Rana Naidu’s Surveen Chawla.. బాబాయ్ – అబ్బాయ్ అయిన వెంకటేష్(Venkatesh ), రానా దగ్గుబాటి (Rana Daggubati) కాంబినేషన్లో వచ్చిన వెబ్ సిరీస్ రానా నాయుడు(Rana Naidu). కరణ్ అన్షుమాన్ , సుపర్ణ్ వర్మ కాంబినేషన్లో వచ్చిన యాక్షన్ క్రైమ్ డ్రామా టెలివిజన్ సిరీస్ ఇది. లోకోమోటివ్ గ్లోబల్ ఇంక్ బ్యానర్ పై సుందర్ ఆరోన్ ఈ వెబ్ సిరీస్ ని నిర్మించారు. 2013 అమెరికన్ క్రైమ్ డ్రామా టీవీ సీరీస్ రే డోనోవన్ కి అధికారిక రీమేక్ ఇది. వెంకటేష్, దగ్గుబాటి రానా, సుచిత్ర, గౌరవ్ చోప్రా, సుర్వీన్ చావ్లా తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ (Netflix) వేదికగా 2023 మార్చి 10న విడుదలయ్యింది. ఇకపోతే ఈ వెబ్ సిరీస్ భారీ విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఫ్యామిలీ హీరోగా పేరు సొంతం చేసుకున్న వెంకటేష్ ఇలా ఈ వెబ్ సిరీస్ లో బూతుల వర్షం కురిపించేసరికి ఫ్యాన్స్ కూడా ఆశ్చర్యపోయారు. ఇక త్వరలోనే సీజన్ 2 కూడా రాబోతోంది ఒక వారం క్రితం అఫీషియల్ టీజర్ కూడా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.
క్యాస్టింగ్ కౌచ్ పై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..
ఇకపోతే ఇలా ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన రెండవ సీజన్ త్వరలో రాబోతోంది అంటూ వార్తలు రాగా.. మరొకవైపు ఈ వెబ్ సిరీస్ లో నటించిన సుర్వీన్ చావ్లా ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. నిజానికి చిత్ర పరిశ్రమలో అవకాశం కోసం వచ్చే అమ్మాయిలను ట్రాప్ చేసి వారితో లైంగిక కోరికలు తీర్చుకునే వ్యవహారాలు ఈ మధ్య రోజుకీ పెరిగిపోతున్నాయి. ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లుగా ఉన్న నటీమణులు కూడా తాము ఒకప్పుడు ఇలా క్యాస్టింగ్ కౌచ్ బారిన పడ్డ వాళ్లమేనని పలు సందర్భాలలో వెల్లడించారు కూడా..ఇక ఇలా చాలామంది హీరోయిన్లు ఫిలిం ఇండస్ట్రీలో తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి చెప్పుకొస్తుండగా.. ఇప్పుడు ఆ జాబితాలోకి రానా నాయుడు వెబ్ సిరీస్ నటి ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ సుర్వీన్ చావ్లా (Surveen Chawla) కూడా చేరిపోయారు.
దక్షిణాది పరిశ్రమపై హీరోయిన్ ఆరోపణలు..
తాజాగా ది మేల్ ఫెమినిస్ట్ అనే పాడ్ కాస్ట్ లో పాల్గొన్న సుర్వీన్ చావ్లా.. చిత్ర పరిశ్రమలో తాను ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలు అలాగే తెర వెనుక భాగోతాలతో పాటు సౌత్ సినీ వాళ్లకు ఒక హీరోయిన్ లో ఎలాంటి క్వాలిటీస్ కావాలి అనే విషయాలను కూడా తెలిపింది. సుర్వీన్ చావ్లా మాట్లాడుతూ.. “ఒక జాతీయ అవార్డు పొందిన దక్షిణాది దర్శకుడు తనతో పడుకోవాలని ఉందనే కోరికను బయటపెట్టాడు. అయితే ఈ విషయాన్ని తన ఫ్రెండ్స్ ద్వారా నాకు వర్తమానం పంపించాడు. ఇక దక్షిణాదిలో బాడీ షేమింగ్ సంఘటనలు కూడా ఎదురయ్యాయి. ఇండస్ట్రీలో మహిళలను తక్కువగా చూస్తారు. దక్షిణాది పరిశ్రమలో హీరోయిన్ల బరువు, నడుము సైజు, ఛాతీ సైజు ఇలా ప్రతిదానిని తెలుసుకోవాలని అనుకుంటారు.. సౌత్లో సినిమా ఆడిషన్ కి వెళ్తే బరువు తక్కువగా ఉన్నావు.. బరువు పెరగాలి.. నీలో ఉండే ప్రతి పార్ట్ కూడా స్పష్టంగా కనిపించాలి అని చాలా అసభ్యంగా మాట్లాడారు. ఇక్కడ బాలీవుడ్ కి వస్తేనేమో బరువు తగ్గాలి.. పీలగా ఉండాలి అంటారు.. అలా బాడీ షేమింగ్ కూడా ఎన్నో ఎదుర్కొన్నాను” అంటూ తెలిపింది సుర్వించాల.
ALSO READ; Maheshbabu: ఖలేజా సినిమాలో దిలావర్ సింగ్ భార్య క్యారెక్టర్ చేసింది ఈవిడే… ఈమె బ్యాగ్రౌండ్ తెలుసా..
పెళ్లయిందని తెలిసిన ముద్దు పెట్టే ప్రయత్నం చేశాడు – సుర్వీన్ ఛావ్లా
అలాగే డైరెక్టర్ తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడు అంటూ మాట్లాడుతూ.. కెరియర్ తొలినాళ్ళలో ముంబైలోని వీరాదేశాయ్ మార్గ్ లోని ఒక దర్శకుడి కార్యాలయానికి తనను పిలిచారని ఆమె తెలిపింది. అయితే మాటల సందర్భంలో మీ వైవాహిక జీవితం ఎలా ఉంది ? మీ భర్త ఏం చేస్తారు? అంటూ పర్సనల్ విషయాలు కూడా అడిగారు. ఆ సమయంలో నేను, ఆ డైరెక్టర్ ఇద్దరం మాత్రమే ఉన్నాము. మీటింగ్ పూర్తయి నేను వెళ్తుండగా ఆయన నా వైపు తిరిగి ముఖంపై ముద్దు పెట్టడానికి ప్రయత్నించాడు. ఊహించని ఈ పరిణామంతో ఒక్కసారిగా నేను భయపడి పోయి, అతడిని వెనక్కి నెట్టేశాను. అయినప్పటికీ అతడు గేటు వరకు నన్ను అనుసరిస్తూ వచ్చాడు. నిజానికి అతడికి నాకు పెళ్లయిందని తెలుసు. అయినా సరే ఇలా చేయడం బాగాలేదు అంటూ తెలిపింది. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.