Sundeep Kishan on Rana : ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమాలతో పాటు, కాన్సెప్ట్ బేస్ సినిమాలు కూడా వస్తున్నాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న తెలుగు సినిమాల వైపు ప్రపంచ వ్యాప్తంగా ఆడియన్స్ చూడటం మొదలుపెట్టారు. మరోవైపు చిన్న కాన్సెప్ట్ సినిమాలను కూడా తెలుగు ప్రేక్షకులు ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు. కేవలం ప్రేక్షకులు మాత్రమే కాకుండా కొంతమంది సెలబ్రిటీలు కూడా నిజంగా ఒక సినిమా నచ్చితే సోషల్ మీడియా వేదిక దాని గురించి పదిమందికి చెబుతూ ఉంటారు. ముఖ్యంగా రానా లాంటి హీరో అయితే ఆ సినిమాని మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు. ఇప్పటివరకు రానా అలా ఎన్నో సినిమాలను ఎంకరేజ్ చేస్తూ వచ్చాడు. ఒకవైపు చిన్న కాన్సెప్ట్ సినిమాలను, మరోవైపు భారీ బడ్జెట్ సినిమాలను కూడా ప్రమోట్ చేయడంలో రానా ప్రముఖ పాత్ర వహిస్తాడు.
Also Read: Sai Madhav Burra: రచయితగా ఇక్కడ నిలబడ్డాను అంటే దానికి కారణం వారిద్దరే
వెంకటేష్ మహా దర్శకుడిగా పరిచయమైన కేరాఫ్ కంచరపాలెం సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలామంది తెలుగు ఆడియోస్ కి ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన సినిమా అది. జాగర్లమూడి క్రిష్, ఎస్ ఎస్ రాజమౌళి, సుకుమార్ వంటి దర్శకులు ఆ సినిమాను చూసి విపరీతంగా ప్రశంసించారు. ఆ సినిమా అంతమందికి రీచ్ అవ్వడానికి కూడా కారణం రానా అని చెప్పాలి. ఇక రీసెంట్ గా నివేదా థామస్ నటించిన 35 సినిమాను కూడా రానా విపరీతంగా ప్రమోట్ చేశాడు. ఇక బాహుబలి సినిమాతో రానాకి కూడా మంచి గుర్తింపు లభించింది. భారీ బడ్జెట్ సినిమాలు కూడా ఇతర రాష్ట్రాల్లో రానా ప్రమోట్ చేస్తూ ఉంటాడు. ఒక మంచి సినిమాకి రానా సపోర్ట్ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది.
Also Read : Devara: దేవర రూ.1000 కోట్లు రాబట్టేది.. పరుచూరి గోపాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు
ఇక రీసెంట్ గా విరించి వర్మ దర్శకత్వంలో రాకేష్ (Rakesh Varre) నటించిన సినిమా జితేందర్ రెడ్డి. ఈ సినిమా ఈవెంట్ లో రాకేష్ మాట్లాడుతూ అప్ కమింగ్ యాక్టర్స్ ను ఎవరు ఎంకరేజ్ చేయరు, ఎంతోమంది సెలబ్రిటీలను పిలిచినా కూడా వాళ్లు రారు మాట్లాడాడు. అయితే నేడు జరిగిన ఒక ట్రైలర్ ఈవెంట్ లో సందీప్ కిషన్ మాట్లాడుతూ చాలా మంది వాళ్లకు సపోర్ట్ లేదు అని బాధపడుతున్నారు. వాళ్లకు నేను రానా నెంబర్ ఇస్తాను. ఖచ్ఛితంగా వాళ్లకు రానా సపోర్ట్ తప్పకుండా ఉంటుందని మాట్లాడాడు. రానా వాళ్ళకి సపోర్ట్ చేయడంతో పాటు వాళ్ళ ఈవెంట్స్ కి రావడమే కాకుండా మమ్మల్ని కూడా తీసుకువస్తాడు అంటూ సందీప్ కిషన్ తెలిపాడు. ఇక సందీప్ విషయానికి వస్తే ప్రస్తుతం త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో మజాకా అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 15న రిలీజ్ చేసే ప్లాన్ లో ఉంది చిత్ర యూనిట్.