Jack Pre Release Event: సిద్ధు జొన్నలగడ్డ, బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమానే ‘జాక్’. ఏప్రిల్ 10న విడుదల కానున్న ఈ సినిమాకు తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు మేకర్స్. ఆ ఈవెంట్‌కు ప్రొడ్యూసర్ నాగవంశీ, రానా చీఫ్ గెస్టులుగా హాజరు కావాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో రానా రాలేదు. దీంతో ఫ్యాన్స్ అంతా డిసప్పాయింట్ అయ్యారు. సిద్ధు స్పీచ్ స్టార్ట్ చేయగానే అసలు రానా ఎందుకు రాలేదని ప్రశ్నించారు. దానికి ముందు క్లారిటీ ఇచ్చిన తర్వాతే స్పీచ్ స్టార్ట్ చేశాడు సిద్ధు. తనకు, రానాకు మంచి సాన్నిహిత్యం ఉంది. అందుకే ‘జాక్’ ఈవెంట్‌లో ఒకే వేదికపై ఇద్దరు హీరోలను చూడొచ్చు అనుకున్న ప్రేక్షకులకు నిరాశే మిగిలింది.
అందుకే రాలేదు
‘‘రానా రావాలి. ముంబాయ్‌లో తను రానా నాయుడు సీజన్ 2కు డబ్బింగ్ చెప్తున్నాడు. 5.30కు ఫ్లైట్ ఉంది. అది మిస్ అయ్యింది. మళ్లీ టైమింగ్ మారి, చిన్న పంచాయతి జరిగింది’’ అంటూ రానా రానందుకు కారణాన్ని చెప్పుకొచ్చాడు సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda). ఆ తర్వాత ‘జాక్’ (Jack) సినిమా కోసం కష్టపడిన ప్రతీ ఒక్కరి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు. బొమ్మరిల్లు భాస్కర్ ఇప్పటికే ఇద్దరు సిద్ధులతో సినిమాలు తీశాడని, ఇంకొక సిద్ధు వస్తే ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అవుతారని అన్నాడు. తనను నమ్మి ‘టిల్లు’ ఫ్రాంచైజ్‌ను నిర్మించిన సూర్యదేవర నాగవంశీకి థాంక్యూ చెప్పాడు. తను ఈ స్టేజ్‌పై నిలబడడానికి గల కారణాల్లో వంశీ కూడా ఒక కారణమని అన్నాడు.
చీరకట్టులో బాగుంటావు
‘‘టిల్లు ఫ్రాంచైజ్ తర్వాత ఏ సినిమా చేయాలా అని ఆలోచిస్తున్నప్పుడు భాస్కర్ నా దగ్గరకి జాక్ కథతో వచ్చారు. కథ చెప్పడం పూర్తయిన తర్వాత వెంటనే సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. వైష్ణవి చైతన్య ఏవీ చూసినప్పుడు నాకే గూస్‌బంప్స్ వచ్చాయి. బేబి సినిమా చూసిన వెంటనే వైష్ణవినే జాక్‌లో హీరోయిన్ అని క్లియర్‌గా ఉన్నాం. తన ఏవీలో ఆ అమ్మాయి యూట్యూబ్ నుండి వచ్చింది అని చాలామంది అన్నారు. తనకు ఎంత టాలెంట్ ఉంది అనేది తన కంట్లో పుట్టుమచ్చ లాంటిది. అది నీకు కనిపించకపోయినా మా అందరికీ కనిపిస్తుంది. చీరలు కట్టుకున్నప్పుడు వైష్ణవి చాలా అందంగా ఉంటుంది’’ అంటూ వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya)ను తెగ పొగిడేశాడు సిద్ధు.
Also Read: రాజమౌళి తర్వాత నువ్వే గ్రేట్.. ‘పెద్ది’ గ్లింప్స్‌పై ఆర్జీవీ రివ్యూ
ఆయనతో టార్చర్
‘‘నేను, భాస్కర్ ఆరేంజ్ సినిమా కలిసి చేశాం. కానీ అప్పట్లో ఆయనతో ఎక్కువగా టైమ్ గడిపే అవకాశం నాకు దొరకలేదు. అప్పట్లో నన్ను తిట్టారు కూడా. ఒక మంచి కథ చెప్పాలి అని చాలా ఆలోచిస్తూ ఉంటారు. ఒక సినిమా అయ్యేంత వరకు నిరంతరం దాని గురించే ఆలోచిస్తుంటారు. అందుకే ఆయనంటే నాకు చాలా గౌరవం. ఆయన అసలు పడుకోకుండా పనిచేస్తారు. అందుకే ఆయన అసిస్టెంట్ డైరెక్టర్లకు కూడా టార్చర్. టిల్లుతో నువ్వు క్రియేట్ చేసుకున్న ఇమేజ్ ఎక్కడా తగ్గకూడదు అంటుండేవారు. జాక్ సినిమాను పదేళ్ల తర్వాత కాకుండా వెంటనే హిట్ చేయండి’’ అంటూ సెటైర్ వేశాడు సిద్ధు. అది విన్న బొమ్మరిల్లు భాస్కర్ ‘జాక్’ థీమ్ చెప్పేశాడని స్టేట్‌మెంట్ ఇచ్చాడు.