Ram Charan: తెలుగు మూవీస్ లో ఫ్రాంచేజ్ సినిమాలు పెద్దగా మనకి కనిపించవు. నాని కీలకపాత్రలో వచ్చిన హిట్ 3థర్డ్ కేస్ చిత్రం హిట్ ఫ్రాంచేజ్ భాగంగా మన ముందుకు వచ్చింది. హిట్ మొదటి భాగం రెండో భాగం సక్సెస్ ని అందుకోవడంతో మూడో భాగంగా శైలేష్ కొలను దర్శకత్వంలో నాని హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా మన ముందుకు వచ్చిన హిట్ 3 బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. మే ఒకటో తేదీన ఈ సినిమా రిలీజ్ అయ్యింది. విడుదలైన అన్ని కేంద్రాల్లో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఇందులో భాగంగా ఈ మూవీ బాగుందంటూ పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇందులో భాగంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నాని మూవీ కి రివ్యూ ఇచ్చారు. ఆ వివరాలు చూద్దాం..
హీరో కి …డైరెక్టర్ కి స్టార్ హీరో ప్రశంసలు ..
అర్జున్ సర్కార్ గా నాని ఐపీఎస్ అధికారి పాత్రలో ఈ సినిమాలో నటించారు. హిట్ మూవీ తో డైరెక్టర్ శైలేష్ కొలను మెప్పించారు. విశ్వక్సేన్ హీరోగా మొదటి భాగం, అడవి శేషు తో రెండో భాగాన్ని రూపొందించి సక్సెస్ ని అందుకున్నాడు. ఇప్పుడు తాజాగా మూడోసారి నానితో హిట్ త్రీ రూపొందించి మరోసారి అందరి ప్రశంసలను అందుకున్నాడు. అందులో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ మూవీ సక్సెస్ పై స్పందించారు. రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా ఎక్స్ లో పోస్ట్ చేశారు. హిట్ త్రీ గురించి అద్భుతమైన రివ్యూస్ ని వింటున్నాను. నా ప్రియమైన సోదరుడు నానికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు. వెరైటీ స్క్రిప్లను ఎంచుకొని బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నందుకు కంగ్రాట్యులేషన్స్ అంటూ, ఈ మూవీ డైరెక్టర్ శైలేష్ కొననుకి ఇలాంటి స్క్రిప్ట్ అందించినందుకు హ్యాట్సాఫ్ అని రామ్ చరణ్ పోస్ట్ చేశారు. శ్రీనిధి శెట్టి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పోస్ట్ చూసినా అభిమానులంతా రామ్ చరణ్ నాని సినిమాకు రివ్యూ చెప్పడం అద్భుతమని, నాని ఇలాంటి సక్సెస్ ని ఇంకా ఎన్నో అందుకోవాలని కామెంట్ చేస్తున్నారు.
హిట్ మరో రికార్డు ..
ఇండస్ట్రీలో ఒక హీరో సినిమా రిలీజ్ హిట్ అవ్వగానే అందుకు అభినందనలు తెలుపుతూ ఎంతో మంది హీరోలు నిర్మాతలు ట్వీట్ చేయటం సాధారణం. ఇప్పుడు నాని మూవీ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది అందులో భాగంగా రామ్ చరణ్ మూవీ టీం కి అభినందనలు తెలపడం జరిగింది. నాని నటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఎలాంటి పాత్రైనా అద్భుతంగా చేస్తాడు అర్జున్ సర్కార్ గా తనదైన నటనతో ఈ సినిమాలో నాని ఆకట్టుకున్నాడు. నిజమైన పోలీస్ ఆఫీసర్ లాగే మనకి తెరపై కనిపించే అబ్బురుపరిచాడు. శ్రీనిధి శెట్టి తన పాత్ర మేరా పర్ఫామెన్స్ ని అందించింది. ప్రతీక్ బాబర్ వీలనిజం, కొంతమేర ఆకట్టుకుంది. మీకీజే మేయర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సంగీతం సినిమా విజయంలో ప్రధాన పాత్ర పోషించింది. సానుజాన్ వర్గీస్ సినిమాటోగ్రఫీ నిర్మాణ విలువలు సినిమాని మరో స్థాయికి తీసుకువెళ్లాయి. భారీ అంచనాల నడుమ మే 1న ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ చిత్రం ఇప్పటికే 49 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇదే జోరులో మరో 4 రోజులు కంటిన్యూ అయితే 100 కోట్ల క్లబ్ లో చేరిపోవడం ఖాయం అని అంటున్నారు విశ్లేషకులు.
Hearing fantastic reviews about #HIT3.
Special mention to my dear brother @NameisNani ❤️ for choosing unique scripts and scoring blockbusters across genres.
Hats off to @KolanuSailesh for scripting and executing this intense film.
Congratulations @SrinidhiShetty7,…
— Ram Charan (@AlwaysRamCharan) May 3, 2025