BigTV English

Noman Ali – Hat-trick: పాక్‌ స్పిన్నర్‌ నౌమాన్ అలీకి హ్యాట్రిక్.. చరిత్రలోనే తొలి ప్లేయర్ గా !

Noman Ali – Hat-trick: పాక్‌ స్పిన్నర్‌ నౌమాన్ అలీకి హ్యాట్రిక్.. చరిత్రలోనే తొలి ప్లేయర్ గా !

Noman Ali- Hat-trick: పాకిస్తాన్ క్రికెటర్ నౌమాన్ అలీ (Noman Ali ) సంచలన రికార్డు నమోదు చేసుకున్నాడు. తన అంతర్జాతీయ క్రికెట్ లో హైట్రిక్ వికెట్లు తీసుకున్నాడు నౌమాన్ అలీ. టెస్ట్‌ క్రికెట్‌ లోనే ఈ ఘనత సాధించాడు పాకిస్తాన్ క్రికెటర్ నౌమాన్ అలీ (Noman Ali ). ప్రస్తుతం పాకిస్తాన్ వర్సెస్ వెస్టిండీస్ మధ్య టెస్టు సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే సిరీస్ లో భాగంగా… రెండవ టెస్ట్ మ్యాచ్ లో వెస్టిండీస్ జట్టుపై తొలి హైట్రిక్‌ సాధించాడు పాకిస్తాన్ క్రికెటర్ నౌమాన్ అలీ (Noman Ali ).


Also Read: Kuldeep-RCB: మీ ముఖాలకు ఎప్పుడైనా కప్పు గెలిచార్రా.. RCB ఇజ్జత్‌ తీసిన కుల్దీప్‌..!

దీంతో… పాకిస్తాన్ క్రికెటర్, స్పిన్నర్‌ నౌమాన్ అలీ (Noman Ali Hat-trick ) అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. స్పిన్‌ విభాగంలో టెస్టుల్లో.. ఇలా హైట్రిక్‌ తీసిన ప్లేయర్‌ గా రికార్డుల్లోకి ఎక్కాడు. శనివారం రోజున ముల్తాన్‌లో ఈ చరిత్ర సృష్టించాడు నోమన్ అలీ. దీంతో టెస్ట్ క్రికెట్‌లో హ్యాట్రిక్ సాధించిన మొదటి పాకిస్తానీ స్పిన్నర్‌గా నిలిచాడు. 38 ఏళ్ల నోమన్ అలీ….చివరి టెస్టు మొదటి రోజు వెస్టిండీస్ బ్యాటింగ్ విభాగానికి చుక్కలు చూపించాడు. ఈ దెబ్బకు మొదటి సెషన్‌లో వెస్టిండీస్ 8 వికెట్ల నష్టానికి 68 పరుగుల వద్ద కొట్టుమిట్టాడుతోంది. ఇందులో నోమన్ అలీ.. హ్యాట్రిక్ తో సహా మొత్తం నాలుగు వికెట్లు సాధించాడు.


Also Read:  Indian Cricketers Salary: రంజీ మ్యాచ్‌ లు ఆడితే.. టీమిండియా ప్లేయర్లకు ఎంత జీతం వస్తుంది?

నౌమాన్ అలీ హైట్రిక్‌ వికెట్లు

నౌమాన్ అలీ ( Noman Ali ) తన 12వ ఓవర్ లో తొలి హైట్రిక్‌ సాధించాడు. అలీ జస్టిన్ గ్రీవ్స్, టెవిన్ ఇమ్లాచ్ అలాగే కెవ్నీ సింక్లైర్‌లను అవుట్ చేసి హ్యాట్రిక్ పూర్తి చేసుకున్నాడు నౌమాన్ అలీ ( Noman Ali ). సింక్లెయిర్ బ్యాటింగ్‌ చేస్తుండగా…అతను ఇచ్చిన ఎడ్జ్ క్యాచ్‌ని బాబర్ అజామ్ గల్లీ వద్ద క్యాచ్ తీసుకున్నాడు. దీంతో నోమాన్ తన హ్యాట్రిక్ పూర్తి చేసుకున్నాడు. అయితే..నౌమాన్ అలీ ( Noman Ali ) వికెట్లు తీసిన ముగ్గురు ప్లేయర్లలో ఇద్దరు డకౌట్‌ అయ్యారు. అలీ జస్టిన్ గ్రీవ్స్ 1 పరుగు చేసి..నౌమాన్ అలీ ( Noman Ali ) బౌలింగ్‌ లో బాబర్‌ అజామ్‌ కు క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు. టెవిన్ ఇమ్లాచ్ ( Tevin Imlach ) నౌమాన్ అలీ ( Noman Ali Hat-trick ) బౌలింగ్‌ లో వికెట్ల ముందు దొరికిపోయాడు. చివరకు సింక్లెయిర్ కూడా నౌమాన్ అలీ ( Noman Ali ) బౌలింగ్‌ లో బాబర్‌ అజామ్‌ కు క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు.

టెస్ట్ క్రికెట్‌లో పాకిస్థాన్‌ తరఫున హైట్రిక్‌ సాధించిన ప్లేయర్లు

  • వసీం అక్రమ్ – 1999లో లాహోర్‌లో పాకిస్థాన్ vs శ్రీలంక
  • వసీం అక్రమ్ – 1999లో ఢాకాలో పాకిస్థాన్ vs శ్రీలంక
  • 2000లో గాలేలో అబ్దుల్ రజాక్ – పాకిస్థాన్ vs శ్రీలంక
  • మహ్మద్ సమీ – 2002లో లాహోర్‌లో పాకిస్థాన్ vs శ్రీలంక
  • 2020లో రావల్పిండిలో నసీమ్ షా – పాకిస్థాన్ vs బంగ్లాదేశ్
  • నోమన్ అలీ – 2025లో ముల్తాన్‌లో పాకిస్థాన్ vs వెస్టిండీస్

Related News

Haris Rauf: రఫేల్ కూల్చేశామంటూ హ‌రీస్ ర‌ఫ్ సెలబ్రేషన్..ఆడుకున్న ఫ్యాన్స్‌

Ind Vs Pak: చ‌ల్ పోరా పో….షాహిన్ అఫ్రీదిని బండ బూతులు తిట్టిన అభిషేక్‌…సిక్స్ కొట్టి మ‌రీ

IND VS PAK: అభిషేక్‌ దుమ్ములేపాడు… సూప‌ర్ 4 లోనూ టీమిండియా విజ‌యం.. షేక్ హ్యాండ్ మళ్ళీ లేదు

IND Vs PAK : Ak 47 గ‌న్స్ పేల్చుతూ పాకిస్థాన్ సెల‌బ్రేష‌న్స్‌.. టీమిండియా టార్గెట్ ఎంతంటే

Rohith Sharma : టీమిండియా కోచ్ గా రోహిత్ శర్మ… త్వరలోనే రిటైర్మెంట్?

IND Vs PAK : సీన్ రిపీట్… పాకిస్తాన్ పరువు తీసిన సూర్య కుమార్ యాదవ్

Asia Cup 2025 : బంగ్లా, శ్రీలంక మ్యాచ్ లో నాగిని డ్యాన్స్‌.. వీడియో చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే

IND Vs PAK : ఆసియా కప్ లో కలకలం… టీమిండియా ప్లేయర్లు అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్!

Big Stories

×