BigTV English

Entertainment:రేణూ దేశాయ్ అంత ఎమోషన్ ఎందుకయ్యారు?

Entertainment:రేణూ దేశాయ్ అంత ఎమోషన్ ఎందుకయ్యారు?

Renu desai emotional post about her children


పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ చాలా ఎమోషనల్. ఆమె ఏదీ కడుపులో దాచుకోదు. ఏ విషయాన్నయినా బయటకు చెప్పేస్తుంటారు. తనకి బాధ వచ్చినా..సంతోషం వచ్చినా వెంటనే స్పందించేస్తుంటారు. పవన్ కళ్యాణ్ కు దూరంగా ఉంటున్నా కొందరు అభిమానులు పనిగట్టుకుని రేణూ దేశాయ్ ని వ్యక్తిగత విమర్శలతో బాధిస్తుంటారు. అయినా అవన్నీ భరిస్తూ తన పని తాను చేసుకుంటూ వెళుతోంది. తెలుగులో చేసిన రెండు సినిమాలూ పవన్ తోనే కావడం విశేషం. భద్రి, జానీ సినిమాల తర్వాత పవన్ తో జీవితం పంచుకుని సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టారు. ఆ తర్వాత కుమారుడు, కుమార్తె సంరక్షణ చూసుకుంటూ తల్లిగా తన బాధ్యతలు నెరవేరుస్తున్నారు. ఎవరైనా తనని తక్కువ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తే వెంటనే వారికి తనదైన శైలిలో సమాధానం చెబుతుంటుంది.

వివాహ బంధానికి దూరమైనా..


వివాహ అనుబంధానికి దూరంగా జీవనం సాగిస్తున్న రేణూ దేశాయ్ నిరంతరం తన చుట్టూ ఉండే మూగ జీవాలను ప్రేమించడం ద్వారా తన బాధలను మర్చిపోయేందుకు ప్రయత్నిస్తుంటారు. తన పిల్లల మీద కూడా అమిత వాత్సల్యం చూపిస్తుంటారు. పవన్ కళ్యాణ్ ను ఏనాడూ వ్యక్తిగతంగా దూషించలేదు. తన పిల్లలకు కూడా తండ్రి పట్ల ఎంత గౌరవంగా ఉండాలో క్రమశిక్షణతో నేర్పించారు. భార్యకు దూరంగా ఉన్నా పిల్లలకు మాత్రం పవన్ కళ్యాణ్ సన్నిహితంగానే ఉంటారు.

రేణూ భావోద్వేగం

రేణూ దేశాయ్ తన కుమార్తె ఆద్య గురించి..ఆమె తనని ఎంతగా ఆరోధిస్తోందో తెలియజేసింది.ఆద్య తన తల్లి మీద ఉన్న ప్రేమను కవిత్వం రూపంలో రాసి ఆమెకు షేర్ చేసింది. దానితో రేణూదేశాయ్ ఆనందంతో కూడిన భావోద్వేగానికి గురయ్యారు. తనను ఇవాళ తన కుమార్తె ఓ కవిత్వం కింద మార్చేశారు. వాళ్లకున్న ఆరాధ్య భావాన్నంతా ఆ కవిత్వంలో తెలిపారు. నిజానికి నా అంత అదృష్టవంతులు ఎవరూ లేరు. ఆ దేవుడు నాకు ఇలాంటి సంతానం ప్రసాదించినందుకు. కిందటి జన్మలో నేను ఏదో పుణ్యం చేసుకుని ఉంటాను. ఆ పుణ్య ఫలితంగానే నాకు అకీరా, ఆద్య లభించారు అంటూ సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు రేణు దేశాయ్. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ గా మారింది.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×