BigTV English
Advertisement

EAGLE: రెండు ఓటీటీలలో రవితేజ ‘ఈగల్’.. అఫీషియల్ డేట్ వచ్చేసింది..

EAGLE: రెండు ఓటీటీలలో రవితేజ ‘ఈగల్’.. అఫీషియల్ డేట్ వచ్చేసింది..


EAGLE OTT: మస్ మహారాజా రవితేజకు మంచి హిట్టు పడి చాలాకాలమే అయింది. ఇందులో భాగంగా వరుస పెట్టి సినిమాలు చేస్తున్నా.. బాక్సాఫీసు వద్ద పెద్దగా తన హవా చూపించలేకపోతున్నాడు. గతేడాది ఒకటి రెండు సినిమాలతో ప్రేక్షకులను పలకరించినా.. ఆశించినంత హిట్టు అయితే కొట్టలేకపోయాడు. ముఖ్యంగా రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ మూవీపై ఎక్కువగా ఆశలు పెట్టుకున్నాడు.

కానీ ఆ ఆశలన్నీ నీరుగారిపోయాయి. ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకాభిమానులను ఆకట్టుకోవడంలో విఫలం అయింది. దీంతో మాస్ మహారాజా తన తదుపరి సినిమాలపై ఫుల్ ఫోకస్ పెట్టాడు. ఇందులో భాగంగా మరో డైరెక్టర్‌తో సినిమా తీశాడు.


కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ‘ఈగల్’ మూవీ చేశాడు. ఈ మూవీ రిలీజ్ కోసం చిత్రబృందం ఎన్నో సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది. షూటింగ్ అంతా కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు.

READ MORE: ఓటీటీలోకి ఒకేరోజు హనుమాన్, ఈగల్.. స్ట్రీమింగ్ డేట్ ఖరారు..!

రిలీజ్ డేట్‌ను కూడా అనౌన్స్ చేశారు. అయితే సంక్రాంతి బరిలో మరికొన్ని చిత్రాలు ఉండటంతో ‘ఈగల్’ మూవీకి థియేటర్లు కరువయ్యాయి. దీంతో చేసేదేమి లేక మూవీ యూనిట్ ఈ మూవీని వాయిదా వేసింది. సోలో రిలీజ్ కోసం వెయిట్ చేసింది. చివరికి ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇక ఎన్నో అంచనాల నడుమ రిలీజైన ఈ సినిమా ఫస్ట్ షో నుంచే పర్వాలేదనిపించుకుంది. ఈ సినిమా భారీ హిట్ అవుతుందని భావించిన రవితేజ అండ్ టీం, అభిమానులకు నిరాశే మిగిలింది. ఇక బాక్సాఫీసు వద్ద మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న ఈగల్ మూవీ కలెక్షన్లలో మాత్రం పర్వాలేదనిపించుకుంది.

ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదలై దాదాపు రూ.50 కోట్లకు పైగానే వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. ఇక థియేటర్ రన్ అనంతరం ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్‌ కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికొక గుడ్ న్యూస్ బయటకొచ్చింది.

READ MORE: ఈగల్ ఫస్ట్ డే కలెక్షన్స్.. అదిరిపోయిన మాస్ ఓపెనింగ్స్

ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ తాజాగా వెల్లడైంది. ప్రముఖ ఓటీటీ సంస్థలు అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, ఆహాతో పోటీ పడి మరీ ఈ మూవీ డిజిటల్, శాటిలైట్ రైట్స్‌ను ఈటీవీ, ఈటీవీ విన్ దక్కించుకున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి.

కాగా ఇప్పుడు ఈ మూవీ అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్ ఖరారు అయింది. ఇప్పుడు ఈ మూవీ ఈటీవీ విన్‌తో పాటుగా అమెజాన్ ప్రైమ్ వీడియోలోనూ స్ట్రీమింగ్ రానున్నట్లు తాజాగా వెల్లడైంది. వచ్చే నెల మార్చి 1 నుంచి అంటే రేపటి నుంచి ఈ మూవీ ఈ రెండు ఓటీటీ ప్లాట్ ఫార్మ్‌లలోనూ స్ట్రీమింగ్ అవనున్నట్లు అధికారికంగా ప్రకటించాయి.

దీంతో ఈ మూవీ మరో 24 గంటల్లో ఒకేసారి రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్నాయి. కాగా పీపుల్స్ మీడియా బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్, కావ్యా థాపర్ హీరోయిన్లుగా నటించారు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×