Rashmika mandanna:రష్మిక మందన్న (Rashmika mandanna)తన నటనతో, అద్భుతమైన పర్ఫామెన్స్ తో నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకుంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే జీవితంలో సక్సెస్ సాధించడం కోసం తాను చేసిన త్యాగం గురించి చెప్పి అందరిని కంటతడి పెట్టించింది. మరి రష్మిక చేసిన ఆ కామెంట్స్ దేని గురించో ఇప్పుడు చూద్దాం
చావా సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు..
స్టార్ హీరోయిన్గా ఫుల్ బిజీగా మారిపోయిన రష్మిక మందన్న.. గత ఏడాది అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా, సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప 2’ సినిమాతో దేశవ్యాప్తంగా భారీ పాపులారిటీ అందుకుంది. ముఖ్యంగా సౌత్ లోనే కాకుండా హిందీలో కూడా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించిన ఈమె.. పుష్ప2తో ఒక్కసారిగా తన ఫేమ్ మొత్తం మారిపోయిందని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు రష్మిక.. లక్ష్మణ్ ఉదేకర్ దర్శకత్వంలో ‘చావా’ అనే హిందీ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాలో విక్కీ కౌశల్ (Vicky koushal) ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఛత్రపతి శివాజీ – సాయి బాయి దంపతుల పెద్ద కుమారుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం చుట్టూ ఈ సినిమా తిరుగుతుందని, ఇప్పటికే మేకర్స్ తెలియజేసిన విషయం తెలిసిందే. ఇందులో ఛత్రపతి శంభాజీ పాత్రలో విక్కీ కౌశల్ నటిస్తూ ఉండగా, ఆయన భార్య పాత్రలో నటి రష్మిక నటిస్తోంది. ఇందులో రష్మికకు సంబంధించి ఫస్ట్ లుక్ ని ఇటీవల మేకర్స్ విడుదల చేయగా అందులో రాజసం ఉట్టిపడేలా పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో మరింతగా మెరిసిపోయింది రష్మిక.
సినిమాల కోసం దానిని త్యాగం చేశాను..
ఇదిలా ఉండగా మరోవైపు రష్మిక జిమ్లో కసరత్తులు చేస్తూ ఉండగా.. కాలు బెణికి కొద్ది రోజులుగా బెడ్ కే పరిమితమైన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు చావా ట్రైలర్ లాంఛ్ కి వీల్ చైర్ లో వచ్చి అభిమానులను ఆశ్చర్యాన్ని గురిచేసింది. అంతేకాదు విక్కీ కౌశల్ సహాయంతో స్టేజ్ పైకి కుంటుకుంటూ వచ్చిన ఈమె సినిమాపై తనకున్న అభిరుచిని చాటుకుంది. ఇక ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె విజయం సాధించడానికి తన కుటుంబంతో గడిపే సమయాన్ని కూడా త్యాగం చేశానని తెలిపింది. రష్మిక మాట్లాడుతూ..”కుటుంబానికి సమయం ఇవ్వకుండా సినిమాలు చేస్తూ.. నన్ను నేను కాంప్రమైజ్ చేసుకుంటూ ముందుకు వెళ్లాను. కాబట్టి నేడు ఈ స్థాయిలో ఉన్నానంటూ చెప్పుకొచ్చింది.” అంతేకాదు సినిమాలలో పడి తన కుటుంబంతో కలిసి స్పెండ్ చేయడానికి టైం కూడా లేదు అంటూ మరొకవైపు ఎమోషనల్ అయింది రష్మిక. రష్మిక అంత కష్టపడింది కాబట్టి నేడు జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
రష్మిక మందన్న కెరియర్..
కన్నడలో తొలిసారి ‘కిరిక్ పార్టీ’అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె. ఈ సినిమాతో ఉత్తమ తొలినటిగా సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిలిం అవార్డు అందుకుంది. ఇక తెలుగులోకి ఛలో సినిమాతో వచ్చి ఆ తర్వాత గీతా గోవిందం, సరిలేరు నీకెవ్వరు వంటి సినిమాలతో భారీ పాపులారిటీ అందుకున్న ఈ ఇప్పుడు పుష్ప2, యానిమల్ సినిమాలతో మరింత పాపులారిటీ దక్కించుకుంది.