Pastor Praveen case: పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల మృతి కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలన మారింది. అయితే ప్రవీణ్ కుమార్ పగడాల మృతిపై కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ ఆరా తీశారు.
ప్రవీణ్ కుమార్ మృతి కేసుకు సంబంధించి మాజీ ఎంపీ హర్షకుమార్ సోనియా గాంధీ ఓ లేఖ రాశారు. ప్రవీణ్ ను దారుణంగా హత్య చేసి చంపారని లేఖలో పేర్కొన్నారు. హర్ష కుమార్ రాసిన లెటర్ కు సోనియాగాంధీ రిప్లై ఇచ్చారు. ప్రవీణ్ మృతిపై ఈ నెల 16న హర్షకుమార్, సోనియాగాంధీకి లేఖ రాశారు. ఈ క్రమంలోనే ఆమె ప్రవీణ్ మృతికి సంబంధించి అంశాన్ని నోట్ చేసుకున్నట్టు ఆమె వెల్లడించారు.
Also Read: CM Revanth Reddy: మా రాష్ట్రానికి రండి.. వ్యాపారవేత్తలకు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం..
మార్చి 24న ప్రవీన్ కుమార్ పగడాల మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన మృతిచెందని వారం రోజుల లోపే పోలీసులు పలు సీసీ టీడీ ఫుటేజీలు విడుదల చేస్తూ యాక్సిడెంట్ లో మృతిచెంది ఉండొచ్చని తెలిపారు. పోస్టుమార్టం రిపోర్టులో కూడా ప్రవీణ్ కుమార్ పగడాల మద్యం సేవించినట్టు వైద్యులు గుర్తించారని పోలీసులు పేర్కొన్నారు. మద్యం ఎక్కువగా తీసుకోవడం వల్లే ప్రవీణ్ యాక్సిడెంట్ కు గురయ్యి మృతిచెందాడని పోలీసులు తెలిపారు.
అయితే మాజీ ఎంపీ హర్షకుమార్ మాత్రం ఇది ముమ్మాటికీ హత్యేనని పలు సార్లు లేవనత్తారు. ఈ క్రమంలోనే ప్రవీణ్ పగడాల యాక్సిడెంట్ లో మృతిచెందలేదని.. కావాలనే కొందరు హత్య చేయించారని సోనియాగాంధీకి లేఖ రాశారు. ఈ క్రమంలోనే హర్షకుమార్ లేవనెత్తిన అంశాలను సోనియాగాంధీ నోట్ చేసుకున్నట్టు వెల్లడించారు. అయితే ప్రవీణ్ కుమార్ పగడాల మృతిపై సోనియాగాంధీ రియాక్ట్ అవ్వడంపై ఈ కేసులో రీపోస్టుమార్టం లేదా పోలీసులు ఈ కేసును మళ్లీ దర్యాప్తు చేస్తారో చూడాలి మరి.
Also Read: CSIR-NEERI Recruitment: ఇంటర్ పాసైన వారికి బంపర్ ఆఫర్.. ఈ జాబ్ కొడితే నెలకు రూ.80,000 జీతం భయ్యా..