BigTV English

Rana Daggubati: రొమాంటిక్ సినిమాలో రానా.. అది కూడా అలాంటి పాత్రలో.. ఇదెక్కడి ట్విస్ట్ రా మావా

Rana Daggubati: రొమాంటిక్  సినిమాలో రానా.. అది కూడా అలాంటి పాత్రలో..  ఇదెక్కడి ట్విస్ట్ రా మావా

Rana Daggubati: టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి ఫుల్ లెంత్ హీరోగా కనిపించి చాలా రోజులు అవుతుంది. స్టార్ హీరోల సినిమాల్లో అప్పుడప్పుడు అలా వచ్చి ఇలా వెళ్లిపోయే రోల్స్ చేస్తున్న రానా.. తన తదుపరి చిత్రాన్ని ఎప్పుడు ప్రకటిస్తాడా.. ? అని అభిమానులందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. గతేడాది రానా నాయుడు అంటూ నెట్ ఫ్లిక్స్ లో బాబాయ్ వెంకటేష్ తో అదరగొట్టిన రానా .. ఇప్పుడు ఈ సిరీస్ కు సీక్వెల్ లో నటిస్తూ బిజీగా మారాడు.


సినిమాల్లో కనిపించకపోయినా ఎప్పుడు సోషల్ మీడియాలోనే ఉంటూ ఉండడంతో రానా తెరపై కనిపించడం లేదు అనే బాధలో అయితే ఫ్యాన్స్ లేరు అని చెప్పాలి. ఇక తాజాగా ఈ హీరో.. ఒక రొమాంటిక్ సినిమాలో దర్శనమిచ్చి షాక్ ఇచ్చాడు. అదే లవ్ మౌళి. నవదీప్ హీరోగా ఎస్.ఎస్. రాజమౌళి శిష్యుడు అవ‌నీంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను నైరా క్రియేషన్స్ మరియు శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్‌తో క‌లిసి సి స్పేస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

ఇక ఈ చిత్రంలో నవదీప్ సరసన పంఖురి గిద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా మొదటి పోస్టర్ రిలీజ్ అయినప్పుడే సెన్సేషన్ క్రియేట్ చేసింది. నవదీప్ నగ్నంగా నిలబడి బీర్ తాగుతూ కనిపించాడు. ఆయా ఒక్క పోస్టర్ తోనే సినిమాపై ఓ రేంజ్ హైప్ క్రియేట్ అయ్యింది. ఆ తరువాత ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను మరింత ఆకట్టుకున్నాయి.


ముఖ్యంగా హీరో బ్రాలో మందు తాగ‌డం, ఘాటు రొమాన్స్, లిప్ కిస్ లు, నగ్నంగా కనిపించడం.. ఇలాంటివన్నీ చూసి.. అసలు ఏం సినిమారా ఇది అనుకున్నారు. ఆ హైప్ తోనే సినిమాకు వెళ్లాలనే ఇంట్రెస్ట్ ను కలుగజేశారు మేకర్స్. ఇక సింగిల్‌ కట్‌ కూడా లేకుండా సెన్సారును పూర్తిచేసుకున్న ఈ చిత్రం జూన్ 7 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

నేడు మీడియాకు ప్రీమియర్లు వేసినట్లు తెలుస్తోంది. సినిమాలో రానా గెస్ట్ రోల్ లో కనిపించినట్లు సమాచారం. నవదీప్ కు శాపం ఇచ్చే అఘోరా పాత్రలో రానా కనిపించినట్లు టాక్ నడుస్తోంది. మరి ఇలాంటి పాత్రను రానా ఎలా ఒప్పుకున్నాడు అని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సినిమాతో రానాకు ఏమైనా ప్రశంసలు దక్కుతాయేమో చూడాలి.

Related News

Bigg Boss 9 Wildcard Entry: 6 గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్… యాడ దొరికిన సంతరా ఇది.. అంతా స్క్రాపే

PVRInox : తింటూ సినిమా చూసే ఎక్స్పీరియన్స్, ఏంట్రా బాబు ఆ సౌండ్స్ ను ఎలా భరించాలి

Durga Rao: టిక్ టాక్ దుర్గారావు ఇంట్లో విషాదం.. సమాధి దగ్గరే.. కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం!

Rakesh Poojary: ‘కాంతారా-1’లో కడుపుబ్బా నవ్వించిన.. ఈ నటుడు ఎలా చనిపోయాడో తెలుసా? కన్నీళ్లు ఆగవు!

Janu lyri- Deelip Devagan: జాను లిరితో బ్రేకప్.. దిలీప్ రియాక్షన్ ఇదే.. సెలబ్రిటీలం కాబట్టే అంటూ!

Siva jyothi: ఘనంగా శివ జ్యోతి సీమంతపు వేడుకలు.. ఫోటోలు వైరల్!

Manchu Manoj: భార్యపై మనసులోని భావాలు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ 

Tollywood: భార్య వేధింపులు తాళలేక ప్రముఖ నటుడు ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్!

Big Stories

×