BigTV English

Snow storm : అమెరికాలో మంచు తుపాన్ బీభత్సం.. కెనడా, జపాన్ లోనూ హిమ విలయం..

Snow storm : అమెరికాలో మంచు తుపాన్ బీభత్సం.. కెనడా, జపాన్ లోనూ హిమ విలయం..

Snow storm : అగ్రరాజ్యం అమెరికాలో మంచు తుపాను బీభత్సం సృష్టిస్తోంది. ముఖ్యంగా న్యూయార్క్‌ రాష్ట్రం అతలాకుతలమైంది. ఈ రాష్ట్రంలోనే 27 మంది మృత్యువాత పడ్డారు. దీంతో అమెరికాలో మంచు తుపాను బారిన పడి మరణించిన వారి సంఖ్య 48కి చేరింది. తుపాను ప్రభావం ఎక్కువగా ఉన్న బఫెలో నగరంలో 20 మంది మృతి చెందారని స్థానిక అధికారులు వెల్లడించారు. నయాగ్రా విమానాశ్రయ ప్రాంతంలో 109 సెం.మీ. మంచు కురవడంతో మంగళవారం ఉదయం వరకు విమాన సర్వీసులను రద్దు చేశారు.


అమెరికాలో పలుచోట్ల మంచు కింద ఇళ్లు, కార్లు ఇరుక్కుపోయాయి. ఇందులో చాలామంది చిక్కుకుపోయి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. కొన్నిచోట్ల కార్లు మంచు కింద ఆరు అడుగుల లోతు వరకు కూరుకుపోయాయి. దీంతో మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆదివారం 2400 విమానాలు రద్దయ్యాయని ఫ్లైట్‌ అవేర్‌ సంస్థ ప్రకటించింది. తూర్పు అమెరికాలోనూ ఇదే పరిస్థితి ఉంది. క్రిస్మస్‌ రోజు దాదాపు 2 లక్షలకుపైగా ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అట్లాంటా, షికాగో, డెన్వర్‌, డెట్రాయిట్‌లలో మంచు తుపాను వల్ల ప్రజలు కష్టాలు పడుతున్నారు.

కెనడాలోనూ మంచు తుపాను విలయతాండవం చేస్తోంది. ఒంటారియో, క్యూబెక్‌లలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో లక్షల మంది ప్రజలు అంధకారంలో ఉన్నారు. ప్రధాన నగరాల్లో అనేక విమాన సర్వీసులు రద్దయ్యాయి. టొరంటో- ఒట్టావాల మధ్య రైలు సేవలు నిలిపేశారు. ఇక్కడి బ్రిటిష్‌ కొలంబియాలో మంచు రోడ్డుపై బస్సు బోల్తాపడిన ఘటనలో నలుగురు మృతి చెందారు.


జపాన్‌లో భారీగా మంచు కురుస్తోంది. ఆ దేశంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. జపాన్ లో వారం నుంచి ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. జపాన్‌ ఉత్తర ప్రాంతంపై మంచు ప్రభావం ఎక్కువగా ఉంది. ఇక్కడి రహదారులపై వందల వాహనాలు చిక్కుకుపోయాయి. ఈసాన్య జపాన్ లో సాధారణం కంటే మూడు రెట్లు ఎక్కువగా మంచు కురుస్తోంది.

Related News

Heavy Rains: తెలంగాణకు రెడ్ అలర్ట్.. హైదరాబాద్‌లో భారీవర్షాలతో మునిగిపోయే జోన్స్ ఇవే

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Big Stories

×