Sai Madhav Burra: ఒకప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో రచయితల ప్రస్తావన వస్తే త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు వినిపించేది. ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకుడుగా సినిమాలు చేయడం మొదలుపెట్టారు. స్టార్ హీరోలతో సూపర్ హిట్ సక్సెస్ అందుకున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు వంటి హీరోలతో రిపీటెడ్ గా వర్క్ చేశారు. త్రివిక్రమ్ డైలాగులు లో ఒక మార్క్ ఉండేది. ఒక డైలాగ్ వినగానే ఇది త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) రాశారు అని పక్కన చెప్పొచ్చు. అది త్రివిక్రమ్ రైటింగ్ కి ఉన్న బ్రాండ్ అంటే. ఇక ప్రస్తుత కాలంలో రచయితల ప్రస్తావన వస్తే సాయి మాధవ్ బుర్ర పేరు వినిపిస్తుంది. ఎన్నో అద్భుతమైన సినిమాలకి ఇప్పటివరకు సాయి మాధవ్ బుర్ర మాటలు అందించారు. సాయి మాధవ రాసే మాటలు చాలా పదునుగా ఉంటాయని చెప్పాలి. ఒక సన్నివేశాన్ని ఎలివేట్ చేయడంలో సాయి మాధవ్ రాసే మాటలు కీలకపాత్రను పోషిస్తాయి.
Also Read : Tere Ishk Mein: ధనుష్ సరసన హిరోయిన్ ఫిక్స్ అయినట్లే
జాగర్లమూడి క్రిష్ ( Jagarlamudi Krish) దర్శకత్వంలో రానా (Raana) నటించిన కృష్ణం వందే జగద్గురు (Krishnam Vandhe Jagadhguru) సినిమాతో రచయితగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టాడు సాయి మాధవ్ బుర్ర. ఈ సినిమాలో డైలాగ్స్ ఎంత పెద్దగా పాపులర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. “గర్భగుడిలో వీధి కుక్క ఉచ్చ పోసినంత మాత్రాన దేవుడు మైల పడడు” “కళ బ్రతుకు నిచ్చేదే కాదు బ్రతుకు నేర్పేది కూడా” వంటి డైలాగ్స్ ఆ సినిమాకి చాలా పెద్ద ప్లస్ అయ్యాయి. ఇక మహానటి సినిమాలో రాసిన డైలాగ్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఖైదీ నెంబర్ 150, గౌతమీపుత్ర శాతకర్ణి, కంచె వంటి ఎన్నో అద్భుతమైన సినిమాలకు సాయి మాధవ్ బుర్ర డైలాగ్స్ అందించారు. క్రిష్ దర్శకత్వం వహించిన మహా నాయకుడు, కథానాయకుడు సినిమాలో కూడా డైలాగ్స్ రాసింది సాయి మాధవ్.
Also Read : Sai Pallavi: అతనితో నావల్ల కాలేదు.. అర్ధరాత్రి చెల్లిని పట్టుకొని ఏడ్చాను
ఇక ప్రస్తుతం ఉన్న యంగ్ ఫిలిం మేకర్స్ లో ప్రశాంత్ వర్మ (Prasanth Varma) ఒకరు. ప్రశాంత్ వర్మ రెండు సంవత్సరాలు పాటు కష్టపడి దేవకీ నందన వాసుదేవా (Devaki Nanada Vasudeva) అనే సినిమా కథను సిద్ధం చేశాడు. ఈ సినిమా ట్రైలర్ నేడు రిలీజ్ చేసింది చిత్రం యూనిట్. ఈ ఈవెంట్ కి సాయి మాధవ్ బుర్ర కూడా హాజరయ్యారు. సాయి మాధవ్ బుర్ర మాట్లాడుతూ నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండటానికి కారణం రానా దగ్గుపాటి మరియు క్రిష్ జాగర్లమూడి అంటూ తెలిపారు. ఇక ట్రైలర్ విషయానికి వస్తే ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్ కి రానా చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సినిమా నవంబర్ 22న రిలీజ్ కు సిద్ధంగా ఉంది.