Comedian Sudhakar: ఇప్పుడంటే సత్య కామెడీ బాగుంది.. వెన్నెల కిషోర్ మ్యానరిజం చూసి అవాక్కవుతున్నావ్.. కానీ, ఒకప్పుడు కమెడియన్ సుధాకర్ మ్యానరిజం, ఆయన చేసిన కామెడీ ఇప్పటి జనరేషన్ కు తెలియదు. బ్రహ్మానందం నుంచి మొదలుకొని సుధాకర్ వరకు అప్పట్లో కమెడియన్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇక ఈ కాలంలో కొన్నిరోజులు సోషల్ మీడియాలో కనిపించకపోతేనే వారు చచ్చిపోయారు అని ప్రకటించేస్తున్నారు.
అలా సుధాకర్ విషయంలో ఎన్నో సార్లు ఇలాంటి అసత్యప్రచారాలు జరిగాయి. కమెడియన్ సుధాకర్ చనిపోయాడు. దీనస్థితిలో సుధాకర్ మృతి.. ఇలాంటి థంబ్ నెయిల్స్ తో వీడియోలను వైరల్ గా మార్చేశారు. ఇక అలా వైరల్ అయిన ప్రతిసారి సుధాకర్ బయటకు వచ్చి నేను బతికే ఉన్నాను అని చెప్పుకోవాల్సిన దుస్థితి. దీనివలన ఆయన ఎంతో మనోవేదనకు గురయ్యాడు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సుధాకర్ పూర్తిగా ఇంటికే పరిమితమయ్యాడు.
Allu Arjun: ఇకపై బన్నీని అలా పిలవకండి.. ఫ్యామిలీ మెంబర్స్ కఠిన నిర్ణయం.!
ఇక ఈ మధ్యనే ఆయన తన కొడుకు బెన్నీతో కలిసి ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. తన స్ట్రగుల్స్ నుంచి చనిపోయాను అన్న ఫేక్ న్యూస్ వారు అన్ని అభిమానులతో పంచుకున్నాడు. ఇక సుధాకర్ కెరీర్ మొదట్లోనే హీరోయిన్ రాధికాతో గొడవ పడ్డాడని వార్తలు వినిపించాయి. అంతేకాదు ఆమెతో పెళ్లి అని రూమర్స్ కూడా వచ్చాయి. వీటన్నింటికి సుధాకర్ సమాధానాలు ఇచ్చాడు.
” రాధికాది నాది మంచి పెయిర్. మేమిద్దరం కలిసి హీరోహీరోయిన్లుగా 12 సినిమాల్లో నటించాం. నా కెరీర్ మొదలైంది తూర్పు వెళ్లే రైలు అనే సినిమాతో.. అందులో రాధికా హీరోయిన్. మొదటి రోజు.. మొదటి షూట్.. రాధికాతో సీన్ అనగానే వణికిపోయాను. అప్పటికే సీనియర్ గా ఉన్న ఆమెతో సీన్ అంటే చాలా కంగారుపడ్డాను. ఆ షాట్ లో ఆమెను ఎత్తుకొని గిరాగిరా తిప్పాలి. నేను కంగారులో ఆమెను ఎత్తుకొనేసరికి.. నా చేతులు ఆమె చీర కుచ్చిళ్ళలోకి వెళ్లాయి. అంతేకాకుండా నా గోళ్లు ఆమెకు గీరుకుపోయాయి. దీంతో ఆమె ఒక్కసారిగా కిందకు దిగి అందరిముందు చెంప మీద చెళ్ళున కొట్టింది.
Urvashi Rautela: పొగుడుతున్నారనుకుంటుందేమో.. అమ్మ నా బూతులు తిడుతున్నారని చెప్పండ్రా పాపకు..
ఆ తరువాత రాధికా దగ్గరకు వెళ్లి సారీ చెప్పాను. ఆమె అర్ధం చేసుకొని ఓకే అంది. అప్పటి నుంచి మేము చాలా క్లోజ్ అయ్యాం. వరుస సినిమాలుచేశాం. అప్పుడే మేము ప్రేమలో ఉన్నామని, పెళ్లి చేసుకుంటున్నామని వార్తలు వచ్చాయి. ఆ వార్తలు అన్ని అబద్దం. నేను మా పెద్దలు చూపించిన సంబంధమే చేసుకున్నాను. కానీ, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అంటే చెడు అలవాట్లు ఉంటాయి అని అప్పట్లో దుష్ప్రచారం జరిగేద. అలా తనపై కూడా కొన్ని తప్పుడు వార్తలు వచ్చాయి. కానీ,రాధికాతో నాకు ఎలాంటి సంబంధం లేదు” అంటూ చెప్పుకొచ్చాడు.
ఇక ప్రస్తుతం సుధాకర్ తన కొడుకు బెన్నీని ఇండస్ట్రీకి తీసుకురావాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. తనను ఆదరించినట్లే తన కొడుకును కూడా ఆదరించాలని కూడాతెలిపాడు. మరి సుధాకర్ కొడుకు బెన్నీ ఇండస్ట్రీకి ఎప్పుడు.. ఏ సినిమాతో ఎంట్రీ ఇస్తాడో చూడాలి.