Ram Pothineni: ఇండస్ట్రీలో ఎవరైనా హీరో, హీరోయిన్ కాస్త సన్నిహితంగా కనిపిస్తే చాలు.. వారిద్దరూ ప్రేమలో ఉన్నారని రూమర్స్ పుట్టుకొస్తాయి. చాలావరకు ఆ రూమర్స్ నిజమే అయినా దానిపై ఆ హీరో, హీరోయిన్ స్పందించడానికి ఇష్టపడరు. అలా ఇప్పటివరకు చాలామంది నటీనటులు ప్రేమలో పడి, ఎవ్వరికీ చెప్పకుండా డేటింగ్ వరకు వెళ్లారు. తాజాగా టాలీవుడ్‌లో అలాంటి మరో ప్రేమజంట పుట్టుకొచ్చిందని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆ జంట మరెవరో కాదు.. రామ్ పోతినేని (Ram Pothineni), భాగ్యశ్రీ భోర్సే. తెలుగులో కేవలం ఒకే ఒక్క సినిమా అనుభవం ఉన్న భాగ్యశ్రీ భోర్సే.. యంగ్ హీరో రామ్‌తో ప్రేమలో పడిందని, దానికి ప్రూఫ్ కూడా దొరికిందని నెటిజన్లలో హాట్ టాపిక్‌గా మారింది.
కన్ఫర్మ్ అయ్యింది
యంగ్ హీరో రామ్.. చాలా చిన్న వయసులోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. ఎక్కువగా ప్రేమకథలతోనే ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం చేశాడు. అందుకే చాక్లెట్ బాయ్‌గా పేరు తెచ్చుకొని చాలామంది అమ్మాయిలకు క్రష్‌గా మారాడు. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా ఎప్పుడూ రామ్‌పై పెద్దగా రూమర్స్ అనేవి రాలేదు. రామ్ రిలేషన్‌షిప్‌పై, తన పర్సనల్ లైఫ్‌పై ఎప్పుడూ రూమర్స్ అనేవి క్రియేట్ కాలేదు. అలాంటిది ఇన్నేళ్ల తర్వాత ఒక నార్త్ ముద్దుగుమ్మతో రామ్ ప్రేమలో పడ్డాడనే వార్తలో ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. దీంతో తన లేడీ ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్ అయ్యింది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో రామ్ షేర్ చేసిన పోస్ట్ చూస్తుంటే తను రిలేషన్‌లో ఉన్నాడనే వార్తలు నిజమేనేమో అని కన్ఫర్మ్ అయిపోతోంది.
చూస్తూనే ఉంటాను
రామ్ సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్ కాకపోయినా అప్పుడప్పుడు కొన్ని క్యూట్ ఫోటోలు షేర్ చేస్తూ తన గర్ల్ ఫ్యాన్స్‌ను హ్యాపీ చేస్తుంటాడు. అలా తాజాగా వైట్ టీషర్ట్‌లో ఒక కూల్ లుక్‌తో ఫోటోలు షేర్ చేశాడు. ఫోటో ఓకే కానీ దాని క్యాప్షన్ కాస్త డిఫరెంట్‌గా ఉంది. ‘నేను నిన్ను చూస్తున్నప్పుడు చూస్తూనే ఉంటాను. చూడనప్పుడు కూడా చూస్తూనే ఉంటాను’ అంటూ ఈ పోస్ట్‌కు క్యాప్షన్ షేర్ చేశాడు. అంతా బాగానే ఉంది అనుకున్న సమయంలో హీరోయిన్ భాగ్యశ్రీ భోర్సే (Bhagyashri Borse) కూడా కొన్ని గంటల్లోనే తన ఫోటోను షేర్ చేసింది. ఫోటోలు మామూలుగానే ఉన్నా తను షేర్ చేసిన క్యాప్షన్‌లో నెటిజన్లలో సందేహాలు మొదలయ్యేలా చేసింది.
Also Read: ‘పాడుతా తీయగా’పై ప్రవస్తి ఆరోపణలు.. అందరికంటే సునీతనే డేంజర్ క్యాండిడేట్
ఒకే ఇంట్లో
‘హే క్యూటీ ఫ్లోలో వెళ్లిపోవడం మర్చిపోకు’ అనే క్యాప్షన్‌తో తన ఫోటోలు షేర్ చేసింది భాగ్యశ్రీ భోర్సే. అయితే రామ్, భాగ్యశ్రీ షేర్ చేసిన ఫోటోల్లో బ్యాక్‌గ్రౌండ్ చాలావరకు ఒకేలా ఉంది. సరిగ్గా గమనించి చూస్తే అది రామ్ ఇల్లే అని తెలుస్తోంది. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ఒక ప్రేమకథలో నటిస్తున్నారు. దానికి సంబంధించిన షూటింగ్ రామ్ ఇంట్లో జరుగుతుండగా వీరిద్దరూ మామూలుగా ఇలా ఫోటోలు దిగి షేర్ చేసి ఉంటారని కొందరు అంటుండగా.. మరికొందరు మాత్రం వీరు కూడా విజయ్, రష్మిక మాత్రం సీక్రెట్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఈ విషయంపై వీరు స్వయంగా క్లారిటీ ఇచ్చేవరకు ఈ రూమర్స్‌కు చెక్ పడదు.
🤨🤨….#RAPO22 #rampothineni pic.twitter.com/NDLdpTPhld
— Nurul Absed #rapo (@nurul_absed) April 19, 2025