Bigg Boss 8 Telugu Latest Promo: బిగ్ బాస్ సీజన్ 8 ముగింపుకు చేరుకుంది. మరికొన్ని గంటల్లో ఫినాలే ఎపిసోడ్ కూడా ప్రసారం కానుంది. ఈ సీజన్‌లో టాప్ 5 కంటెస్టెంట్స్‌గా ప్రేరణ, నిఖిల్, నబీల్, అవినాష్, గౌతమ్ నిలిచారు. ఫినాలే ఎపిసోడ్‌కు ఇంకా కొన్ని గంటలే ఉంది కాబట్టి గొడవలు లాంటివి ఏమీ లేకుండా అందరూ సరదాగా కూర్చొని కబుర్లు చెప్పే అవకాశం కల్పించారు బిగ్ బాస్. అందులో తమ బెస్ట్, వరస్ట్ మెమోరీస్ గురించి చెప్పమని బిగ్ బాస్ అడిగారు. దీంతో అందరు కంటెస్టెంట్స్ తమ జీవితంలో జరిగిన బాధాకరమైన సంఘటనల గురించి గుర్తుచేసుకొని బాధపడ్డారు. ఎట్టకేలకు అవినాష్ కూడా తన బిడ్డ చనిపోయిన విషయాన్ని బయటపెట్టాడు. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలయ్యింది.
ఖాళీగా ఉన్నాను
‘‘ఇప్పుడు బిగ్ బాస్ ఇస్తున్న ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీ జీవితంలో జరిగిన బెస్ట్, వరస్ట్ మూమెంట్స్‌ను మీ తోటి సభ్యులతో పంచుకోండి’’ అని బిగ్ బాస్ చెప్పడంతో ఈ ప్రోమో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత నిఖిల్ తన వరస్ట్ మెమొరీని పంచుకున్నాడు. ‘‘రెండున్నర, మూడు సంవత్సరాలు ఇంట్లోనే ఉన్నాను. అమ్మ దగ్గరకు వెళ్లి రోజూ 20,30 రూపాయలు అడగడం, తను తిట్టడం ఇలా జరిగేది. నువ్వు ఇంటికి బరువుగా ఉన్నావు. నీకు తిండి పెట్టడం కాకుండా ఖర్చులకు డబ్బులు ఇవ్వాలా అనేవారు. నాకు సీరియల్స్ గురించి అప్పుడు పెద్దగా తెలియదు. రోజుకు రూ.2500 ఇస్తామని అన్నారు. నెలకు రూ.75,000 అనుకున్నాను. కట్ చేస్తే.. నెలలో పది రోజులే షూటింగ్. దానికంటే ఎక్స్‌ట్రా రాదు. అడ్వాన్స్‌లు ఉండవు’’ అని చెప్పుకొచ్చాడు నిఖిల్.
Also Read: ముగిసిన ఓటింగ్..నరాలు తెగే ఉత్కంఠ.. నిఖిల్, గౌతమ్ కి కూడా షాక్..!
ఆత్మహత్య చేసుకుందామనుకున్నా
‘‘జీవితంలో చిన్న చిన్న విషయాలకు కూడా నాకే ఎందుకిలా జరుగుతుంది అని అనిపిస్తుంది. నేను మా నాన్నమ్మను కోల్పోయాను. ఆవిడకు నేనంటే చాలా ఇష్టం. ఆమె ఒకే కొథను మళ్లీ మళ్లీ చెప్పేది. చెప్పావు కదా మళ్లీ మళ్లీ ఎందుకు చెప్తున్నావని చిరాకు పడేదాన్ని. ఆమె నాతో ఏదో ఒక మాట్లాడడానికి ట్రై చేసిందని నాకు ఇప్పుడు అనిపిస్తుంది’’ అని ప్రేరణ గుర్తుచేసుకొని ఏడ్చింది. ‘‘నేనెప్పుడూ జీవితంలో ఏదో ఒకటి సాధిస్తానని చెప్పేవాడిని. కట్ చేస్తే.. మెడిసిన్ చదువుతున్న రోజుల్లో బ్రేకప్ అయ్యింది. అప్పుడు ఢిల్లీలో 18వ ఫ్లోర్‌లో ఉండేవాడిని. ఇంట్లో ఎవరూ లేరని బాల్కనీకి వెళ్లి దూకేద్దామని అనిపించేసింది’’ అని బయటపెట్టాడు గౌతమ్.
కొడుకు చనిపోయాడు
అవినాష్ కూడా తన బిడ్డ చనిపోయిన విషయాన్ని బయటపెట్టాడు. ‘‘నేను, అను చాలా కలలు కన్నాం. అబ్బాయి పుడితే ఏ పేరు పెట్టాలి, అమ్మాయి పుడితే ఏ పేరు పెట్టాలి అనుకున్నాం. ఇప్పటికీ నేను ఈ విషయం చెప్పకపోతే ఇంకా నా పిల్లలు ఉన్నారేమో అనే అందరూ అనుకుంటారు. ఒకరోజు నా చేతిలో నా కొడుకు ఉన్నాడు. కానీ తనకు ప్రాణం లేదు. వాడి దగ్గరకు వెళ్లి గుండెలు మీద నొక్కుతున్నాను. ఏం చేసినా కష్టమని డాక్టర్స్ చెప్పేశారు. వాడు చాలా క్యూట్‌గా ఉన్నాడు. లావుగా, తెల్లగా ఉన్నాడు’’ అని చెప్తూ వెక్కివెక్కి ఏడ్చాడు అవినాష్.