Rohit Sharma: భారత్ – ఇంగ్లాండ్ మధ్య కటక్ వేదికగా జరిగిన రెండవ వన్డేలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీతో కదం తొక్కాడు. గత కొంతకాలంగా విఫలమవుతున్న రోహిత్ శర్మ ఫామ్ లోకి వచ్చేసాడు. ఇటీవల పెద్దగా రాణించలేకపోవడంతో ఇక అతడి కెరీర్ ముగిసిపోయిందేమోనన్న ఊహాగానాలు వినిపించాయి. కానీ ఎట్టకేలకు తన ఫామ్ ని చేజిక్కించుకొని ఈ రెండవ వన్డేలో ఓపెనర్ గా బ్యాటింగ్ కి దిగిన రోహిత్ శర్మ.. 90 బంతులలో 119 పరుగులు చేశాడు.
Also Read: IPL 2025: ఐపీఎల్ 2025 కంటే ముందే అన్ని స్టేడియాలకు బీసీసీఐ కొత్త కండిషన్స్ !
ఇందులో 12 ఫోర్లు, 7 సిక్సులు బాదాడు. చాలాకాలం తర్వాత హిట్ మ్యాన్ మెరుపు షాట్లతో విరుచుకుపడ్డాడు. మొదట 30 బంతులలోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ.. ఆదిల్ రషీద్ వేసిన 25.2 ఓవర్ కి సిక్స్ బాది సెంచరీ చేశాడు. 76 బంతుల్లోనే సెంచరీ నమోదు చేసుకున్నాడు. ఇక రోహిత్ శర్మకి వన్డేలలో ఇది 32వ సెంచరీ కాగా.. దాదాపు 16 నెలల తర్వాత వన్డేల్లో సెంచరీ చేయడం గమనార్హం. అంతర్జాతీయ క్రికెట్ లో రోహిత్ శర్మ ప్రత్యేకత గురించి కొత్తగా చెప్పక్కర్లేదు.
బౌండరీలు బాధడంలో రోహిత్ శర్మ అందరికంటే ముందే ఉంటాడు. ఇక సిక్సర్ల విషయంలో తనకు తానే సాటి. ఫార్మాట్ ఏదైనా రోహిత్ శర్మ భారీ ఇన్నింగ్స్ ఆడితే.. సిక్సర్ల వర్షం కురవాల్సిందే. రోహిత్ కేవలం 20 పరుగులు చేసినా.. అందులో కనీసం ఒక్క సిక్స్ అయినా ఉంటుంది. అలా తన అంతర్జాతీయ కెరీర్ లో ఎన్నో సిక్సులు కొట్టిన రోహిత్ శర్మ.. తాజాగా వన్డేల్లో ఓ రికార్డ్ ని బ్రేక్ చేశాడు.
అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో అత్యధిక సిక్సులు కొట్టిన రెండవ బ్యాటర్ గా నిలిచాడు రోహిత్ శర్మ. భారత్ – ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండవ వన్డే కి ముందు వెస్టిండీస్ ఓపెనర్ క్రిస్ గేల్ తో 331 సిక్సర్లతో సమంగా ఉన్న రోహిత్.. ఈ రెండవ వన్డే చేజింగ్ సమయంలో క్రిస్ గేల్ ని అధిగమించాడు. ఈ మ్యాచ్ లో 7 సిక్సర్లు బాధడంతో వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లలో క్రిస్ గేల్ ని వెనక్కి నెట్టి రెండవ స్థానానికి చేరుకున్నాడు. ఇక వన్డేలలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో 369 ఇన్నింగ్స్ లలో 351 సిక్సులతో షహీద్ అఫ్రిది మొదటి స్థానంలో ఉండగా..
Also Read: Champions Trophy 2025: గ్రౌండ్ లోనే తన్నుకున్న అక్తర్, హర్భజన్ సింగ్… వీడియో వైరల్ !
259 ఇన్నింగ్స్ లలో 334 సిక్సర్లతో రోహిత్ శర్మ రెండవ స్థానంలో నిలిచాడు. అలాగే 294 ఇన్నింగ్స్ లలో 331 సిక్సులతో క్రిస్ గేల్ మూడవ స్థానంలో ఉన్నాడు. 433 ఇన్నింగ్స్ లలో 270 సిక్సులతో సనత్ జయసూర్య నాలుగవ స్థానం, 297 ఇన్నింగ్స్ లలో 229 సిక్సులతో మహేంద్రసింగ్ ధోని ఐదవ స్థానంలో నిలిచారు. కాదా రోహిత్ శర్మ మరో 17 సిక్సర్లు బాదితే.. వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్ గా చరిత్ర సృష్టిస్తాడు. టి-20, వన్డేలు, టెస్ట్ మ్యాచ్ లలో 624 సిక్సర్లు కొట్టి.. ఫార్మాట్లలో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు కలిగి ఉన్నాడు రోహిత్ శర్మ.
Most sixes in ODIs:
351 – Shahid Afridi (369 Inns)
𝟑𝟑𝟒* – 𝐑𝐨𝐡𝐢𝐭 𝐒𝐡𝐚𝐫𝐦𝐚 (𝟐𝟓𝟗 𝐈𝐧𝐧𝐬)
331 – Chris Gayle (294 Inns)
270 – Sanath Jayasuriya (433 Inns)
229 – MS Dhoni (297 Inns)pic.twitter.com/85IsemMAcB— CricTracker (@Cricketracker) February 9, 2025