ కలిసి ‘పెద్ది’ (Peddi Movie) సినిమాలో నటిస్తున్నారు అనే పుకార్లు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే నిజానికి వీరిద్దరూ కలిసింది బుచ్చిబాబు (Buchibabu) సినిమా కోసం కాదు. మరి గ్లోబల్ స్టార్, ఈ క్రికెట్ కింగ్ తో కలిసి ఏం చేస్తున్నారు? అనే విషయంలోకి వెళ్తే…


ఒకే ఫ్రేమ్లో రామ్ చరణ్, ఎంఎస్ ధోని 

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో ‘పెద్ది’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాన్ ఇండియా మూవీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరపైకి రాబోతోంది. రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీలో భారత దిగ్గజ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని క్యామియో రోల్ లో కనిపించనున్నారు అంటూ గత కొంతకాలం నుంచి ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాతోనే ఆయన సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది. క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న రామ్ చరణ్ 16వ సినిమాలో చెర్రీకి ధోని కోచ్ గా కనిపిస్తారనే ఊహాగానాలు జోరుగా సాగాయి.


అయితే ఈ వార్తలపై చిత్ర బృందం స్పందిస్తూ అలాంటిదేమీ లేదని క్లారిటీ ఇచ్చింది. కానీ తాజాగా మరోసారి ధోనీ, రామ్ చరణ్ ఇద్దరు కలిసి ఒకే ఫ్రేమ్ లో కనిపించడంతో అటు క్రికెట్ లవర్స్, ఇటు మెగా ఫ్యాన్స్ కి ఈ పిక్ కన్నుల పండగగా మారింది. అయితే నిజానికి ధోని – చెర్రీ ‘పెద్ది’ సినిమాలో కలిసి నటించట్లేదు. కానీ ఓ యాడ్ షూటింగ్లో పాల్గొన్నట్టు సమాచారం. అయితే ఆ యాడ్ ఏంటి అన్న సమాచారం మాత్రం ఇంకా తెలియ రాలేదు. కానీ ఆ పిక్ లో చరణ్, ధోనీ ఇద్దరూ స్టైలిష్ గా, సూపర్ కూల్ లుక్ లో కన్పిస్తున్నారు.

Read Also : వెంకీ మామను పక్కనపెట్టి… పర భాష హీరోతో గురూజీ ప్లాన్..?

చాలా ఏళ్ల క్రితమే కలిసి యాడ్ 

గతంలో ఎంఎస్ ధోని, రామ్ చరణ్ కలిసి ఓ యాడ్ లో నటించారు. 2009లో వీరిద్దరూ కలిసి చేసిన పెప్సీ యాడ్ కు మంచి ఆదరణ లభించింది. ఇక ఆ తర్వాత ధోని బయోపిక్ లో చెర్రీ సురేష్ రైనా పాత్రలో కనిపిస్తాడని వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ ఉట్టి పుకార్లేనని తర్వాత తేలింది. ఇక అప్పటి నుంచి వీరిద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ నడుస్తోంది. తాజాగా రామ్ చరణ్ – ధోనీ కలిసి మరో యాడ్ షూటింగ్ కోసం పని చేస్తుండడం ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు వైరల్ అవుతున్న పిక్ ఆ యాడ్ షూట్ లోనిదే అని సమాచారం. ఆ యాడ్ ఏదైనా వీరిద్దరి కాంబోలో వస్తుంది కాబట్టి సేల్స్ భారీగా పెరగడం ఖాయం అంటున్నారు మూవీ లవర్స్. మరోవైపు మెగా ఫ్యాన్స్ ‘పెద్ది’ అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×