Munaf Patel – Delhi Capitals: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కోసం ఇప్పటినుంచి బీసీసీఐ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఐపీఎల్ 2025 టోర్నమెంట్ కు సంబంధించిన రిటెన్షన్ ప్రక్రియను పూర్తి చేసింది బీసీసీఐ. ఈ నెల చివర్లో ఐపీఎల్ మెగా వేలం కూడా నిర్వహించబోతుంది.
Also Read: IPL 2025 Auction: RCB కొత్త కెప్టెన్ అతనే…ఏకంగా రూ.20 కోట్లతో కొనుగోలు ?
అయితే ఇలాంటి నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్.. బౌలింగ్ కోచ్గా కొత్త వ్యక్తిని తీసుకువచ్చింది. అతను ఎవరో కాదు టీమిండియా మాజీ బౌలర్ మునాఫ్ పటేల్. 2025 ఐపీఎల్ టోర్నమెంట్ కోసం గాను…. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బౌలింగ్ కోచ్గా మునాఫ్ పటేల్ ఇకనుంచి పనిచేయబోతున్నాడు. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చినట్లు తెలుస్తోంది.
IPL 2025 కోసం ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ కోచ్‌గా జేమ్స్ హోప్స్ స్థానంలో మునాఫ్ పటేల్ నియమితులయ్యారు. కాగా మునాఫ్ పటేల్… టీమిండియా కు సుదీర్ఘ కాలం పాటు ఫాస్ట్ బౌలర్ గా పని చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రిటైర్మెంట్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న మునాఫ్ ఇప్పుడు మళ్లీ రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు అన్నమాట.