Tomato for Health: టమాటా (Tomato) లేకుండా కూరలు వండేవారు చాలా అరుదుగా ఉంటారు. ఏ కూర చేసినా సరే అందులో కనీసం రెండు టమాటలైనా వేయాల్సిందే. ఇది కేవలం వంటకాలకు రుచి మాత్రమే కాదు, ఆరోగ్యానికి అనేక రకాల లాభాలను కూడా అందిస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. టమాటాల్లో లైకోపిన్ (Lycopene) అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ అధికంగా ఉంటుందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. ఇది క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు వంటి సమస్యల నుంచి రక్షణనిస్తుందట.
పోషకాలు మెండు
టమాటాలో విటమిన్-C, విటమిన్-K, పొటాషియం, ఫోలేట్ వంటి అనేక పోషకాలు ఉంటాయట. ఇమ్యూన్ పవర్ పెంచేందుకు ఇవి సహాయపడతాయని నిపుణులు చెబతున్నారు. అంతేకాకుండా ఇవి చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయట.
బరువు తగ్గడానికి
పిల్లల నుంచి వృద్ధుల వరకు ఏ వయసు వారైనా వీటిని తినొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తక్కువ కాలరీలతో ఎక్కువ పోషణను అందించడంలో టమాట సహాయపడుతుందట. అంతేకాకుండా శరీర బరువు తగ్గించుకోవాలనుకునేవారికి కూడా ఎంతో హెల్ప్ చేస్తుందట.
ALSO READ: దానిమ్మ జ్యూస్ తాగితే ఏం అవుతుంది..?
హెల్తీ హార్ట్ కోసం
గుండె ఆరోగ్యాన్ని రక్షించడంలో కూడా టమాట హెల్ప్ చేస్తుందట. టమాటాలోని లైకోపిన్ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించేలా పనిచేస్తుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. అలాగే శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు కూడా ఇది సహకరిస్తుందట. దీంతో పాటు బాడీలో మంచి కొలెస్ట్రాల్‌ను పెంచేలా సహాయపడుతుంది.
చర్మ సంరక్షణ
టమాటా రసాన్ని ముఖానికి రాస్తే ముడతలు తగ్గుతాయట. అంతేకాకుండా నల్ల మచ్చలు కూడా మాయమవుతాయని డెర్మటాలజిస్ట్‌లు చెబుతున్నారు.
జీర్ణక్రియ
టమాటాలో ఫైబర్ కంటంట్ చాలా ఎక్కువగా ఉంటుందట. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే మలబద్ధకాన్ని దూరం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
కంటి చూపు
టమాటాలో విటమిన్-A అధికంగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఇప్పటికే కంటి చూపు సమస్యలు ఉన్న వారు దీన్ని ప్రతి రోజూ తీసుకునే డైట్‌లో చేర్చుకోవడం ఉత్తమం.
లో గ్లైసెమిక్ ఇండెక్స్
టమాటా గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటంతో, డయాబెటిస్ ఉన్నవారు కూడా టెన్షన్ లేకుండా తీసుకోవచ్చు. ఆ రకంగా రక్తంలో చక్కెర స్థాయిని సమతుల్యంగా ఉంచడంలో టమాట సహాయపడుతుంది.
టమాటాను సలాడ్లలో, జ్యూస్‌గా, కూరలలో లేదా సూపులలో వాడొచ్చు. ఉడకబెట్టిన టమాటాలో లైకోపిన్ శరీరానికి ఎక్కువగా అందే అవకాశం ఉంటుంది. టమాటా తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. దీన్ని తప్పకుండా ప్రతి రోజూ తీసుకునే ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా డాక్టర్ లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.