Devara: పరుచూరి బ్రదర్స్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలకు కథలను అందించిన బ్రదర్స్ గా పేరు తెచ్చుకున్నారు పరుచూరి గోపాలకృష్ణ, పరుచూరి వెంకటేశ్వరరావు. ఇక పరుచూరి వెంకటేశ్వరరావు ఎన్నో సినిమాల్లో కూడా నటించి మెప్పించారు. ప్రస్తుతం ఆయన కొన్ని అనారోగ్య సమస్యలతో ఇంటి వద్దనే విరామం తీసుకుంటున్నారు.
ఇక పరుచూరి గోపాలకృష్ణ పరుచూరి పాఠాలు అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ ను నడుపుతున్న విషయం తెలిసిందే. పెద్ద సినిమాలు, హిట్ సినిమాలు ఓటీటీలో చూసి తన యూట్యూబ్ ఛానల్ లో తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. ఒక సినీ కథా రచయితగా ఆ సినిమాలోని లోటుపాట్లను తెలుపుతూ ఉంటాడు. తాజాగా పరుచూరి గోపాలకృష్ణ.. దేవర సినిమాపై తన రివ్యూ ను అందించాడు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా శివ కొరటాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ అయి మంచి విజయాన్ని అందుకుంది.
ఇక ప్రస్తుతం దేవర నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా దేవరను వీక్షించిన పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ ” ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ సోలో హీరోగా దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తాడు కాబట్టి ఎటువంటి కథతో వెళ్తాడు అనే ఆలోచన అందరి మైండ్ లోనూ ఉంటుంది. పైగా కొరటాల శివ..అంతకుముందు ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కాకపోతే ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయాడు.
Sai Pallavi: అతనితో నావల్ల కాలేదు.. అర్ధరాత్రి చెల్లిని పట్టుకొని ఏడ్చాను
ఇక ఆ అంచనాలపైనే దేవర సినిమాను ఏం చేస్తాడు అని అందరూ అనుకున్నారు కానీ అలా అనుకోవడం మంచిది కరెక్ట్ కాదు. ఎందుకంటే 400 సినిమాలు తీసిన మేము కూడా ఆకాశాన్ని చూసాము.. కొన్ని ప్లాప్స్ చూశాము. దానికి ఎవరిని నిందించలేము. ఈ సినిమాకు ప్రత్యేకంగా మెచ్చుకోవాల్సింది సినిమాటోగ్రఫీ రత్నవేలును. ఈ సినిమాలో, సముద్రపు షాట్స్, షార్క్ ఫైట్ ఇవన్నీ ఎంతో అద్భుతంగా చూపించినందుకు ఆయనకు కూడా క్రెడిట్ ఇవ్వాలి.
ఇక మ్యూజిక్ అనిరుథ్ బాగుంది కానీ, చిన్నరామయ్య స్థాయికి తగ్గట్టు లేదనేది నా అభిప్రాయం. చాలామంది ఈ సినిమాను బాలేదు అన్నారు.. కొంతమంది బాగుంది అన్నారు కొంతమంది మిక్స్ టాక్ అన్నారు. డిఫరెంట్ టాక్ కనుక వస్తే ఆ సినిమాను ఆడించాలంటే ఎంతో దమ్మున్న హీరో తప్ప ఇంకెవరికి సాధ్యం కాదు. ఆ దమ్ము ఎన్టీఆర్ కు ఉంది. ఎవరు ఎలాంటి టాక్ అన్నా పట్టించుకోకుండా అవన్నీవదిలేసి చిన్నరామయ్య దేవరను ముందుకు తీసుకెళ్లాడు.
Siddharth: ‘మిస్ యూ’ అంటున్న సిద్దార్థ్.. టీజర్ అదిరింది
క్లుప్తంగా సినిమా గురించి చెప్పాలంటే ఇది ఒక సముద్రపు దొంగల కథ. ఒక దొంగ మంచివాడుగా మారిన తర్వాత ఏం జరిగింది..? తన తండ్రి కోసం ఒక కొడుకు ఏం చేశాడు అనేది కథ. ఆ కథ మీద ఆధారపడి మూడు గంటల సినిమాను కొరటాల లాగించాడు అంటే అది చిన్న విషయం ఏమీ కాదు. పైగా సముద్రంలో అలాంటి సీన్స్ చూపించడం అంటే ఈజీ కాదు. కొరటాల శివ మాత్రం స్క్రీన్ ప్లే మాస్టర్ అనిపించాడు.
ఎందుకంటే ఈ కథ నాకు తెలిసి చిన్నరామయ్య బాడీ లాంగ్వేజ్ కు సెట్ అయ్యే కథ కాదు అని నేను నమ్ముతాను. కానీ, చిన్నరామయ్య బాడీ లాంగ్వేజ్ కి సరిపడే కథనే అని ప్రేక్షకుల చేత ఒప్పించాడు. ఎన్టీఆర్ తో ఇలాంటి సినిమా చేయాలని కొరటాలకు అనిపించడమే ఒక అద్భుతం అని చెప్పాలి. ఇదే కదా హాలీవుడ్లో తీస్తే సూపర్ అంటారు. కథ తెలిసిన కథనం గొప్పగా ఉండేలాగా స్క్రీన్ ప్లే చూపించిన విధానం అద్భుతంగా ఉంది. అలాంటి సినిమాలు విజయాన్ని అందుకుంటాయి అనడానికి దేవర కూడా ఒక ఉదాహరణగా నిలిచింది. ఎన్టీఆర్ యాక్టింగ్, ట్విస్ట్ లు చాలా బాగున్నాయి.
Actor Noel Sean:16 రోజులకే విడాకులు.. నా జీవితం నాశనమైంది.. ఎస్తేర్ ఎలాంటిదంటే ..?
అయితే కొద్దిగా మొదటి భాగం కొంతవరకు తగ్గించాల్సి ఉంటే బాగుండేది. అంటే.. దేవర పాత్రకు సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ ను కొద్దిగా కట్ చేసి ఆ ప్లేస్ లో వర, తంగం రొమాన్స్, కొన్ని కామెడీ సీన్స్ ను యాడ్ చేసి సెకండ్ హాఫ్ లో కొన్ని బలమైన సీన్స్ లో దేవర ఫ్లాష్ బ్యాక్ ను యాడ్ చేసి ఉంటే.. ఈ సినిమా 1000 కోట్లు కచ్చితంగా రాబట్టేది” అని గోపాలకృష్ణ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి