Ram Gopal Varma..టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) ఒకప్పుడు శివ, క్షణక్షణం, గోవిందా గోవింద లాంటి చిత్రాలు చేసి భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. అయితే ఈ మధ్య ఆయన ఫోకస్ పెట్టలేదు కానీ.. ఒకవేళ ఫోకస్ చేస్తే మాత్రం మళ్లీ రూ.1000 కోట్ల సినిమా మన ముందుకు తీసుకురావడం గ్యారెంటీ అని ఇప్పటికే ఆయన అభిమానులు కూడా విశ్వాసం వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇకపోతే ఈయన దగ్గర దర్శకత్వంలో మెలుకువలు నేర్చుకొని.. ఇప్పుడు స్టార్ డైరెక్టర్లుగా చలామణి అవుతున్న ఎంతోమందిని చూసి వర్మ కాస్త కళ్ళు తెరుచుకున్నారేమో అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే తన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి, ఇప్పుడు తనకే పోటీగా వస్తున్న సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కు డైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చేశారు రాంగోపాల్ వర్మ.
నేనేంటో చూపిస్తాను అంటూ సందీప్ కి కౌంటర్ ఇచ్చిన వర్మ.
గతంలో ఒక ఇంటర్వ్యూలో వర్మ నుంచి ఒక మంచి సినిమా రావాలి అని, ఇండియన్ బాక్సాఫీస్ ను శాసించే అంత గొప్ప సినిమా రావాలి అని కాస్త ఘాటుగానే కామెంట్లు చేశారు సందీప్ రెడ్డి వంగ. అయితే ఇప్పుడు దానిని దృష్టిలో పెట్టుకొని వర్మ తన పుట్టినరోజు సందర్భంగా ఒక గట్టి నిర్ణయం తీసుకున్నారే మో అనే అనుమానాలు ఆయన పోస్ట్ చూశాక వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు తాజాగా ఆయన ఎక్స్ వేదికగా సందీప్ రెడ్డి వంగాను ట్యాగ్ చేస్తూ.. “నేనేంటో త్వరలో నీకు చూపిస్తాను’ అంటూ గట్టిగా కౌంటర్ ఇచ్చారు వర్మ . అసలు విషయంలోకి వెళ్తే సందీప్ రెడ్డివంగా ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని ఓవర్ నైట్ లోనే స్టార్ డైరెక్టర్ అయిపోయారు.ఇక గత ఏడాది వచ్చిన బాలీవుడ్ మూవీ ‘యానిమల్’ తో రూ.1000 కోట్ల క్లబ్ లో చేరి సత్తా చాటారు.
NTR – Prashanth Neel: షూటింగ్ సెట్లో అడుగుపెట్టబోతున్న సింహం.. అనౌన్స్మెంట్ పోస్టర్ వైరల్..!
తానేంటో నిరూపించుకునే టైం వచ్చిందా..?
ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా.. రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) తో ‘స్పిరిట్’ సినిమా చేయడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. అంతేకాదు సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ కి కండిషన్ కూడా పెట్టారట. తనకోసం ఒక 9 నెలలు సమయం కేటాయించాలని.. ఈలోపు ఏ సినిమాకి కూడా ఒప్పుకోకూడదని.. ఈ పూర్తి 9 నెలల సమయంలోనే స్పిరిట్ సినిమాను రిలీజ్ చేసి విడుదలకు సిద్ధం చేస్తామని తెలిపారట. ఇక ఇలా ఇంత ధీమాతో వరుస సినిమాలు చేస్తూ ఆడియన్స్ కి మంచి వినోదాన్ని పంచుతూ ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద గ్రేటెస్ట్ డైరెక్టర్స్ లో ఒకరిగా పేరు తెచ్చుకుంటున్న సందీప్ రెడ్డి వంగాకు వర్మ కౌంటర్ ఇవ్వడం జరిగింది . మరి ఇలాంటి డైరెక్టర్ తో ఒక స్టార్ డైరెక్టర్ పోటీ పడబోతున్నారు. మరి తానేంటో నిరూపించుకునే సమయం వచ్చింది కాబట్టి వర్మ ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసే కథతో ప్రేక్షకులు ముందుకు రావాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. మరి చూద్దాం వర్మ తన మాటను ఏ మేరకు నిలబెట్టుకుంటారో.