Roja Daughter: సీనియర్ హీరో, హీరోయిన్ల వారసులు చాలామంది తమ తల్లిదండ్రులలాగానే సినీ పరిశ్రమలో అడుగుపెట్టాలని నటీనటులుగా మారాలని కలలు కంటుంటారు. చాలా తక్కువమంది మాత్రమే వేర్వేరు రంగాల్లో కూడా అడుగుపెట్టి తమ టాలెంట్ ఏంటో నిరూపించుకోవాలని అనుకుంటారు. తెలుగు, తమిళంలో ఒకప్పటి స్టార్ హీరోలు అందరితో జోడీకట్టిన రోజా వారసురాలు కూడా మొదట్లో అలాగే అనుకుంటుందని చాలామంది అభిప్రాయపడ్డారు. కానీ తాజాగా మొదటిసారి స్టేజ్ ఎక్కి ర్యాంప్ ఆడించింది రోజా కుమార్తె అన్షు మాలిక. తాజాగా జరిగిన ఒక ఫ్యాషన్ షోలో అన్షు ర్యాంప్ వాక్ చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ర్యాంప్ ఆడించింది
చిరంజీవి నుండి బాలకృష్ణ వరకు దాదాపు అందరు స్టార్ హీరోలతో జోడీకట్టారు రోజా (Roja). తన యాక్టింగ్‌తో ఎంతోమంది ఫ్యాన్స్‌ను కూడా సొంతం చేసుకున్నారు. హీరోయిన్‌గా అవకాశాలు తగ్గిపోయిన తర్వాత తల్లి పాత్రలు చేయడానికి కూడా ఎప్పుడూ వెనకాడలేదు. ఆ తర్వాత బుల్లితెరపై కూడా చాలాకాలం పాటు ప్రేక్షకులను అలరించారు. తను బుల్లితెర షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్నప్పుడే తన కుమార్తె అన్షు మాలిక్‌ను ప్రేక్షకులకు పరిచయం చేశారు. రోజా పాల్గొన్న ఎన్నో స్పెషల్ షోలలో అన్షు కూడా గెస్ట్‌గా వచ్చింది. అలా అన్షు గురించి చాలామంది ఆడియన్స్‌కు తెలిసింది. ఆ పాపులారిటీతోనే ఏకంగా ఫ్యాషన్ షోలో ర్యాంప్ వాక్ చేసేవరకు ఎదిగింది.
రైటర్ కూడా
కొన్నాళ్ల క్రితం రోజా కుమార్తె అన్షు మాలిక్ గురించి వార్తలు వైరల్ అయ్యాయి. అన్షు ‘ది ఫ్లేమ్ ఇన్ మై హార్ట్’ అనే నవల రాసింది. ఆ నవలతో బెస్ట్ ఆథర్ ఇన్ సౌత్ ఇండియా అవార్డ్ కూడా దక్కించుకుంది. దీంతో అన్షులో ఇంత టాలెంట్ ఉందనే విషయం మొదటిసారి ప్రేక్షకులకు తెలిసింది. రోజా కూడా తన కూతురి గురించి గర్వపడుతూ సోషల్ మీడియాలో ఈ విషయాన్ని షేర్ చేసుకున్నారు. హీరోయిన్ వారసురాలు కాబట్టి తాను కూడా హీరోయిన్ అవుతుంది అనుకున్నారంతా. కానీ అలా కాకుండా రైటర్‌గా మారి, చిన్న వయసులోనే ఒక బుక్ రాసి, అంతే కాకుండా ఆ బుక్‌తో అవార్డ్ అందుకోవడం మామూలు విషయం కాదని అన్షును ప్రశంసలతో ముంచేశారు ప్రేక్షకులు.
Also Read: ఆ గాయాన్ని మళ్లీ గెలుకుతున్నారు.. సమంతతో విడాకులపై చైతన్య ఫస్ట్ టైం రియాక్షన్
మల్టీ టాలెంటెడ్
రచయిత్రిగా బుక్ రాయడం మాత్రమే కాకుండా బిజినెస్‌లో కూడా చిన్న వయసులోనే అడుగుపెట్టి అందులో కూడా తన సత్తా చాటుకుంది అన్షు మాలిక (Anshu Malika). కొన్నిరోజుల క్రితం నైజీరియాలోని లాగోస్‌లో గ్లోబల్ ఎంటర్ప్రీన్యూయర్‌షిప్ ఫెస్టివల్ జరిగింది. అందులో కూడా అన్షు పాల్గొంది. అంతే కాకుండా ఆ ఫెస్టివల్‌లో నామినేట్ అయ్యి అవార్డ్ కూడా దక్కించుకుంది. సోషల్ ఇంపాక్ట్ కేటగిరిలో గ్లోబల్ ఎంటర్ప్రీన్యూయర్‌షిప్ అవార్డ్ దక్కించుకుంది అన్షు. ఈ విషయాన్ని కూడా చాలా సంతోషంగా ప్రేక్షకులతో పంచుకున్నారు రోజా. అలా అన్షు మాలిక్ మల్టీ టాలెంటెడ్ అని ఎన్నోసార్లు నిరూపించుకున్నా తాజాగా చేసిన ర్యాంప్ వాక్‌తో మరోసారి అదే విషయం ప్రూవ్ అయ్యింది.