RCB VS PBKS Qualifier 1: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ చివరి దశకు వచ్చింది. ఇవాళ క్వాలిఫైయర్ వన్ మ్యాచ్ జరగబోతోంది. క్వాలిఫైడ్ వన్ మ్యాచ్ లో భాగంగా పంజాబ్ కిమ్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడబోతున్నాయి. ఎప్పటిలాగే రాత్రి ఏడున్నర గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్… మూళ్లాన్పూర్ చండీగర్ వేదికగా జరగనుంది. ఇప్పటికే ఈ మ్యాచ్ కు సంబంధించిన ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయి.
ALSO READ: IPL 2025: ఏ జట్ల మధ్య క్వాలిఫైయర్, ఎలిమినేటర్… టైమింగ్స్, ఉచితంగా చూసే ఛాన్స్
వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే ఎలా?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా మొదటి క్వాలిఫైయర్ లో పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ కు వర్షం అద్దంకిగా మారడం లేదా ఇతర కారణాలవల్ల మ్యాచులు రద్దు కావడం జరిగితే పరిస్థితి ఏంటి అని ఇప్పుడు చర్చ జరుగుతోంది. రిజర్వ్ డే లేకపోవడంతో… కచ్చితంగా ఎవరో ఒకరిని విన్నర్ గా ప్రకటించాల్సి ఉంటుంది. పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో పంజాబ్ కింగ్స్ ఉన్న నేపథ్యంలో.. నేరుగా విజేతగా పంజాబ్ కింగ్స్ ను ప్రకటిస్తారని సమాచారం. అంటే అప్పుడు పంజాబ్ కింగ్స్ ఫైనల్ కి వెళ్తుంది.
వర్షం పడితే బెంగళూరు పరిస్థితి ఏంటి?
వర్షం పడి మ్యాచ్ ఆగిపోతే పంజాబ్ కింగ్స్ నేరుగా ఫైనల్ కి వెళుతుంది. ఇక మిగిలిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు… క్వాలిఫైయర్ 2 మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. ఎలిమినేటర్ లో గెలిచిన జట్టుతో.. (అంటే అందులో ముంబై లేదా గుజరాత్ ఉండవచ్చు ) రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆడుతుంది. అప్పుడు గెలిచినట్టు నేరుగా ఫైనల్ గా వెళ్తుంది.
పంజాబ్ కింగ్స్ వర్సెస్ బెంగళూరు మధ్య బలాబలాలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లో క్వాలిఫైయర్ వన్ లో తలపడేబోయే పంజాబీన్స్ అలాగే బెంగళూరు మధ్య బలాబలాలు చూస్తే… శ్రేయస్ అయ్యర్ జట్టు బలంగా కనిపిస్తోంది. బెంగళూరులో ఎవరో ఒక ప్లేయర్ ఆడడం… మిగతా ప్లేయర్లు చేతులు ఎత్తేయడం జరుగుతుంది. కానీ పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు అద్భుతంగా రాణిస్తారు. అందుకే పంజాబ్ కింగ్స్ జట్టుకు ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది. అందులోనూ వాళ్లకు హోమ్ టీం కావడం గమనార్హం.
పంజాబ్ కింగ్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, క్వాలిఫైయర్ 1 టీమ్స్ అంచనా
PBKS అంచనా XI: శ్రేయాస్ అయ్యర్ ( C), ప్రభ్‌సిమ్రాన్ సింగ్, ప్రియాంష్ ఆర్య, అర్ష్‌దీప్ సింగ్, జోష్ ఇంగ్లిస్, నెహాల్ వధేరా, మార్కో జాన్సెన్, హర్‌ప్రీత్ బ్రార్, వైషాక్ విజయ్ కుమార్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కస్ స్టోయినిస్.
RCB అంచనా వేసిన XI: జితేష్ శర్మ ( C), ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ అగర్వాల్, కృనాల్ పాండ్యా, సుయాష్ శర్మ, లియామ్ లివింగ్‌స్టోన్, రజత్ పాటిదార్.