Saif Ali Khan.. బాలీవుడ్ లో ఉన్న ప్రముఖ హీరోలలో ఒకరిగా పేరు తెచ్చకున్న సైఫ్ అలీఖాన్(Saif Alikhan) పై జరిగిన కత్తి దాడి ఈ మధ్యకాలంలో ఎంత పెద్ద సెన్సేషన్ అయిందో చెప్పనక్కర్లేదు. ఈ కత్తి దాడికి సంబంధించిన వార్తలు ఇప్పటికీ మీడియాలో వైరల్ గా మారుతూనే ఉన్నాయి. అయితే ఇప్పటికే సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన వ్యక్తిని మొదట పట్టుకున్నారు పోలీసులు.కానీ ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ కాలేదని వదిలేసినట్టు వార్తలు వినిపించాయి. ఆ తర్వాత మళ్లీ సైఫ్ పై దాడి జరిగిన సమయంలో ప్రత్యక్షంగా చూసిన సాక్షులకు ఆ వ్యక్తిని చూపెట్టగా మహమ్మద్ షరీఫుల్ అనే వ్యక్తి సైఫ్ పై దాడి చేసినట్లు పోలీసులు గుర్తించి బంగ్లాదేశ్ వాసి అయిన అతడిని అదుపులోకి తీసుకున్నారు.
ఇక సైఫ్ అలీ ఖాన్ కేసులో పోలీసులు ఒక కీలక పురోగతి సాధించినట్టే.ఈ విషయం పక్కన పెడితే సైఫ్ అలీ ఖాన్ (Saif Alikhan)పై కత్తి దాడి జరిగిన సమయంలో ఆయన కొడుకు తైమూర్(Taimur) ఆయన్ని లీలావతి హాస్పిటల్ కి ఆటోలో తీసుకెళ్లినట్టు ఆ మధ్య కాలంలో వార్తలు వినిపించిన సంగతి మనకు తెలిసిందే. అయితే తైమూర్ చిన్న పిల్లవాడే.. అలాంటి వ్యక్తి తన తండ్రిని చావు బతుకుల నుండి ఎలా కాపాడారని చాలామంది ఆశ్చర్యపోయారు.కానీ ఆ తర్వాత తైమూర్, సైఫ్ అలీఖాన్ లతో పాటు సైఫ్ మొదటి భార్య కొడుకు ఇబ్రహీం (Ibrahim) కూడా ఉన్నారని ఆయనే వీరిని హాస్పిటల్ కి తీసుకెళ్లారని తెలిసింది.
నా కొడుకు నాన్న నువ్వు చనిపోతావా అన్నాడు.. సైఫ్
అయితే సైఫ్ అలీ ఖాన్ పై ఇంట్లో కత్తి దాడి జరిగిన సమయంలో తన కొడుకు తైమూర్ మాట్లాడిన ఎమోషనల్ మాటల్ని గుర్తు చేసుకున్నాడు సైఫ్ అలీఖాన్. సైఫ్ అలీఖాన్ కత్తి దాడి జరిగిన తర్వాత మొదటిసారి ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “మా ఇంట్లో నాపై కత్తి దాడి జరిగిన సమయంలో చిన్న దెబ్బలే అని నేను అనుకున్నాను. కానీ ఆ తర్వాత నా వీపు భాగంలో తీవ్రమైన నొప్పి రావడంతో కత్తిపోటుకు గురయ్యానని అర్థమయింది. ఈ విషయం తెలిసి కరీనా నేను కంగారుపడి ఒకరి ముఖాలు ఒకరం చూసుకున్నాం.ఆ టైంలో కరీనాకపూర్(Kareena Kapoor) ఎంతోమందికి ఫోన్లు చేసినా ఎవరూ రెస్పాండ్ అవ్వలేదు. ఇక నా కొడుకు తైమూర్ (Taimur) నా దగ్గరికి వచ్చి “నాన్న.. నువ్వు చనిపోతావా” అని చాలా దీనంగా అడిగాడు.వాడి మాటలకు నాకు కన్నీళ్లు వచ్చాయి. లేదు నాన్న నాకేమీ కాదు అని వాడిని ఓదార్చాను. ఆ తర్వాత కార్లు అందుబాటులో లేకపోవడంతో ఆటోలో నన్ను తీసుకువెళ్లారు. ఇబ్రహీంతో పాటు తైమూర్ కూడా ఆలోచించి నాన్న నేను కూడా వస్తాను అన్నాడు. అలా ముగ్గురం లీలావతి హాస్పిటల్ కి వెళ్ళాం. అయితే తైమూర్ నాతో రావడం నేను కూడా ఎమోషనల్ గా ఫీల్ అయ్యాను. ఎందుకంటే దాడి జరిగాక హాస్పిటల్ కి వెళ్ళిన సమయంలో ఒంటరిగా వెళ్లాలి అని నేను అనుకోలేదు. అందుకే నా కొడుకుని కూడా వెంటబెట్టుకొని వెళ్లాను.. నాకు ఏం జరిగినా కూడా ఆ టైంలో నా కొడుకు నా పక్కనే ఉండాలి అని నిర్ణయించుకున్నాను. అందుకే నాతో పాటు తైమూర్ ని కూడా తీసుకువెళ్లాను ” అంటూ సైఫ్ అలీ ఖాన్ (Saif Alikhan)చాలా ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం సైఫ్ అలీఖాన్ మాట్లాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
సైఫ్ అలీఖాన్ దాడిపై పలు రకాల రూమర్స్ వైరల్..
ఇక సైఫ్ అలీఖాన్ పై జరిగిన కత్తి దాడి పై ఎన్నో రూమర్లు వినిపించాయి. కొంతమందేమో సైఫ్ అలీ ఖాన్ తన పనిమనిషితో ఏకాంతంగా మాట్లాడుతున్న సమయంలో పనిమనిషి ప్రియుడు వచ్చి ఆయనపై అటాక్ చేశారు అని అంటే, మరికొంత మందేమో సైఫ్ ఇంట్లో దొంగతనానికి వచ్చిన వ్యక్తే అలా చేశారని అన్నారు.మరి ఈ కత్తి దాడి కేసులో ఇంకా ఎన్ని విషయాలు పోలీసులు బయటికి తీస్తారో చూడాలి.