Renu Desai : పవన్ కళ్యాణ్ మాజీ వైఫ్ రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన బద్రి సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చారు రేణు దేశాయ్. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో స్నేహం కాస్త ప్రేమగా మారి ఇద్దరు కలిసి ఏడు అడుగులు వేశారు. వీరిద్దరికీ అకీరా, ఆధ్యా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. రేణు దేశాయ్ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని సినిమాల్లో కూడా ఆమె ఇన్వాల్వ్మెంట్ ఉండేది. రేణు దేశాయ్ ఒక సినిమాకు దర్శకత్వం కూడా చేశారు.పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా కాస్ట్యూమ్స్ కూడా రేణు దేశాయ్ డీల్ చేశారు. జానీ సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు.
తల్లిదండ్రులు లక్షణాలు కొన్ని పిల్లలకు వస్తాయని చెబుతూ ఉంటారు. తన కుమారుడు అకీరా కు మంచి టాలెంట్ వచ్చింది. అకిరా నందన్ కు ఉన్నది మామూలు టాలెంట్ కాదు. మార్షల్ ఆర్ట్స్, మ్యూజిక్, ఎడిటింగ్ వీటన్నిటి పైన విపరీతమైన నాలెడ్జ్ అఖీరాకు ఉంది. పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ కి సంబంధించిన అన్ని విషయాలను ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేస్తూ ఉంటుంది రేణు దేశాయ్. ఆ కంటెంట్ అంతా చూసి పవన్ కళ్యాణ్ అభిమానులు అకిరా ఎప్పుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తాడా అంటూ ఎదురుచూస్తూ ఉన్నారు. అలానే అకీరా గురించి చాలా కథనాలు సోషల్ మీడియాలో వార్తల్లో వినిపిస్తూనే ఉంటాయి. ఒజీ సినిమాలో కూడా అకిరా ఇన్వాల్వ్మెంట్ ఉంది అని వార్తలు వచ్చాయి. తమన్ కూడా ఒక ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని చెబుతూ వచ్చాడు. అలానే అకిరాను రామ్ చరణ్ హీరోగా పరిచయం చేయబోతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. వీటన్నిటి పైన స్పందించారు రేణు దేశాయ్.
Also Read : Harsha Vardhan: వర్మనే డామినేట్ చేస్తున్న హర్ష.. కాస్త ఆలోచించు గురూ..!
అఖీరా ఎంట్రీపై క్లారిటీ
అఖీరాకు ఒకవేళ సినిమాల్లో నటించే ఇంట్రెస్ట్ ఉంటే నేనే ఇంస్టాగ్రామ్ వేదికగా చెబుతాను. అకీర గురించి చాలా వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి. కానీ ఆ వార్తలు ఏవి నిజం కాదు, ఓజీ సినిమాలో కూడా అఖీరా ఉన్న వార్తలను ఖండించారు. రామ్ చరణ్ తనను హీరోగా పరిచయం చేస్తున్న వార్తను కూడా రేణు దేశాయ్ స్పందించారు. ఇక అకీర విషయానికి వస్తే రీసెంట్ టైమ్స్ లో ఎక్కువగా తన తండ్రితో పాటు కనిపించడం అనేది పవన్ కళ్యాణ్ అభిమానులకు ఆనందాన్ని ఇచ్చే విషయం. అలానే చాలా రీ రిలీజ్ సినిమాలు కూడా అఖీరా దర్శనమిస్తూ ఉంటారు. ఇదేమైనా అఖీరా ఎంట్రీ కోసం మాత్రం ప్రేక్షకులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు అనడంలో సందేహం లేదు. ఇక దీని గురించి రేణు దేశాయ్ చెప్పడం మాత్రమే మిగిలింది.
Also Read : Ss Rajamouli: ఆ సినిమా చూసిన తర్వాత నేను రాస్తున్న పుస్తకం చింపేశాను