SSMB 29: పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు తెరకెక్కించాలంటే కచ్చితంగా అది ఒక్క సంవత్సరంలో అయ్యే పని కాదు అని ప్రేక్షకులు సైతం ఫిక్స్ అయిపోయారు. అలా రెండు, మూడేళ్లకు ఒక సినిమాను ప్రేక్షకులకు అలవాటు చేసిన మొదటి దర్శకుడు రాజమౌళి. ఈ డైరెక్టర్ ఒక సినిమా చేస్తున్నాడంటే కచ్చితంగా అది ఇప్పట్లో విడుదల అవ్వదు అని ప్రేక్షకులు సైతం ఫిక్స్ అయిపోతారు. అలా ‘ఆర్ఆర్ఆర్’ విడుదలయ్యి ఇప్పటికే దాదాపు మూడేళ్లు అవుతోంది. ఇన్నాళ్ల తర్వాత మహేశ్ బాబుతో మూవీకి శ్రీకారం చుట్టారు రాజమౌళి. ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే విషయంపై రామ్ చరణ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
హాట్ టాపిక్
మామూలుగా ఒక సినిమా లాంచ్ అంటే దానికోసం పనిచేసే ప్రతీ ఒక్కరు ఆ లాంచ్‌కు వస్తారు. పూజా కార్యక్రమాలతో సినిమాను స్టార్ట్ చేస్తారు. కానీ రాజమౌళి, మహేశ్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఎస్ఎస్ఎమ్‌బీ 29’ మూవీ విషయంలో మాత్రం అలా జరగలేదు. కేవలం మహేశ్ బాబు ఫ్యామిలీతో పాటు రాజమౌళి, కీరవాణి మాత్రమే ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. జనవరి 2న ఉదయం ఈ పూజా కార్యక్రమాలు చాలా సైలెంట్‌గా జరిగిపోయింది. ఉదయం తన సినిమాను ఓపెన్ చేసిన తర్వాత సాయంత్రం ‘గేమ్ ఛేంజర్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా వచ్చారు రాజమౌళి (Rajamouli). అక్కడ ‘ఎస్ఎస్ఎమ్‌బీ 29’ (SSMB 29) గురించి చాలా డిస్కషన్స్ జరిగాయి.
Also Read: ‘గేమ్ ఛేంజర్’లో రామ్ చరణ్ ట్రిపుల్ రోల్.? శంకర్ మాటలకు అర్థం అదేనా.?
అప్పుడే వచ్చేస్తుంది
ముందుగా తమన్ వచ్చి ‘ఎస్ఎస్ఎమ్‌బీ 29’కు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. దీంతో దాని తర్వాత అందరూ కూడా ఆయనకు ఆల్ ది బెస్ట్ చెప్పడం మొదలుపెట్టారు. ఇక ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో చివరిగా రాజమౌళి, శంకర్ గురించి రామ్ చరణ్‌ను పలు ప్రశ్నలు అడిగారు సుమ. ముందుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఎస్ఎస్ఎమ్‌బీ 29’ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని చరణ్‌ను అడగగా మరో కోవిడ్ లాంటిది ఏమీ లేకపోతే ఏడాదిన్నరలో కచ్చితంగా ఈ సినిమా వచ్చేస్తుందని నమ్మకం వ్యక్తం చేశాడు రామ్ చరణ్ (Ram Charan). అది విన్న రాజమౌళి.. షాకయ్యాడు. ఇదంతా తన ట్రైనింగే అంటూ నవ్వాడు. దీంతో రామ్ చరణ్ మాటలు మహేశ్ ఫ్యాన్స్‌ను హ్యాపీ చేస్తున్నాయి.
ఎవరిది నిజం.?
‘గేమ్ ఛేంజర్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో దిల్ రాజు సైతం ‘ఎస్ఎస్ఎమ్‌బీ 29’ కోసం మూడేళ్లు వెయిట్ చేయాల్సి వచ్చినా చేస్తామని అన్నాడు. కానీ రామ్ చరణ్ మాత్రం ఒకటిన్నర సంవత్సరంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని అన్నాడు. దీంతో ఇందులో ఎవరి మాట నిజమవుతుందో అని మహేశ్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇక శంకర్, రాజమౌళితో పనిచేసిన అనుభవం ఎలా ఉందో కూడా రామ్ చరణ్ పంచుకున్నాడు. శంకర్‌తో పనిచేయాలంటే వాచ్ తీసి పక్కన పడేయాలని టైమ్ చూడకూడదని అన్నాడు. అంతే కాకుండా ‘గేమ్ ఛేంజర్’ సినిమా సెట్‌లోకి వెళ్లే ముందు బ్రెయిన్‌ను ఇంటి దగ్గర పెట్టేసి వచ్చానని ఫన్నీ కామెంట్ చేశాడు.