BigTV English

RAPO 22 Story : ‘మీలో ఒకడు సాగర్’ ఓ సినిమా పిచ్చోడు… మూవీ పూర్తి కథ ఇదే..?

RAPO 22 Story : ‘మీలో ఒకడు సాగర్’ ఓ సినిమా పిచ్చోడు… మూవీ పూర్తి కథ ఇదే..?

RAPO 22 Story : రామ్ పోతినేనికి సరైన హిట్ లేక దాదాపు 6 ఏళ్లు అవుతుంది. పూరి జగన్నాథ్‌తో రామ్ 2019లో ఇస్మార్ట్ శంకర్ అనే మూవీ చేశాడు. దీని తర్వాత రామ్ నాలుగు సినిమాలు చేశాడు. పూరితో ఇస్మార్ట్ శంకర్‌కు సీక్వెల్ డబుల్ ఇస్మార్ట్ అని కూడా తీశాడు. అయినా… హిట్ మాత్రం దొరకలేదు. ఇప్పుడు హిట్టే లక్ష్యంగా ఓ మూవీ చేస్తున్నాడు. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టితో మంచి హిట్ కొట్టిన పి. మహేష్ బాబు దర్శకత్వంలో RAPO 22 అనే వర్కింగ్ టైటిల్‌తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి పూర్తి కథ ఇదే అంటూ ఒకటి వైరల్ అవుతుంది. అదేంటో ఇప్పుడు చూద్ధాం…


రామ్ పోతినేని… బ్యాక్ టూ బ్యాక్ 4 డిజాస్టర్లు అందుకున్న హీరో. ఇప్పుడు ఓ సాలిడ్ హిట్ కోసం కోసం చూస్తున్నాడు. ఈ క్రమంలో ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా వల్ల హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న పి. మహేష్ బాబు దర్శకత్వంలో రామ్ పోతినేని ఓ మూవీ చేస్తున్నాడు. RAPO 22 అనే వర్కింగ్ టైటిల్‌తో వస్తున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. అలాగే దీనిలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. ఇటీవల ‘మీలో ఒకడు సాగర్’ అంటూ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఈ మూవీ నుంచి బయటికి వచ్చింది.

మూవీ కథ ఇదే…


వస్తున్న సమాచారం ప్రకారం ఈ మూవీలో హీరో… సాగర్ అనే పాత్రలో నటిస్తున్నాడట. ఈ సాగర్ సినిమా పిచ్చోడట. అంతే కాదు… ఓ సూపర్ స్టార్‌కు వీరాభిమానట. ఆ హీరో అంటే రామ్ పాత్రకు చాలా ఇష్టమట. ఆ సూపర్ స్టార్ కోసం, ఆయన నటించిన సినిమా కోసం రామ్ పోతినేని పాత్ర ఓ థియేటర్‌ను నిర్మిస్తాడట. ఆ థియేటర్ చుట్టునే మూవీ ఉంటుందని సమాచారం.

సూపర్ స్టార్ పాత్ర కోసం మలయాళ నటుడు..?

సినిమాలో కథనాయకుడు అభిమానించే సూపర్ స్టార్ పాత్ర కోసం మాలయాళ నటుడు మోహన్ లాల్ ను మూవీ యూనిట్ సంప్రదించిందట. అయితే, దీనిపై మోహన్ లాల్ సైలెన్స్‌గా ఉండటంతో మేకర్స్ మరో నటుడి కోసం సెర్చ్ చేస్తున్నట్టు సమాచారం. ఆ పాత్ర కోసం తెలుగు నటుడు కాకుండా.. ఇతర భాషా నటుడు అయితే బెటర్ అని డైరెక్టర్, హీరో అనుకుంటున్నారట.

హిట్ కావాల్సిందే…

రామ్ పోతినేని 6 ఏళ్ల క్రితం హిట్ కొట్టాడు. పూరి జగన్నాథ్ తో ఇస్మార్ట్ శంకర్ మూవీ వల్ల ఆ హిట్ వచ్చింది. దీని తర్వాత రామ్ ఎంత ప్రయత్నించినా… హిటే లేదు. గతేడాది వచ్చిన డబుల్ ఇస్మార్ట్‌ బ్రేక్ ఇస్తుందని అనుకున్నారు. దాదాపు 90 కోట్ల బడ్జెట్‌తో నిర్మించడం, పూరి జగన్నాథ్ డైరెక్టర్ అవ్వడం, 6 ఏళ్ల క్రితం బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఇస్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్‌గా రావడం.. ఇవి సినిమాకు ప్లస్ పాయింట్స్. అయినా..  ఈ డబుల్ ఇస్మార్ట్ మూవీ కేవలం 18 కోట్లు మాత్రమే వసూళ్లు చేసి రామ్ పోతినేనికి వరుసగా నాలుగో డిజాస్టర్‌ను మిగిలించింది.

ఇప్పుడు రామ్ పోతినేనికి హిట్ చాలా అవసరం. అయితే ఇప్పుడు RAPO 22 మూవీ ఇదే అని తెలుస్తుంది. ఇది నిజమే అయితే… రామ్ కు మరో డిజాస్టర్ ఖాయమని అంటున్నారు. కథనం గ్రిప్పింగ్‌గా ఉంటే తప్పా… ఈ కథతో నెట్టుకురావడం కష్టమే అని కామెంట్స్ వస్తున్నాయి.

Related News

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

SivaJyothi: గుడ్ న్యూస్ చెప్పబోతున్న శివ జ్యోతి… బుల్లి సావిత్రి రాబోతోందా?

Movie Industry : ఇండస్ట్రీలో ఇవి మారాల్సిందే… లేకపోతే దుకాణం క్లోజ్ ?

Big Stories

×