PBKS VS CSK: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ( Indian Premier League 2025 Tournament ) భాగంగా… ఇవాళ కీలక మ్యాచ్ జరిగింది. చండీగఢ్ లోని ముల్లన్ పూర్ వేదికగా ( Mullanpur, Chandigarh ) పంజాబ్ కింగ్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల ( Punjab Kings vs Chennai Super Kings ) మధ్య 22వ మ్యాచ్ జరిగింది. రెండు జట్లు భారీ స్కోర్ చేయడంతో…. చివరి వరకు… చాలా రసవత్తరంగా కొనసాగింది. అయితే… చివరికి మ్యాచ్ మాత్రం పంజాబ్ కింగ్స్ ను విజయం వరించింది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు దారుణ ఓటమిని మరోసారి చవిచూడాల్సిన వచ్చింది.
ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు.. ఏకంగా 18 పరుగుల తేడాతో దారుణంగా ఓడిపోయింది. చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని చివరలో సిక్స్ లు అలాగే బౌండరీలు కొట్టి మెరుపులు మెరిపించాడు. కానీ చివరి ఓవర్ లో అవుట్ కావడంతో… చెన్నై సూపర్ కింగ్స్ డీలా పడిపోయి ఓడిపోయింది.పంజాబ్ కింగ్స్ విధించిన 220 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయిన చెన్నై సూపర్ కింగ్స్ 201 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 18 పరుగుల తేడాతో ఓడిపోయింది చెన్నై సూపర్ కింగ్స్. ఇప్పటివరకు ఈ టోర్నమెంట్ లో నాలుగు వరుస ఓటమిలను చవిచూసింది చెన్నై సూపర్ కింగ్స్.
Also Read: Sona Dey – Hardik: పాండ్యా లైఫ్ లోకి మరో లేడీ… స్టేడియంలోనే ప్రపోజ్
దుమ్ము లేపిన పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు
చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో మొదట శ్రేయస్ అయ్యర్ జట్టు… బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. ఈ తరుణంలోనే పంజాబ్ కింగ్స్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయిన పంజాబ్ కింగ్స్ ఏకంగా 219 పరుగులు చేసింది. ఇక మిడిల్ ఆర్డర్ ఆటగాళ్లు దారుణంగా విఫలమైనప్పటికీ కూడా… ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య అలాగే శశాంక్ సింగ్ ఇద్దరు అద్భుతంగా ఆడి జట్టును.. భారీ స్కోర్ దిశగా తీసుకువెళ్లారు. ఈ మ్యాచ్ లో ప్రియాన్ష్ ఆర్య 42 బంతుల్లోనే 103 పరుగులు చేశాడు. ఇందులో తొమ్మిది సిక్సర్లు అలాగే ఏడు బౌండరీలు ఉన్నాయి. 245 స్ట్రైక్ రేట్ తో దుమ్ము లేపాడు ఆర్య.
Also Read: Digvesh Rathi: ఏం గుండె రా వాడిది.. ఎన్ని ఫైన్స్ వేసినా వాడు మారేలా లేడు !
అలాగే శశాంక్ సింగ్ 36 బంతుల్లోనే 52 పరుగులు చేసి రఫ్ ఆడించాడు. ఇందులో మూడు సిక్సర్లతో పాటు రెండు బౌండరీలు ఉన్నాయి. 144 స్ట్రైక్ రేట్ తో రెచ్చిపోయాడు శశాంక సింగ్. చివర్లో మార్కో జాన్సన్ కూడా ఆల్రౌండ్ ప్రదర్శన కనబరిచాడు. 19 బంతుల్లోనే 34 పరుగులు చేశాడు మార్కో జాన్సన్. ఇందులో రెండు సిక్సర్లతో పాటు రెండు బౌండరీలు ఉన్నాయి. ప్రభు సిమ్రాన్ డక్ అవుట్ కాగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 9 పరుగులకు అవుట్ అయ్యాడు. అలాగే స్టోయినోస్ నాలుగు పరుగులకు అవుట్ కాగా నేహళ్ వధిహేరా తొమ్మిది పరుగులు చేశాడు. మాక్సి మామ ఒక్క పరుగుకే.. పెవిలియన్ బాట పట్టాడు.